కృష్ణ

మూడేళ్లలో మహిళలకు ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూన్ 5: మహిళా సాధికారితలో భాగంగా రాబోయే 3 సంవత్సరాల్లో ఔత్సాహికులైన మహిళలకు వృత్తి శిక్షణ ఇచ్చి ఆర్థిక చేయూత కల్పిస్తామని జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ పేర్కొన్నారు. మంగళవారం కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ పాలక మండలి ఎన్నికై రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా వార్షికోత్సవ సమావేశం ముత్యాలంపాడు పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ అనూరాధ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 12 వందల మంది మహిళలకు వృత్తి శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేశామన్నారు. జిల్లాలోని మహిళలకు వృత్తి విద్య అందించడం ద్వారా వారిలో చైతన్యం పెంపొందించడానికి ప్రతి మండలానికి ఒక వృత్తి శిక్షణా కేంద్రం నెలకొల్పనున్నట్లు తెలిపారు. జిల్లాలో అన్ని ప్రజా పరిషత్ హైస్కూల్స్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను గుర్తించి మహిళ సమస్యలపై శిక్షణ ఇవ్వడం ద్వారా లైంగిక వేధింపులకు గురికాకుండా తగిన చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. గత రెండు సంవత్సరాల్లో జిల్లాలోని 974 గ్రాములకు వౌళిక సదుపాయాలతో కల్పించడటం పాటు ఉపాధిహామీ నిధులతో 500 సిసి రోడ్లు నిర్మించటం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టం జరిగిందన్నారు. స్మార్ట్ గ్రామాల్లో భాగంగా గన్నవరం మండలం అల్లాపురం గ్రామాన్ని దత్తత తీసుకొని వౌళిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ఎదుర్కొనే ప్రధాన సమస్యల పరిష్కారానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ప్రతిపత్తి పుల్లారావు, జిల్లా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, కొల్లురవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు శాసన మండలి సభ్యులు, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ తదితరుల సహకారం తీసుకుంటున్నామని చైర్మన్ గద్దె అనూరాథ వివరించారు.

బహిరంగ మలమూత్ర విసర్జన నివారణకు
కార్యాచరణ ప్రణాళిక

విజయవాడ (కార్పొరేషన్), జూలై 5: రాజధాని నగరంగా అభివృద్ది చెందుతున్న విజయవాడలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా అరికట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని విఎంసి సిఎంహెచ్‌ఓ డాక్టర్ గోపి నాయక్ పేర్కొన్నారు. రాబోయే కృష్ణా పుష్కరాలకు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో నగరంలో బహిరంగ మల మూత్ర విసర్జన శాశ్వతంగా నిర్మూలించేందుకు అవలంబించాల్సిన తీరుపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు మంగళవారం స్థానిక లబ్బీపేట మలేరియా కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎక్కువగా ఈ సమస్య ఉందో గుర్తించి ఆయా ప్రాంతాల్లో నిర్మూలన చర్యలు తీసుకోవడమే కాకుండా దీనివలన ఎదురయ్యే సమస్యలను ప్రజలకు వివరించాలన్నారు. స్వచ్చ భారత్‌లో భాగంగా ఈ విషయంపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తున్నామని. వీరికి నెలకు ఐదు వేల రూపాయలను జీతంగా అందిస్తామన్నారు. నగర వ్యాప్తంగా 97 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ ఎన్ రాజు, డాక్టర్ సిహెచ్ బాబూ శ్రీనివాస్, డాక్టర్ వి రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

బాంబు బూచితో విస్తృత తనిఖీలు

విజయవాడ (రైల్వేస్టేషన్), జూలై 5: ఒకే రోజు విజయవాడ డివిజన్‌లో రెండు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు ఉదంతాలు రావడంతో అధికారులు ఖంగారు పడ్డారు. మంగళవారం ఉదయం తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌లో బాంబులు పెట్టారని ఉదంతం రావడంతో విజయవాడ డివిజన్ అధికారులు హుటాహుటిన తరలివెళ్లారు. అక్కడ పరిశీలిస్తుండగానే విజయవాడ రైల్వేస్టేషన్‌లో 1వ నెంబర్ ప్లాట్‌ఫారంలో బాంబు పెట్టామని కంట్రోల్ రూంకు వచ్చిన మెసేజ్ ఆధారంగా సమాచారం వచ్చింది. అక్కడ నుంచి హుటాహుటిన అధికారులు ఇక్కడ గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జిఆర్‌పి), రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భారీ స్థాయిలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సెర్చ్ కోసం ఉన్న బలగాలన్నింటినీ విజయవాడ డివిజన్‌లో మోహరించి అణువణువూ తనిఖీ చేయటం ప్రారంభించారు. చివరకు తాడేపల్లిగూడెంలో ఏమీ లేదని తేల్చుకున్నా, ఇక్కడి పది ప్లాట్‌ఫారాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు ఏమీ లేదని తేల్చుకుని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తనిఖీలో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ నుంచి సిఐ సత్యనారాయణ, జిఆర్‌పి సిఐ రెడ్డి, ఆర్‌పిఎఫ్ సిఐ చక్రవర్తి, ఆర్‌పిఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఎఆర్ గాంధీ, జిఆర్‌పి ఎస్‌పి సిమోష్ బాయ్‌పాయ్, డిఎస్పీ రామకృష్ణ, తదితరులు పాల్గొని తనిఖీలు విస్తృతం చేశారు.