కృష్ణ

అమరావతి మారథాన్‌లో భాగస్వాములు కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జనవరి 2: నగరంలో ఈనెల 10న నిర్వహించనున్న అమరావతి మారథాన్ రన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్‌లో విద్యాసంస్థల యాజమాన్యాలతో, ప్రముఖ సంస్థల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమరావతి మారథాన్ రన్ టీషర్ట్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో చాలా మారథాన్‌లు చూస్తున్నామని, వాటి స్ఫూర్తితో అమరావతి మారథాన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మానసిక బంధాన్ని ఏర్పరచుకోవాలని, చూడడానికి వచ్చిన భాగస్వాములేనన్నారు. మంచి వాతావరణం నగరంలో ఉందని, పాల్గొన్న ప్రతి ఒక్కరికి టీషర్ట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ రన్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలని ఆయన పేర్కొన్నారు. నిర్వాహకులు మధు మాట్లాడుతూ వివిధ వయస్సు కేటగిరీల్లో జరుగుతుందని, 21 కిలోమీటర్లకు రూ.వెయ్యి, 10 కిలోమీటర్లకు రూ.700, 5 కిలోమీటర్లకు రూ.500 ఎంట్రీ ఫీజు ఉందన్నారు. డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు. అమరావతి మారథాన్ రన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ రన్ ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాధ్యతలను తీసుకుని ఎక్కువ మంది పాల్గొనేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలకు 9 నుండి 17 వరకు సంక్రాంతి సెలవులు కాగా వాటిని 11 నుండి ఇవ్వాలని డిఇఓకు కలెక్టర్ సూచించారు. దీంతో పాఠశాలలకు రెండు రోజుల సెలవుల కోత పడింది. ఇదిలా ఉంటే విద్యార్థులకు, క్రీడాకారులకు సైతం రిజిస్ట్రేషన్ ఫీజు పెంచడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీ ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ సుజన, డిఇఓ ఎ.సుబ్బారెడ్డి, డిఎస్‌డివో పి.రామకృష్ణ, గ్రీన్ కో ప్రతినిధి వాసుదేవరావు, రిలయన్స్ జియో ప్రతినిధి శైలజ, రన్ కన్వీనర్ పట్ట్భారామ్, డివైఈఓ కె.రవికుమార్, ఎం.మురళీకృష్ణ, వివిధ పాఠశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జన్మభూమి సభల్లో వినతుల వెల్లువ
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 2: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన 3వ జన్మభూమి - మా ఊరు గ్రామ సభలు తొలిరోజు నగరంలో ప్రశాంతంగా ముగిసాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ డివిజన్ 9వ డివిజన్ తోపాటు 1, 5, 9, 25, 30, 41, 48వ డివిజన్లలో జరిగిన జన్మభూమి సభలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ వినతులను అందజేయడమే కాకుండా మంజూరైన వివిధ సంక్షేమ పథకాలను ఆయా లబ్ధిదారులకు అందజేశారు. ఇదిలావుండగా గతంలో దరఖాస్తు చేసుకొన్న వారికి మంజూరైన రేషన్ కార్డులు సకాలంలో ముద్రించలేకపోవడంతో పంపిణీ చేయలేకపోవడం గమనార్హం. మంజూరైన లబ్ధిదారుల వివరాలను ప్రకటించి మరికొద్ది రోజుల్లో వారికి వారి కార్డులను అందిస్తామని అధికారులు ప్రకటించడంతో ఎంతో కాలంగా ఎదురుచూపులు చూస్తున్న లబ్ధిదారులు కొంత మేర నిరాశ చెందారు. డివిజన్ కార్పొరేటర్ల అధ్యక్షతన నగర పరిధిలో జరిగే పలు జన్మభూమి సభలలో విఎంసి కమిషనర్ వీరపాండియన్ తోపాటు స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొనగా 43వ డివిజన్ దుర్గాపురంలో జరిగిన జన్మభూమి సభలో మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు పాల్గొని ప్రభుత్వం తరఫున చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గూర్చి వివరించారు. జన్మభూమి సభలంటేనే విపక్షాల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడికిపోయేవన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం చేపట్టిన 3వ విడత జన్మభూమి సభలలో నగర పరిధిలోని ఏ డివిజన్‌లోనూ ఎటువంటి వ్యతిరేక ఆందోళనలు ఎదురుకాకపోవడంతో అధికార యంత్రాంగంతోపాటు అధికార పార్టీ నేతలు కూడా ఊపిరి పీల్చుకొన్నారు.
జన్మభూమి సభలను ప్రజలు
సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే ఉమ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమమహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం సెంట్రల్ పరిధిలోని 1వ డివిజన్ లోని మర్రి చెట్టు సెంటర్‌లో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను నేరుగా సంబంధిత అధికార యంత్రాంగానికి అందజేసుకోవడానికి గాను అన్ని శాఖలకు చెందిన అధికారులతో జన్మభూమి వేదికగా ఉంటుందని, ప్రజలు తాము ఎదుర్కొనే ఏ సమస్యనైనా జన్మభూమి సభలో విన్నవించుకోవచ్చునని తెలిపారు. ప్రభు త్వం అమలుచేస్తున్న, అమలుచేయబోయే పథకాలను ప్రజల దరిచేర్చి అ వగాహన కల్పించడమే కాకుండా ఆ యా పథకాల కింద మంజూరైన వా టిని లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ శివరంజని, టీమ్ లీడర్ అధికారి తోపాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ప్రజా క్షేమమే చంద్రబాబు ధ్యేయం
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ము ఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న పలు ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా 25వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మల్లికార్జున పేటలో జరిగిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సిఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. ప్రజలు సైతం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను విజయవంతం చేయడంలో కూడా ప్రజలు భాగస్వాములవ్వాలన్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో తెలుగు యువత నాయకులు అల్లాడి దుర్గారావు, గండికోట శ్రీనివాసు, బావిశెట్టి భాను తదితరులు పాల్గొన్నారు.