కృష్ణ

సేకరించేది 22 వేల ఎకరాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 9: బందరు ఓడరేవు, పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అవసరమైన భూముల విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు ప్రభుత్వం తెర దించింది. పోర్టు, కోస్టల్ కారిడార్ ఏర్పాటుకు లక్షా 5 వేల ఎకరాల భూమిని సమీకరించేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి శుక్రవారం రాత్రి చేసిన ప్రకటనతో బందరు వాసులు నిచ్చేష్టులయ్యారు. అయితే మరికొన్ని గంటలకే మంత్రి రఘునాధరెడ్డి పోర్టు, కారిడార్ ఏర్పాటుకు కేవలం 22వేల ఎకరాల భూమిని మాత్రమే సమీకరిస్తామని మరో ప్రకటన చేశారు. దీంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ గందరగోళ పరిస్థితులను స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెర దించారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పోర్టు, కారిడార్ ఏర్పాటుకు 22 వేల ఎకరాల భూమిని మాత్రమే సేకరిస్తామని మరోమారు స్పష్టం చేశారు. 22 వేల ఎకరాల్లో 14వేల ఎకరాలు పట్టా భూమి ఉందన్నారు. ఈ భూములను మాత్రమే ‘మడ’ ద్వారా సమీకరించడం జరుగుతుందన్నారు. 8వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు కూడా సిఆర్‌డిఎ తరహాలో ప్యాకేజీ ఇస్తామని స్పష్టం చేశారు. పట్టా భూముల రైతులకు ఎకరానికి వెయ్యి గజాలు ఇంటి స్థలం, 250 గజాలు కమర్షియల్ స్థలం, ప్రభుత్వ, అసైన్డ్ భూముల రైతులకు ఎకరానికి 800 గజాల ఇంటి స్థలం, 150 గజాల కమర్షియల్ స్థలం ఇస్తామన్నారు. సంవత్సరానికి 30వేలు చొప్పున కౌలు ఇవ్వడం జరుగుతుందన్నారు. పది సంవత్సరాల పాటు సంవత్సరానికి పది శాతం పెంచుతూ పరిహారం ఇస్తామన్నారు. అలాగే రైతు కూలీలకు నెలకు రూ.2వేలు చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. భూసమీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 11వతేదీన వెలువడే అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూసమీకరణ ప్రక్రియను 2017 నాటికి పూర్తి చేసి పోర్టు పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. గత పదేళ్ళు పోర్టు నిర్మాణాన్ని ఏ మాత్రం పట్టించుకోని మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని నేడు దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరులో ఓడరేవు నిర్మాణం పేర్ని నానికి ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. అందుకే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోర్టును గోగులేరుకు అమ్మేశారన్నారు. వాస్తవ పరిస్థితులను వక్రీకరిస్తూ రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్న పేర్నికి ఆ రైతులే బుద్ధి చెప్పే విధంగా చేస్తామన్నారు. రాజధాని ప్రాంత రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని దేవుడులా కొలుస్తున్నారన్నారు. లక్షలు విలువ చేసే భూములను కొంత రాజధానికి ఇవ్వడం వల్ల నేడు ఆ ప్రాంత రైతులు కోట్లకు అధిపతులయ్యారన్నారు. అటువంటి పరిస్థితులనే బందరులో కూడా తీసుకువస్తామన్నారు. పోర్టు, పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంత భూముల విలువ గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టిడిపి సీనియర్ నాయకులు బూరగడ్డ రమేష్ నాయుడు, గొర్రిపాటి గోపిచంద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా పుష్కర పనుల్లో భారీ అవినీతి
చల్లపల్లి, జూలై 9: కృష్ణా పుష్కర పనుల్లో భారీ అవినీతి జరుగుతుందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. పనులు సకాలంలో ప్రారంభించకుండా రూ.1000కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో పచ్చ చొక్కాలకు కేటాయించడం ద్వారా పూర్తి స్థాయి అవినీతికి ఆస్కారం ఏర్పడిందన్నారు. సిపిఐ పార్టీ విరాళాల సేకరణలో భాగంగా శుక్రవారం చల్లపల్లి వచ్చిన రామకృష్ణకు స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల పనులలో రూ.500కోట్ల అవినీతి జరిగిందని, ప్రస్తుతం నిబంధనల ప్రకారం టెండర్లు పిలువకుండా అధికార పార్టీ శ్రేణులకు పనులు అప్పగించటం ద్వారా కృష్ణా పుష్కరాల్లో మరింత దోపిడీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. కనీసం నామినేషన్లు కూడా ప్రకటించకుండానే అధికార పార్టీ నాయకులు అనేక చోట్ల పనులు పూర్తి చేసి బిల్లులకు వెళ్ళడం అవినీతికి పరాకాష్ట అన్నారు. పరిపాలనాదక్షుడునని చెప్పుకునే చంద్రబాబు సైతం నిబంధనలు అతిక్రమించి పుష్కర నిధులు దోచేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవటాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుత్తెరగాలన్నారు. పనులు పరిశీలనకు వెళ్ళే ప్రతి సారీ పనులు నాణ్యతా లోపంగా ఉన్నాయని చెప్పే చంద్రబాబు సదరు కాంట్రాక్టర్లపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూమి పిచ్చి పట్టిందన్నారు. 10లక్షల ఎకరాల భూ బ్యాంక్ ఏర్పాటుతో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. మచిలీపట్నం పోర్టు పేరిట భూసేకరణకు తెర తీయటం, రాష్ట్రంలో 15వేల హెక్టార్ల అటవీ భూమి డిఫారిస్టేషన్‌కు విఫలయత్నాలు చేయడం ప్రభుత్వ భూ దాహానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు.