కృష్ణ

అధికార పార్టీ మినహా ఇతర రాజకీయ పక్షాలు శత్రువులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 2: అధికార పార్టీ మినహా రాష్ట్రంలో ఇతర రాజకీ య పక్షాల వారందరినీ శత్రువుల్లా భా విస్తున్నారా? అని సిపిఐ రాష్ట్ర కార్యాదర్శి, మాజీ శాసనసభ్యులు కె రామకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలో ఇత ర రాజకీయపక్షాల వారందరినీ శత్రువుల్తో సమానంగా భావిస్తూ అక్రమ అ రెస్టులు, నిర్బంధాలకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. ప్రశ్నలను తట్టుకోలేని పాలకులు నిరంకుశ స్వభావుల్లో సమానమని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో నేడు జన్మభూమి ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారనే సాకుతో సిపిఐ విజయనగరం జిల్లా కార్యదర్శి పి కామేశ్వరరావు, జిల్లా సిపి ఐ నాయకులు ఆల్తి అప్పలనాయుడు, రమణలను, సిపిఐ నాయకులను ముం దస్తుగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. జన్మభూమి కార్యక్రమాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలన్నారు. పాలనలోని లోపాల్ని ఎత్తిచూపామేగానీ, ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటే సిపిఐ ఏనాడూ ప్రభుత్వానికి అడ్డుచెప్పలేదన్నారు.