కృష్ణ

ఆయకట్టు చివరి ఎకరాకూ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: సాగునీటి సంఘాల, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ప్రతినిధులకు అప్పగించిన విధులు, బాధ్యతలను సేవా దృక్పథంతో నిర్వర్తించి ఆయకట్టు చివరి భూమి వరకు నీరందించి పంటలను కాడేందుకు కృషిచేయాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జలవనరులశాఖ విజయవాడ సర్కిల్ కార్యాలయం ఆవరణలో గురువారం సాగునీటి సంఘాల, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు నీటి యాజమాన్య వ్యవస్థ, సాగునీటి సంఘాల విధులు, బాధ్యతలపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశానికి వెనె్నముకైన రైతులకు అవసరమైన ప్రయోజనాలను కల్పించటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్రం ఆర్ధిక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వేలాది కోట్ల రూపాయలను మంజూరు చేసి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టి నవ్యాంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జలదీక్షను చేపట్టటం జరిగిందన్నారు. నదుల అనుసంధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా చేపట్టిన ఘనత మన రాష్ట్రానికే దక్కిందన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం సాగునీటి సంఘాల, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కమిటీ ప్రతినిధులు, జలవనరులశాఖ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతలను పంచుకొని రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఈ ఏడాది నీరు-చెట్టు పథకం కింద 89 కోట్ల రూపాయల పనులను పూర్తిచేయటం జరిగిందన్నారు. చేపట్టే పనుల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిచేయటంలో సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ప్రతినిధులు నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలన్నారు. సాగునీటి సంఘాల, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీలకు వారి డివిజన్ పరిధిలో కార్యాలయ భవనాన్ని నిర్మించటం జరుగుతుందని అప్పటివరకు వారి సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని రైతాంగం కొరకు చేపట్టే చర్యలపై ఎప్పటికప్పుడు చర్చించాలన్నారు. సాగునీటి వ్యవస్థ నిర్వహణలో రైతు సంస్థలకు నిర్ణయాత్మకమైన పాత్రను కల్పించాలనే సదుద్దేశంతో రైతు యాజమాన్య చట్టాన్ని అమల్లోకి తీసుకురావటం జరిగిందన్నారు. సాగునీటి నిర్వహణకు గుర్తించిన పనులకు అంచనాలను తయారుచేసి పరిపాలనామోదానికి లోబడి నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తిచేయాలన్నారు. నీటి విడుదలపై నిర్వాహక మండలి తీసుకున్న నిర్ణయాలను అమలుచేయటంతోపాటు కాలువలను పర్యవేక్షిస్తూ నీటి వినియోగాన్ని క్రమబద్దీకరించుకోవాలన్నారు. మురుగునీటి కాలువలను నిరంతరం తనిఖీచేస్తూ విడుదల చేసిన నీటిని చివరి భూముల వరకు పారుదల జరిగేలా కృషి చేయాలన్నారు. ఖరీఫ్, రబీ పంట ప్రారంభాకి ముందుగానే సాగునీటి సంఘాలు తమ పరిధిలోని కాలువలను, కట్టడాలను తనిఖీచేసి పరిస్థితి నమోదు చేయాలన్నారు.
జలవనరులశాఖ సలహాదారు చెరుకూరి వీరయ్య మాట్లాడుతూ మనిషి మనుగడకే కాక మానవజాతి అభివృద్ధికి నీరు ఎంతో అవసరమన్నారు. పట్టణీకరణ, పరిశ్రమల రంగాలకు నీటి అవసరం ఏర్పడటంతో ప్రస్తుతం వ్యవసాయ రంగానికి వినియోగించే నీటి శాతం తగ్గిపోతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వాడుకొని వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీటిపారుదల వ్యవస్థ నిర్వహణలో వినియోగదారులైన రైతుల పాత్ర ప్రముఖంగా ఉంటుందన్నారు. కేవలం ప్రభుత్వమే కాక రైతుల సహకారంతో సాగునీటి పథకాలను నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సాగునీటి సంఘాల అధికార పరిధి, పంపిణీ విధానంపై పూర్తి అవగాహన కలిగినప్పుడే సభ్యులకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారన్నారు. సాగునీటి సంఘాలు ఖరీఫ్, రబీ పంట కాలానికి ముందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ప్రతి రైతుకు నీటి పంపిణీ చేయాలన్నారు. సాగునీటి వ్యవస్థ పోషణ మరమ్మతులకు ప్రణాళికలను రూపొందించుకుని అమలుచేయాల్సిన అవసరం ఉందన్నారు. సంఘాల జమా ఖర్చులపై వార్షిక, ఆర్థిక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి రైతులకు సేవలు అందించి రాష్ట్భ్రావృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు.
శిక్షణా కార్యక్రమంలో జలవనరులశాఖ కమిషనర్ శశిభూషణ్ కుమార్, ఎపిఐఎల్‌ఐపి ప్రాజెక్టు డైరక్టర్ వి.వెంకట్రామయ్య, బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఎంపి రఘుబాబు, జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్లు ఎం.రవికుమార్, వైఎస్ సుధాకర్, షబ్జాన్, వీర్రాజు, ఎస్‌ఇలు, సి.రామకృష్ణ, నరసింహమూర్తి, శ్రీనివాసరావు, రమణ, గ్రౌండ్ వాటర్ డిడిలు వరప్రసాద్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, సాగునీటి సంఘాల, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.