కృష్ణ

పదేళ్ల పోరాటం ఫలించింది... పోర్టుతో పంట పండుతుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జూలై 13: బంద్‌లు... నిరసనలు.. నిరాహారదీక్షలు... ఉద్యమాలు ఇలా పదేళ్ల పాటు ఆందోళనలు చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు వచ్చి సాధించుకున్నదే బందరు పోర్టు అని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణ తెలిపారు. బుధవారం నగరంలోని జలవనరులశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎపి కొనకళ్లతో పాటు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ఏపి రాష్ట్రానికి గేట్‌వేగా ఉన్న బందరుపోర్టు నిర్మాణం కృష్ణాజిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. పోర్టు ద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు మరింతగా పెరుగుతాయన్నారు. కేవలం పోర్టు నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యం కాదని ఇందుకోసం పారిశ్రామిక కేరిడార్‌ను ఏర్పాటు చేసి, పరిశ్రమల స్థాపనకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. పోర్టు నిర్మాణంతో వ్యవసాయ ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం కలగడమే కాకుండా, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఇతర దేశాల నుండి దిగుమతులను తక్కువ ఖర్చుతో పోర్టు ద్వారా తీసురావచ్చన్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వ మచిలీపట్నం ఏరియా డవలప్‌మెంట్ అథారటీ (మడ)ను ఏర్పాటు చేయడంతో పాటు ఛైర్మన్‌గా ఐఎఎస్ అధికారిని, మరో 20 మంది జెసిలను నియమించనుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మడ పరిధి మాత్రం లక్షా ఐదు వేల ఎకరాలు అని, కాని పోర్టు ఏర్పాటుతో పాటు పారిశ్రామిక కేరిడార్ కోసం 14వేల ఎకరాలను మాత్రమే సేకరించేందుకు కేబినెట్ నిర్ణయించిందన్నారు. దీనిలోనే మెగా టౌన్‌షిప్‌ను నిర్మించి అందులో రైతులకు అమరావతిలో ఇస్తున్న విధంగా ఎకరానికి వెయ్యిగజాల ఇళ్లస్థలం, రెండు వంద గజాల కమర్షియల్ స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పోర్టు నిర్మాణం కోసం భూములిచ్చే రైతులను ఒప్పించి..వారిని మెప్పించి మాత్రమే భూములను సేకరించడం జరగుతుందని స్పష్టం చేశారు. బందరు సర్వతో ముఖాభివృద్ధికి సిఎం ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారని ఎంతో దూరదృష్టితో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ, కాకినాడ తరహాలో పోర్టును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతి పక్షాలు మాత్రం విషయంపై లేని పోని అపోహలు స్పష్టిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ద్వారా ఎంతో అభివృద్ధి చేయాలని కృతనిశ్చయంతో ఉన్న తరుణంలో భూముల విషయంలో ప్రతి పక్షాలు భూసేకరణకు అడ్డుకోవడం అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని ఆయన వివరించారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన పోర్టును నేటి టిడిపి ప్రభుత్వం భుజస్కందాలపై వేసుకుని అభివృద్ధి చేస్తుంటే భూకబ్జాదారుడు జగన్ అసూయాద్యేషాలతో భూ సమీకరణకు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. రాజధానికి దేశంలో ఏప్రభుత్వ ఇవ్వనటువంటి ప్యాకేజీని ఇచ్చి వారిని పూర్తిగా సంతృప్తి పరిచామని, ఇదే తరహాలో పోర్టు కోసం భూమునిచ్చే రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. కంటైనర్ హాబ్‌గా పోర్టును అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. బందరుపోర్టు సాధన వెనుక జరిగిన సంఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రజల వద్దకు వెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు.

అద్భుతంగా టిటిడి శ్రీవారి నమూన ఆలయం
* కలెక్టర్ బాబుఎ

ఇంద్రకీలాద్రి, జూలై 13: తిరుమల - తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి నమూనా దేవాలయంలో పుష్కరాలకు వచ్చే భక్తులకు దర్శనం కల్పించటం జరుగుతుందని కలెక్టర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తిరుమల - తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు, ఇంజనీరులు, అర్చకులు, జిల్లా అధికారులు, విజయవాడ నరగపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసే నమూనా దేవాలయంపై కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ దేవస్థానం అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పుష్కర ఏర్పాట్లను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున యాత్రికులను అకట్టుకునేవిధంగా స్వరాజ్ మైదానాన్ని తీర్చిదిద్దాలన్నారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం తరుపున సంపూర్ణ సహకారం ఉంటుందని, ప్రతి పనిలో అప్రమత్తంగా ఉండి భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరాల సమయంలో స్వామివారిని అత్యధిక మంది భక్తులు దర్శించే అవకాశం ఉన్నందున రాత్రివేళలో చక్కటి విద్యుత్ దీపాలతోపాటు, పరిసరాల ప్రాంతాల్లో పచ్చదనం ఉండే విధంగా మొక్కలు ఏర్పాటు చేయాలన్నారు. టిటిడి వారు కోరిన విధంగా డెడికేటివ్‌వాటర్ లైను ద్వారా నీటి సరఫరా అందించాలని కలెక్టర్ విజయవాడ నగరపాలక సంస్ధ అధికారులకు సూచించారు. పుష్కరాల సమయంలో రైతుబజారు వద్ద చెత్తను, స్వరాజ్ మైదానంలో చెత్తను తరలించేందుకుర ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లను నియమించాలని కలెక్టర్ నగరపాలక సంస్ధ అధికారులకు ఆదేశించారు. ప్రసాదాల పంపిణీ, మంచినీటి సరఫరా విషయంలో సంబంధింత అధికారులు ప్రత్యేక శ్రద్ధ సారించాలన్నారు. స్వరాజ్ మైదానం వద్ద అవసరమైన మరుగుదొడ్లతోపాటు డ్రైనేజీ విధానం సక్రమంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈసమావేశంలో తిరుమల-తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ అఫీసర్ జె శ్రీనివాసరాజు, జిల్లా జాయింట్ సెక్రటరీ గంధం చంద్రుడు, సబ్‌కలెక్టర్ డాక్టర్ జి సృజన, నూజివీడు సబ్‌కలెక్టర్ జి లక్ష్మీశా, తిరుమల - తిరుపతిదేవస్థానం చీఫ్ అడిషనల్ విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివకుమార్, ఎస్‌శిబిసి సిఇఓలు ఎవి నరసింహరావు, వియంసి ఇఇ సిహెచ్ ధనంజయ, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

కృష్ణలంకకు
మూడు సబ్‌వేలు నిర్మించాలి
* శిరోముండనంతో బిజెపి నిరసన
బెంజిసర్కిల్, జూలై 13: నగరాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పనులకు సంబంధించి కృష్ణలంక ప్రాంతంలో 3 సబ్‌వేలను నిర్మించాలని భారతీయ జనతా పార్టీ మరియు కృష్ణానది పరీవాక ప్రాంత నివాసితతుల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం నగరంలోని కృష్ణలంకలోని రాణీగారితోటలో 3 సబ్‌లేలను నిర్మించాలని కోరుతూ వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బిజెపితో పాటు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు బిజెపితో పాటు కమిటీ సభ్యులు గుండు గీయించుకుని వారి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా పరిరక్షణ కమిటీ ఛైర్మన్ వాసా పల్లపరాజు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వలన కృష్ణలంకలో నివసిస్తున్న లక్షా యాభై వేల మందికి ఒక సబ్‌వే మాత్రమే వేస్తున్నారని, దీని కారణంగా కృష్ణలంకలో ఉన్న ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అధికారులు పరిస్థితులను గమనించి మరో మూడు సబ్‌వేలను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎస్‌హెచ్ 5పైన ఉన్న 5 వేల లోపు ప్రజల కోసం సబ్‌వే నిర్మాణం జరిగింది గాని, కృష్ణలంక పరిధిలో ఉన్న ప్రాంతాల్లో మాత్రం నిర్మాణాలు జరగలేదన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, పరిరక్షణ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, స్థానికలు పాల్కొన్నారు.