కృష్ణ

కొలువు తీరిన కొత్త డిజిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 23: రాష్ట్ర కొత్త డిజిపిగా నండూరి సాంబశివరావు బాధ్యతలు చేపట్టారు. పదవి విరమణ పొందిన జెవి రాముడు నుంచి ఆయన డిజిపి క్యాంపు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నాం బాధ్యతలు అందుకున్నారు. క్యాంపు కార్యాలయంలో కొత్త డిజిపి కొలువు తీరడమే తడవుగా రాష్ట్రంలోని యూనిట్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. అప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి ఐపిఎస్ అధికారులతో సమన్వయానికి ఆయన శ్రీకారం చుట్టారు. పోలీసుశాఖను సరికొత్త పంథాలో నడిపేందుకు 60రోజులు డెడ్‌లైన్‌గా పెట్టుకుని సంస్కరణలకు ఆయన తెర తీయనున్నారు. ఇదిలావుండగా.. పదవి విరమణ పొందిన జెవి రాముడుకు రాష్ట్ర పోలీసుశాఖ ఓ వైపు వీడ్కోలు పలుకుతూనే.. ఇదే సమయంలో నూతన డిజిపి నండూరి సాంబశివరావుకు స్వాగతం పలికింది. నగర పోలీసుశాఖ ఆధ్వర్యాన బందరురోడ్డులోని ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరికి పోలీసు ఘన సెల్యూట్ చేసింది. రిటైర్డ్ అయిన తమ అధికారికి టాటా చెప్పడంతో ఓ వైపు ఉద్వేగ భరితం.. వస్తున్న అభిమాన అధికారికి స్వాగతం పలకడం మరోవైపు ఆనంద క్షణాలు ఇలా ఒకే సమయంలో పోలీసు కుటుంబం రెండు అనుభవాలను చవిచూసింది. కింది స్థాయి నుంచి వచ్చిన తాను పదవివిరమణ పొందడం బాధ అనిపించినా.. తప్పనిసరని, అయితే తన సర్వీసులో ఉమ్మడి రాష్ట్రంలో ఒకేసారి మినహా అనుభవమంతా తెలంగాణాతోనే ముడి పడి ఉందని జెవి రాముడు అన్నారు. ఆయన్ను ప్రశంసిస్తూ విభజన తర్వాత సవాళ్ళ సమయంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు డిజిపిగా రావడం ఆనందంగా ఉన్నా.. ఛాలెంజ్‌గా తీసుకుని పని చేస్తానని మరోవైపు నండూరి సాంబశివరావు ఈసందర్భంగా అన్నారు. డిజిపి జెవి రాముడు పదవి విరమణ పొందిన సందర్భంగా ఆయన స్థానంలో కొత్త డిజిపిగా నండూరిని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నాం 12:20 గంలటకు డిజిపి క్యాంపు కార్యాలయంలో అంగరంగ వైభవంగా మేళతాళాలు, పూజాకార్యక్రమాల నడుమ ముహర్తానికి నండూరి జెవి రాముడు నుంచి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉదయం 7:45 గంటలకు ఏఆర్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వీడ్కోలు-స్వాగతం కార్యక్రమం సందర్భంగా సాయుధ పోలీసు బలగాలు కవాతు నిర్వహించారు. మేళతాళాల మధ్య కార్యక్రమం ఉద్వేగభరితంగా సాగింది. సాయుధ బలగాల నుంచి అధికారులు గౌరవ వందనం స్వీకరించారు. ఉన్నతాధికారుల అందరూ కలిసి గ్రూపు ఫొటో దిగారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తనను ఎంతో వేదనకు గురి చేసిందని, తన సర్వీసులో మొత్తం తెలంగాణాలోనే వివిధ హోదాల్లో పని చేసానని, తొలి రోజుల్లో మాత్రమే ఒకసారి గుంటూరు జిల్లాలో విధులు నిర్వహించినట్లు ఈ సందర్భంగా జెవి రాముడు గుర్తు చేసుకున్నారు. అక్కడి నుంచి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మీదట బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నండూరి సాంబశివరావు మాట్లాడుతూ విభజన అనంతరం సవాళ్ళ సమయంలో బాధ్యతలు చేపట్టడం ఛాలెంజింగ్‌గా ఉందని, సాంకేతిక పరిఙ్ఞనికి పెద్ద పీట వస్తూ పోలీసుశాఖ సంస్కరణకు ఉపక్రస్తానన్నారు. పోలీసు విధుల్లో సృజనాత్మకత తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఇప్పటికిప్పుడు వచ్చే 30రోజుల్లో కృష్ణా పుష్కరాలే ముందున్న తక్షణ కర్తవ్యమని, విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా 60రోజులు గడువు పెట్టుకుని సంస్కరణలు చేపట్టడం మరో అంశంగా ఆయన పేర్కొన్నారు. పోలీసు హెడ్ క్వార్టర్ హైదరాబాద్ నుంచి వెంటనే తరలించడమే ప్రధానమన్నారు. అనంతరం జెవి రాముడును వాహనంపై ఎక్కించి తాడుతో లాగుతూ ఆయనకు అధికారులు వీడ్కోలు పలికారు. మొత్తం ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కార్యదర్శి అనురాధ, అదనపు డిజిపిలు ఏబి వెంకటేశ్వరరావు, ద్వారకా తిరుమలరావు, ఆర్‌పి ఠాకూర్, మీనా, ఎన్‌వి సురేంద్రబాబు, పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, డిఐజిలు, ఐజిలు, ఎస్పీలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
* యూనిట్ అధికారులతో తొలి సమీక్ష
అనంతరం డిజిపి రాష్ట్రంలోని యూనిట్ అధికారులతో తొలి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు వాట్సాఫ్ గ్రూపు క్రియేట్ చేసి ఐపిఎస్ అధికారులందరినీ అందులోకి తీసుకుని పర్యవేక్షణకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రోజువారీ పోలీసు అధికారుల పనితీరును సమీక్షించేందుకు కూడా మరో గ్రూపును క్రియేట్ చేశారు. క్రమశిక్షణ, సమన్వయంతో పోలీసుశాఖ పనితీరు మెరుగుపరుకునేందుకు కృషి చేయాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు.