కృష్ణ

ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 25: ప్రజా సాధికార సర్వేను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో డిఆర్‌ఓ రంగయ్య మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ప్రజా సాధికార సర్వే తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేను వేగవంతం చేయాల్సిన బాధ్యత మండల ప్రత్యేక అధికారులపై ఉందన్నారు. ఎన్యూమరేటర్లు విధిగా ఇంటింటికి వెళ్ళి కుటుంబంలోని ప్రతి ఒక్కరి సమగ్ర సమాచారాన్ని సేకరించాలన్నారు. సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ‘మీకోసం’లో వచ్చే అర్జీలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెండింగ్‌లో అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బందరు ఆర్డీవో సాయిబాబు, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎన్‌వివి సత్యనారాయణ, సోషల్ వెల్ఫేర్ జెడి ప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి, సిపిఓ రత్నబాబు, సర్వే ఎడి విజయబాబు, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు పాల్గొన్నారు.
ఆలయాలను సందర్శించిన ఎండోమెంట్ కమిషనర్
నాగాయలంక, జూలై 25: స్థానిక కృష్ణా తీరాన గల శ్రీరామపాదక్షేత్రం వద్ద కృష్ణా పుష్కరాలు సందర్భంగా నిర్మాణ దశలో ఉన్న వివిధ ఆలయాలను దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి సత్యనారాయణ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పుష్కరాలకు చేపట్టిన ఘాట్ల నిర్మాణ పనులు, ఆలయ పునః నిర్మాణ పనులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ప్రధాన రహదారుల అభివృద్ధి కారణంగా యాత్రీకులకు మిక్కిలి సౌకర్యంగా ఉండగలదన్నారు. ఆలయాల నిర్మాణ పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆయన కోరారు. సత్యనారాయణ వెంట సంబంధిత శాఖ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, ఆలయాల సముదాయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టివివి మోహనరావు ఉన్నారు.