కృష్ణ

అదనపు బలగాలతో ప్రత్యేక బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, జూలై 25: కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్‌పి విజయకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని వేదాద్రి, ముక్త్యాల క్షేత్రాలను సందర్శించి పుష్కర ఘాట్‌ల నిర్మాణ పనులు, ఆలయాల్లో ఏర్పాట్లు ఇతర అంశాలను పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ క్షేత్రాలకు విశేషంగా భక్తులు తరలివస్తారని అంచనాలు ఉన్నాయని, దానికి తగినట్లుగా ఏర్పాట్లు, భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల్లోని సంఘటనలు కృష్ణా పుష్కరాల్లో జరగకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందని, ఇప్పటి నుండి పోలీస్ యంత్రాంగాన్ని సిద్ధం చేసి వారికి విధుల నిర్వహణ, బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. వేలాదిగా తరలివచ్చే వాహనాలకు తగినట్లుగా రూట్ మ్యాప్‌ను, పార్కింగ్ ప్రత్యేక స్థలాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. భక్తులు స్నానాలు చేసే సమయంలో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పిండ ప్రదానాలకు ప్రత్యేక ప్లాట్ ఫారమ్‌లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయాల్లో క్యూలైన్‌లు ఏర్పాటు చేసి క్రమ పద్ధతిలో భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఆయనతో పాటు పుష్కరాల ప్రత్యేక డిఎస్‌పి వెంకట రమణ, జగ్గయ్యపేట సిఐ లచ్చునాయుడు, చిల్లకల్లు ఎస్‌ఐ వంశీకృష్ణ, వేదాద్రి కార్యనిర్వహణ అధికారి డి శ్రీరాం వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.