కృష్ణ

నిధుల వినియోగంపై విరుద్ధ సమాధానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జూలై 30: జన్మభూమి - మా ఊరు గ్రామసభల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా ఖర్చు చేసినట్టు చూపటంపై శనివారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపిడిఓ ఎస్ పద్మసుధను ఎంపిటిసి సభ్యుడు మూడే శివశంకర్ వివరణ కోరటంతో చివరలో సభ దద్దరిల్లింది. ఎమ్మెల్యే కల్పన ప్రసంగం పూర్తయ్యాక శివశంకర్ పక్కా ఆధారాలతో ఎంపిడిఓని నిలదీశారు. మొదటి విడత జన్మభూమికి రూ.1.43 లక్షలు, రెండో విడతకు రూ.1.38 లక్షలు, మూడో విడతకు రూ.74వేలను ప్రభుత్వం కేటాయించగా మొత్తం ఖర్చుచేసినట్లు ఎంపిడిఓ లిఖితపూర్వకంగా లెక్క చూపారని శివశంకర్ అన్నారు. అలాగే సంక్రాంతి సంబరాల నిధులను ఖర్చుచేయనట్టు సమాచార హక్కు చట్టం కింద తెలిపి, మరొకరు కోరిన సమాచారంలో నిధులన్నీ ఖర్చుచేసినట్టు లేఖ ఇచ్చారని తెలిపారు. ఈ లేఖలను సభలో ఉన్న ఎమ్మెల్యే కల్పన ముందుపెట్టారు. నిధులను ఖర్చు చేశామని ఎంపిడిఓ తెలపటంతో పాములలంక సర్పంచ్ పాముల శ్రీనివాసరావు లేచి గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. దీంతో జెడ్పీటిసి తాతినేని పద్మావతి కలుగజేసుకుని సమాధానం చెప్పబోగా మీకేమి సంబంధమని సర్పంచ్ శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఎంపిడిఓని వెనకేసుకు వస్తారేమిటని సర్పంచ్ అనటంతో మీరు గౌరవ సభ్యుడు మాత్రమేనని, అలా మాట్లాడొద్దని పద్మావతి వ్యాఖ్యానించారు. మీరూ గౌరవ సభ్యులేనని, సభాధ్యక్ష స్థానంలో ఎంపిపి ఉండగా అన్ని విషయాలను మీరు చర్చిస్తారేంటని శ్రీనివాసరావు ఎదురుదాడి చేశారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపిడిఓ పద్మసుధ సమాధానం చెప్పాల్సిందేనని శివశంకర్ పట్టుబట్టటంతో ఆ నిధులను ఆయిల్ ఖర్చులకు వాడానని, త్వరలో పంచాయతీలకు సర్డుబాటు చేస్తానని తెలిపారు. సంక్రాంతి సంబరాల నిధులను సక్రమంగానే వినియోగించానని సమాధానమిచ్చారు.