కృష్ణ

కౌంట్ డౌన్-13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 30: ఘాట్లను 150 నుంచి 200 మీటర్లకు ఒక సెక్టార్ ఉండేలా విభజించి, ప్రతి సెక్టారులో ఉంచాల్సిన మెటీరియల్, మ్యాన్‌పవర్‌కు సంబంధించిన మైక్రో లెవల్ ప్లానింగ్‌ను ప్రతి శాఖ రూపొందించనుంది. ప్రతి సెక్టారుకు ఒక సబ్ కలెక్టర్ స్థాయి అధికారిని ఇన్‌ఛార్జి అధికారిగా నియమిస్తున్నట్లు పోలీస్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్‌డబ్ల్యుఎస్, ఆర్ అండ్ బి, పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ వంటి అన్ని శాఖలు తమ శాఖ అధికారులను సెక్టార్‌లో నియమించాలని సూచించారు. ప్రతి సెక్టారులో అన్ని శాఖలు మూడు షిఫ్టుల్లో ఉద్యోగుల్ని నియమించుకోవాలని పుష్కరాల ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్ సూచించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు రెండో షిఫ్టు, రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు మూడు షిఫ్టులుగా నిర్వహించాలని ఆయన సూచించారు. మూడు షిఫ్టులకు నియమించే ఉద్యోగుల పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ల నివేదిక జిల్లా యంత్రాంగానికి ఆదివారం లోపు అందించాలని సూచించారు.
పూజా ద్రవ్యాల కిట్‌లు
జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ ప్రతి ఘాట్‌లోను పిండ ప్రదానం ప్లాట్‌ఫారాన్ని ఆనుకొని, పూజా ద్రవ్యాలు అమ్మే మహిళా సంఘాల స్టాళ్లను ఏర్పాటు చేయాలని డిఆర్‌డిఎ పిడిని ఆదేశించారు. అదే విధంగా డిఆర్‌డిఎ తరపున మహిళా సంఘాల ఉత్పత్తుల అమ్మకాల స్టాళ్లను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 150, పవిత్ర సంగమం వద్ద 50, ప్రకాశం బ్యారేజి దిగువన ఆప్రాన్ వద్ద 50, మొత్తం 250 స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల మహిళా సంఘాలకు కూడా ఈ స్టాల్స్‌లో చోటు కల్పించాలన్నారు. పూజా ద్రవ్యాల కిట్లు రూపొందించేందుకు ఆంధ్రాబ్యాంక్ ఒక లక్ష బ్యాగ్‌లు, స్టేట్ బ్యాంక్ 1.5 లక్షల బ్యాగులు అందించాయని డిఆర్‌డిఎ పిడి చంద్రశేఖరరాజు వివరించారు. ఈ పూజా ద్రవ్యాల్లో త్వరగా పాడవని కొబ్బరికాయ, కుంకుమ, పసుపు వంటి ద్రవ్యాలను వచ్చే నెల 7నాటికి మహిళా సంఘాలకు అందజేస్తామన్నారు. త్వరగా పాడయ్యే పాలు, పూలు వంటివి వచ్చే నెల పదో తేదీనాటికి అందజేస్తామన్నారు. ఇందువల్ల 12 నాటికి కిట్‌లు రూపొందించి మహిళా సంఘాలు అమ్మకాలకు సిద్ధం చేస్తాయని ఆయన వివరించారు.
నీరు - ఆహార పదార్థాల సరఫరా
పుష్కర నగర్‌లలో యాత్రికులకు, విధుల నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆహార పదార్థాలు సరఫరా వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పుష్కరనగర్ సమీపంలో వంట చేసేందుకు తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన కోరారు. ఆయా ప్రాంతాల్లో వంట చేసేందుకు అవసరమైన మంచినీటిని సరఫరాకు ఏర్పాట్లు చేయాల్సిందిగా గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
రైలు, బస్సు సౌకర్యాలు
పుష్కర యాత్రికుల కోసం ప్రత్యేకంగా వేసిన రైళ్లు, శాటిలైట్ స్టేషన్ల వరకు నడపాలని అయితే వాటి బోర్డుపై వాటి పేర్లతో పాటు విజయవాడ పేరును కూడా గుర్తింపు కోసం ఉంచాలని కలెక్టర్ సూచించారు. శాటిలైట్ స్టేషన్లతో పాటు పుష్కరనగర్‌లో టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తాత్కాలిక బస్ స్టేషన్లలో యాత్రికుల రద్దీని బట్టి అదనపు బస్సులు ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆర్‌టిసి అధికారులను కోరారు.
వైద్య సౌకర్యాలు
ప్రతి ఘాట్‌లోను సెక్టార్ల వారీగా వైద్య శిబిరాలు నిర్వహించాలని, వీటి పర్యవేక్షణకు నిరంతరం ప్రత్యేక వైద్యులను ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టి పరిసరాలు ఆరోగ్యకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం సూక్ష్మస్థాయి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉద్యోగులకు డ్రెస్ కోడ్
ప్రతి శాఖ పుష్కర విధుల్లో ఉన్న తమ ఉద్యోగులకు ప్రత్యేక రంగుతో కూడిన అప్రాన్లు (జాకెట్స్) ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందువల్ల ఆయా శాఖల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుందని ఆయన అన్నారు. విద్యుత్‌శాఖ, మత్స్యశాఖ వంటి కొన్ని శాఖలు ఇప్పటికే వీటిని ఏర్పాటు చేసుకున్నాయన్నారు. కృష్ణా పుష్కరాల లోగోని ఆయా శాఖల పేర్లను వీటిపై ప్రధానంగా కనబడే విధంగా ముద్రించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ జి.సృజన, డిఆర్‌వో సిహెచ్ రంగయ్య, ఎస్‌ఆర్ అండ్ బి శేషుకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.