కృష్ణ

అందరి సహకారాలతో ఉత్తమ సేవలు అందించా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఆగస్టు 1: అందరి సహాయ సహకారాలతో ఉత్తమ సేవలు అందించానని పదవీ విరమణ చేసిన జిల్లా పౌర సంబంధాల అధికారి జి గోవిందరాజులు అన్నారు. మచిలీపట్నం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం గోవిందరాజులును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గోవిందరాజులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణతో పాటు నిబద్ధతతో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. సమాచార శాఖలో సేవలు కొంత క్లిష్ఠంగా ఉంటాయన్నారు. కష్టాన్ని ఇష్టంగా మలుచుకుంటే ఎంతటి కష్టానైనా సునాయాసంగా జయించవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు పి సాంబ శివరావు, కార్యదర్శి కొడాలి శ్రీనివాస్, కోశాధికారి ముదిగొండ శాస్ర్తీ, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

దొంగల కమిటీలతో పాలన చేస్తున్న సిఎం
కృత్తివెన్ను, ఆగస్టు 1: జన్మభూమి కమిటీలు దొంగల కమిటీలుగా మారాయని బిజెపి జిల్లా అధ్యక్షులు చిగురుపాటి కుమార స్వామి విమర్శించారు. ఈ కమిటీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. సోమవారం కృత్తివెన్నులో బిజెపి మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన కుమారస్వామి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీ బిజెపిదేనన్నారు. 2019లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి విజయభేరి మోగిస్తుందన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరొందిన బిజెపిలో వారసత్వ రాజకీయాలకు తావు లేదన్నారు. బిజెపిని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల నియామకం చేపట్టామని చెప్పారు. పార్టీలో కష్టపడే వారికే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. కేంద్రంపై టిడిపి చేస్తున్న విమర్శలను ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. విమర్శలు చేసే ముందు తమ స్థాయి ఏమిటో తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిందంటే అందుకు ప్రధాన కారణం నరేంద్ర మోది, పవన్ కళ్యాణ్ మాత్రమేనన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని అర్ధరహిత వ్యాఖ్యలను టిడిపి నాయకులు కట్టబెట్టాలన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళ లేక బిజెపితో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ సమావేశంలో బిజెపి మండల కన్వీనర్ దాసరి వెంకట శ్రీనివాసరావు, కార్యదర్శి కన్నా వెంకట్రావ్, బిజెపి జిల్లా కార్యదర్శి పుప్పాల రాము, ఉపాధ్యక్షులు శివరామకృష్ణ, మజ్దూర్, యువ మోర్చ కార్యదర్శులు మాసాబత్తుల శ్రీనివాస్, యిల్లూరి నాగబాబు, యువ, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు గోపిశెట్టి దుర్గా ప్రసాద్, నిమ్మగడ్డ నాని తదితరులు పాల్గొన్నారు.