కృష్ణ

గ్రామీణ భారతాన్ని విస్మరించిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, ఆగస్టు 3: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి ఆర్థిక సంఘం నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని అణగదొక్కుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని వేమవరం గ్రామానికి వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గత వారం రోజులుగా రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్, తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల సర్పంచ్‌లు, జెడ్పీటిసిలు, ఎంపిపి సంఘాలకు చెందిన 50 మంది రాష్ట్ర నాయకులు ఆరుగురు కేంద్ర మంత్రులను కలిసి సమస్యపై చర్చించి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. అయినప్పటికీ కేంద్ర మంత్రుల నుంచి స్పందన లేదన్నారు. దీంతో తీవ్రంగా నిరాశ చెందామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల పట్ల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని ఆయన నిరసన తెలిపారు. 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల, జిల్లా పరిషత్‌లకు కేంద్ర ప్రభుత్వం పాత పద్ధతిలోనే నిధులు కేటాయించాలని, లేకపోతే డిసెంబరులో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలే కాకుండా దేశంలోని 29 రాష్ట్రాల్లోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్పీటిసిలు, ఎంపిపిలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వంపై ఉద్యమించటానికి సంసిద్ధం చేస్తామని హెచ్చరించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని కూడా రాజేంద్ర ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిల సంఘం అధ్యక్షులు కాసరనేని మురళి, ఉయ్యూరు మాజీ ఎంపిపి బీమవరపు పెద్దిరెడ్డి, ఉప్పులూరు ఎంపిటిసి పి మధుసూదనరావు, జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షులు రాఘవేంద్రప్రసాద్, ఎంపిపి కొసరాజు విజయభారతి, వడ్లమన్నాడు ఎంపిటిసి బెల్లంకొండ ఏడుకొండలు, పెనమలూరు కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు ప్రసాద్ పాల్గొన్నారు. తొలుత రాజేంద్రప్రసాద్ మండల పరిధిలోని వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

అక్రమంగా నిల్వ చేసిన
రూ.13లక్షల మినుములు స్వాధీనం
కూచిపూడి, ఆగస్టు 3: మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ చేసిన 133 క్వింటాళ్ల మినుములను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిటి విఎం ఇందిరాదేవి బృందం సీజ్ చేశారు. చినముత్తేవి గ్రామానికి చెందిన యారా శ్రీనివాసరావు అదే గ్రామంలోని ప్రధాన రహదారిలోని యరబర్ల శివప్రసాద్ ఇంట్లోని గోదాములో 50కిలోల బరువైన 266 బస్తాల్లో మినుములు నిల్వ చేశారు. జిల్లా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ బాబు ఆదేశం మేరకు డిటి ఇందిరాదేవి తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.13లక్షల విలువైన మినుములను స్వాధీనం చేసుకుని అధికారుల సమక్షంలో తూకాలు వేసి కూచిపూడి దుకాణానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ అధికారులు ఎం వెంకటేశ్వరరావు, హెచ్‌సి రాజు, పిసి మారుతి, మొవ్వ ఆర్‌ఐ ఎ శ్రీనివాసరావు, హెచ్‌సి నాంచారయ్య, తదితరులు పాల్గొన్నారు. కాగా మండలంలోని పలు గ్రామాల్లో ఈవిధంగా అక్రమంగా మినుములు నిల్వ చేసినట్లు పలువురు రైతులు పేర్కొంటున్నారు. క్వింటా రూ.14వేలకు ధర పలికి అనంతరం రూ.10వేలకు తగ్గిపోవటంతో తిరిగి పాత ధర వచ్చే అవకాశం ఉందన్న ఆశతో వర్తకులు మినుములు నిల్వ చేసినట్లు భావిస్తున్నారు. ఏదిఏమైనా అనుమతి లేకుండా లక్షలాది రూపాయల విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసి ధరలు పెంచేందుకు దళారులు చేస్తున్న ప్రయత్నాలకు ఈ తనిఖీలు గుణపాఠంగా పలువురు పేర్కొంటున్నారు.