కృష్ణ

పంటల అధిక ఉత్పత్తే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 13: రాష్ట్రంలో ఈ ఏడాది సాగుచేసిన అన్ని పంటల్లో ఉత్పాదకత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఒకవైపు వర్షపాతం లోటు, మరోవైపు డ్రైస్పెల్ ఉన్నప్పటికీ ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణంలో తగ్గుదల లేదన్నారు. శనివారం సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకవైపు కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో తలమునకలుగా ఉంటూనే మరోవైపు వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన 5200 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 23లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉండగా 26,31,000 హెక్టార్లలో వేశారంటూ, 110 శాతం సాగు జరిగిందన్నారు. ‘ఇ-క్రాపింగ్’ మందుకొడిగా జరుగడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 25శాతం కూడా చేయలేదంటూ దీన్ని వేగవంతం చేయాలన్నారు. ఈ సీజన్‌లో కొత్తగా 4,74,000 సాయిల్ హెల్త్‌కార్డులు ఇచ్చారని, ఈ వారం 3వేల టన్నులు మైక్రో న్యూట్రియంట్స్ పంపిణీ చేశారని, ఎరువుల పంపిణీ సక్రమంగా చేస్తున్నారంటూ, పంట పెరుగుదలను బట్టి ఎప్పటికప్పుడు ఇన్‌పుట్స్ సరఫరా జరగాలన్నారు. రాష్ట్రంలో ఏ రైతు, కౌలురైతూ తనకు పంట రుణం అందలేదని అనకూడదంటూ, పంట రుణాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రీమియం చెల్లింపునకు ఆఖరి తేదీ 21లోపు పంటల బీమా నమోదు కార్యక్రమం పూర్తిచేయాలన్నారు. 15,497 రెయిన్ గన్స్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇంతవరకు 6,322 ఇచ్చారంటూ, డ్రైస్పెల్ వచ్చిన ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పంటలను కాపాడుకోవాలంటే మిగిలిన రెయిన్ గన్స్ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. సకాలంలో రెయిన్ గన్స్ ఏర్పాటు చేయకపోతే వాటివల్ల ప్రయోజనం ఉండదని, వాటిపై దాదాపు రూ.160 కోట్లు వ్యయం చేస్తున్నామని, దానికి తగ్గ ఫలితాలు పంట ఉత్పాదనలో కనిపించాలన్నారు. ప్రకాశం జిల్లాలో డ్రైస్పెల్ అధికంగా ఉన్నందున రెయిన్ గన్స్ వినియోగించి పంటలు కాపాడాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టుల్లో ఖాళీలను వెంటనే భర్తీచేయాలని, ప్రతిచోటా దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయంటూ, ఎంపీఈవోలు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సీజన్ పోతే మళ్ళీరాదు కనుక అధికార యంత్రాంగం రైతు సేవలో నిమగ్నం కావాలని, వారంవారం సాధించిన ప్రగతిని వివరించాలని ఆదేశించారు. పశుగ్రాసం సాగుకు రైతులు ముందుకొస్తున్నారని, వారికి కావాల్సిన పశుగ్రామ విత్తనాలు సరఫరా చేయడం ద్వారా రాష్టవ్య్రాప్తంగా గ్రీన్ ఫోడర్, న్యూట్రిషన్ ఫోడర్ సాగును ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

అనుక్షణం అప్రమత్తం!
* ఘాట్‌ను పరిశీలించిన డిజిపి నండూరి
పటమట, ఆగస్టు 13: కృష్ణా పుష్కరాల తొలిరోజు పద్మావతి ఘాట్‌లో శుక్రవారం అపశ్రుతి చోటుచేసుకొని కిరణ్‌కుమార్ అనే ఐదేళ్ల బాలుడు మృతి చెందటంతో రెండోరోజు భద్రతను కట్టుదిట్టం చేశారు. శనివారం ఉదయం రాష్ట్ర ఇన్‌చార్జ్ డిజిపి నండూరి సాంబశివరావు పద్మావతి ఘాట్‌ను పరిశీలించారు. ఎలాంటి స్వల్ప దుర్ఘటన కూడా జరగకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు. పద్మావతి ఘాట్ పొడవునా, ఘాట్ వద్ద, పరిసర ప్రాంతాల్లో పోలీసులు క్షణక్షణం అపమ్రత్తంగా వుండాలని ఆయన ఆదేశించారు. ఘాట్‌లో ఎప్పటికప్పుడు సిసి కెమెరాల ద్వారా భక్తుల తాకిడిని మానిటరింగ్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేయటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు సడలించినా కొందరు పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తూ తమకేమీ పట్టనట్లు వ్యహరించటం విమర్శలకు తావిస్తోంది.

సర్కారు అప్రదిష్టకు విపక్షాల కుట్ర
* మంత్రి దేవినేని ఉమ విమర్శ
పటమట, ఆగస్టు 13: పత్రిపక్షాలు ఎన్ని కుతంత్రాలు చేసినా, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని చూసినా కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును యాత్రికులు మెచ్చుకుంటున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం పద్మావతి, కృష్ణవేణి ఘాట్లను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రెండోరోజు గంటగంటకూ యాత్రికుల రాక పెరిగిందని తెలిపారు. యాత్రికుల రద్దీని బట్టి అవసరమైన సౌకర్యాలు ఎప్పటికప్పుడు పెంచుతున్నామన్నారు. ఘాట్లలో కొన్నిచోట్ల టైల్స్ విరగటం, మరికొన్ని చోట్ల పూర్తిగా పాడవటం చూసి అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్మరపాలేనికి చెందిన టి వెంకట నరసమ్మను ‘నీవు చేసిన పనికి తగిన కూలి ఇస్తున్నారా?’ అని మంత్రి అడగ్గా, ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల వరకు పనిచేస్తున్నందుకు 300 రూపాయలే చేల్లిస్తున్నారని చెప్పింది. దీంతో అక్కడే వున్న అధికారులను మంత్రి ఉమ పిలిచి న్యాయబద్ధంగా వారికివ్వాల్సిన సొమ్ము చెల్లించాలని అదేశించారు.

భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి, ఆగస్టు 13: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆదిపరాశక్తి శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకోటానికి భక్తులు కృష్ణా పుష్కరాల రెండో రోజైన శనివారం బారులుతీరారు. శనివారం నుండి మూడు రోజులు సెలవులు కావటంతో ఉదయం 9గంటల నుండే వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరావటంతో రద్దీ ఏర్పడింది. శనివారం అర్ధరాత్రి పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు క్యూమార్గం గుండా సుమారు 5కిలోమీటర్ల దూరం నడిచి కొండపైకి చేరారు. అమ్మవారిని ముఖమండప దర్శనం చేసుకొని మొక్కుబడులు చెల్లించున్నారు. వేకువఝామున క్యూమార్గాల్లో భక్తుల సంఖ్య కొంతమేర తక్కువగా ఉన్నప్పటికీ ఉదయం 9గంటల నుండి క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం 3గంటల సమయానికి రద్దీగా మారింది.
ఇవోకు అవమానం
సాక్షాత్తూ దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి వాహనానే్న శనివారం పోలీసులు అమ్మవారి టోల్‌గేట్ వద్ద నిలిపేసి అవమానించారు. శనివారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో కొండ కింద చేసిన ఏర్పాట్లను తనిఖీ చేసిన తర్వాత ఆమె పాస్ ఉన్న ఆలయ వాహనంలో కొండ పైకి వెళ్లేందుకు అమ్మవారి టోల్‌గేట్ వద్దకు రాగానే పోలీసులు కారును ఆపేశారు. దీంతో కారుడ్రైవర్ మేడమ్ దుర్గగుడి ఇవో అని కారుకు ఉన్న పాస్‌ను చూపిస్తుండగా టోల్‌గేట్ వద్ద ఉన్న ఒక పోలీస్ అధికారి వచ్చి ‘ఇవో అంటే ఏమిటి అర్ధం చెప్పాలని’ సూర్యకుమారితో వాదనకు దిగారు. దీంతో సూర్యకుమారి వన్‌టౌన్ సిఐకు విషయాన్ని ఫోన్‌లో వివరించారు. ఆయన వెంటనే అమ్మవారి టోట్‌గేట్ వద్దకు చేరుకొని ఇవో కారును పంపారు. దీంతో ఇవో అమ్మవారి రాజగోపురం వద్ద ఉన్న పోలీసు అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులకు పిర్యాదు చేసేందుకు ఆమె సిద్ధమైనట్లు తెలిసింది.