కృష్ణ

ముక్త్యాలలో పుష్కర స్నానాలకు పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, ఆగస్టు 15: కృష్ణా పుష్కరాలు నాలుగో రోజు సోమవారం శెలవురోజు కావటంతో ముక్త్యాలలో భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే వేలాదిగా గ్రామానికి చేరుకున్న భక్తులు భవానీ ముక్తేశ్వర ఘాట్‌లో పుష్కర స్నానాలు చేశారు. ఈ సందర్భంగా ఘాట్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. పెద్ద ఎత్తున పిండ ప్రదానాలు మహిళలు, చిన్నారులు జల్లు స్నానాలు చేశారు. ఉత్తర వాహిని, కోటిలింగాల జగపతి సత్యనానంద స్వామి ఘాటు, అలకనంద రివర్‌లోని రెండు ఘాట్‌లలో వేలాది మంది పుణ్య స్నానాలు ఆచరించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి వందలాది వాహనాలు తరలిరావటంతో పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ చేసి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చేశారు. నదీ స్నానం అనంతరం భక్తులు శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి వారిని పంచమృఖ అమృతలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలైన్‌లలో బారులుతీరారు. ఆలయ అధికారుల భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులు సేవలందించారు. మహిళలు కృష్ణమ్మ తల్లికి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలు సమర్పించారు.