కృష్ణ

అదే హోరు.. అదే జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 20: తొమ్మిదోరోజూ అదే హోరు.. అదే జోరు! చిన్నారుల జలకాలాటలు, యువత కేరింతల మధ్య కృష్ణా పుష్కరాలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగుతున్నాయి. ఒక్కోరోజు ఒక్కో ఘట్టం మాదిరిగా పుష్కరాలు ముందుకు సాగుతున్నాయి. పుష్కరాలు ప్రారంభమై తొమ్మిది రోజులు గడిచినప్పటికీ పుష్కర స్నానాలు చేసే భక్తుల్లో జోరు ఏమాత్రం తగ్గడం లేదు. రెట్టించిన ఉత్సాహంతో పుష్కర స్నానాలకు వస్తున్నారు. ఫలితంగా పుష్కర ఘాట్‌ల వద్ద సందడి నెలకొంటోంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ఆధ్యాత్మికవేత్తలు, సాహిత్యవేత్తలు, పీఠాధిపతులు కృష్ణమ్మను పూజిస్తున్నారు. దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారంతా స్వస్థలానికి వచ్చి కృష్ణానది జలాలతో పవిత్రులవుతున్నారు. తొలిరోజుల్లో పుష్కర భక్తుల సంఖ్య అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ మూడోరోజు నుండి రద్దీ విపరీతంగా పెరిగింది. పుష్కరాల 12రోజుల్లో 3.5కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని జిల్లా అధికార యంత్రాంగం అంచనా వేసింది. అయితే ఈ 9 రోజుల్లో కోటి మంది పుష్కర స్నానాలు ఆచరించారు. రానున్న మూడురోజుల్లో కూడా రెట్టింపు స్థాయిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా చివరి మూడురోజులైన ఆదివారం సెలవు దినం కావటం, సోమ, మంగళవారాల్లో కూడా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించటంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీయ పర్యవేక్షణలో జరుగుతున్న పుష్కరాల్లో లక్షలాది మంది ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ ప్రతి క్షణం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ పుష్కరాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళుతున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా పోలీసు శాఖ యాత్రికుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపడుతోంది. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్‌కుమార్ నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేశారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా చెన్నై-వైజాగ్, వైజాగ్-చెన్నై మధ్య రాకపోకలు సాగించే భారీ వాహనాలను ప్రత్యేక మార్గాల గుండా తరలిస్తూ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చూస్తున్నారు.

తప్పిపోయిన పిల్లలు క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు!
* చిన్నారులకు ట్యాగులు కట్టిన మంత్రులు
ఇబ్రహీంపట్నం/ జి.కొండూరు, ఆగస్టు 20: తప్పిపోయిన చిన్నారులకు ఐసిడిఎస్, స్ర్తిశిశుసంక్షేమ శాఖ సిబ్బంది వేస్తున్న బ్యాండులు వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఫెర్రీ పవిత్ర సంగమం ఘాట్ వద్ద రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, కొల్లు రవీంద్ర శనివారం పలువురు చిన్నారుల చేతులకు స్వయంగా బ్యాండులు వేశారు. ఆబ్యాండుపై చిన్నారుల తల్లిదండ్రుల చిరుమానా, ఫోన్ నెంబరును రాస్తున్నారు. దీనివల్ల తప్పిపోయిన సందర్భంలో పిల్లలు సునాయాసంగా తల్లిదండ్రుల వద్దకు చేరుతున్నారు. దీంతో పుష్కర యాత్రికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ 5,340 మంది పిల్లలకు సంగమం ఘాట్ల వద్ద ట్యాగ్‌లు వేయగా, వీరిలో 129 పిల్లలు తప్పిపోయారు. వీరిని మైక్ అనౌన్స్‌మెంట్ ద్వారా సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మూడుజిల్లాల్లో పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి 91 ప్రదేశాల్లో కౌంటర్లను ఏర్పాటు చేసి 1,72,000 మంది పిల్లలకు బ్యాండులు వేయగా, వీరిలో దాదాపు పదివేల మంది పిల్లలు దారితప్పారు. వీరిని తల్లిదండ్రుల వద్దకు నిముషాల వ్యవధిలోనే చేర్చి భక్తులకు విశేష సేవలందించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు సేవలందిస్తున్నారు.

చివరి అంకంలో అలసత్వం వద్దు
* టెలీ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
బెంజిసర్కిల్, ఆగస్టు 20: కృష్ణా పుష్కరాలలో ఏమాత్రం మాట రాకుండా, లోపం లేకుండా తొమ్మిది రోజులు పుష్కరాలు విజయవంతమయ్యేలా పని చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పుష్కరాలు చివరి దశకు చేరుకున్నాయని, రానున్న మూడు రోజుల్లో మరింత ఉత్సాహంగా, అలసత్వం లేకుండా పూర్తి అప్రమత్తతో పనిచేయాలని ఆయన అన్నారు. శనివారం ఆయన పుష్కరాలు తొమ్మిదో రోజు ఏర్పాట్లపై ఉండవల్లిలోని తన నివాసం నుంచి అధికారులు, సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి చూపుతున్న ఈ ఉత్సాహం తగ్గకుండా మరింత చురుకుగా విధులు నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా రోజుకు ఏడున్నర లక్షల మందికి అన్నదానం చేయడమనేది ఒక చరిత్ర అని అన్నారు. దేశంలోని పలు దేవాలయాల్లో అన్నదానం చేస్తారు కాని ఇంత ఎక్కువుగా ఉండదని, దీనిని డాక్యుమెంటేషన్ చేయాలని ఆయన సూచించారు. అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, సమాజ సేవకులు, అన్ని వర్గాల ప్రజలకు, సంస్థలకు ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పుష్కర ఏర్పాట్లపై ప్రజల స్పందన తెలుసుకోవాలన్నారు. పుష్కర స్నానాల్లో వృద్ధులు, వికలాంగులకు క్షేత్ర స్థాయి ఉద్యోగులు, సిబ్బంది సహకరించాలన్నారు. పుష్కర ఏర్పాట్లపై ప్రజల్లో సంతృప్తి బాగుందని అన్ని సర్వేల ఫలితాలు వెల్లడిస్నున్నాయన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు పిండ ప్రదానం కోసం మరిన్ని కిట్లు సిద్ధం చేయాలని ఆయన అధికారులను అదేశించారు. రానున్న మూడు రోజుల్లో సుమారు 50 వేల కిట్లు సిద్ధం చేయాలన్నారు. పిండ ప్రదానం కోసం టెంట్ల విస్తీర్ణం పెంచాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య, ఆరోగ్య శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివారం పుష్కర యాత్రికుల సంఖ్య భారీగా ఉంటుందని, కాబట్టి బందోబస్తు, రవాణా, ఆహారం, మంచినీటి సరఫరా ఏర్పాట్లు అధికంగా ఉండాలన్నారు. పుష్కరం అనేది కులం, మతం, ఆచారానికి సంబంధించిన వేడుక కాదని, పరమత సహనానికి పుష్కరాలే స్ఫూర్తి అని ఆయన అన్నారు. అన్ని మతాలు వారు, వర్గాల వారు తరతమ భేదాలు విస్మరించి పుష్కర స్నానం చేయడం విశేషంగా పేర్కొన్నారు. పుష్కర స్నానంతో నదికి వందనాలు సమర్పించి రుణం తీర్చుకోవాలన్నారు.