కృష్ణ

తెలుగుతమ్ముళ్ల వేధింపులతో.. పురుగుల మందు తాగిన రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఆగస్టు 20: తన పొలంలోని విద్యుత్ వైర్లను గ్రామానికి చెందిన తెలుగుతమ్ముళ్లు కట్ చేస్తున్నారని, ఈవిషయాన్ని విద్యుత్, పోలీస్ శాఖల అధికారులకు తెలియజేసినా పట్టించుకోక పోవటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. మండలంలోని చండ్రగూడెం గ్రామానికి చెందిన తాతా వెంకన్న(55) తనకున్న వరి పొలంలోని విద్యుత్ వైరును గ్రామానికి చెందిన తెలుగుతమ్ముళ్లు కట్ చేస్తున్నందున పొలం ఎండిపోయిందని, ఈవిషయంపై అధికారులు కూడా పట్టించుకోనందుకు నిరసనగా పొలంలోనే ఈ నెల 18న పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఇతన్ని విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందినప్పటికీ మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

3 లక్షల మంది భక్తులకు వైద్యసేవలు
తోట్లవల్లూరు, ఆగస్టు 20: పుష్కరాల్లో ఇప్పటివరకు జిల్లాలో 3 లక్షల మంది భక్తులకు ప్రత్యేక శిబిరాల్లో వైద్యసేవలు అందించామని డిఎంహెచ్‌ఓ ఆర్ నాగమల్లేశ్వరి తెలిపారు. తోట్లవల్లూరు భ్రమరాంబికా పుష్కర ఘాట్‌ను శనివారం ఆమె సందర్శించారు. ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని పరిశీలించారు. శిబిరంలో డాక్టర్ పి సుధారాణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్ జి భద్రు, ఎంపిడిఓ ఈశ్వరపద్మసుధ, ఘాట్ ఇన్‌చార్జి శివప్రసాద్‌తో కలిసి పుష్కరాల విశేషాలు తెలుసుకున్నారు. మండలంలో ఏడు ఘాట్లలో వైద్యశిబిరాలు ఉన్నాయని, ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని తహశీల్దార్ వివరించారు. ఈసందర్భంగా నాగమల్లేశ్వరి మాట్లాడుతు జిల్లాలో జరుగుతున్న పుష్కరాల్లో అన్ని ఘాట్‌ల వద్ద ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేశామని, మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. దాదాపు 3 లక్షల మందికి వైద్యసేవలు అందాయన్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడలేదన్నారు. డిఎంహెచ్‌ఓ వెంట కంకిపాడు పీహెచ్‌సీ సివిల్ సర్జన్ లోకమోహన్‌రావు ఉన్నారు.