కృష్ణ

పేదరికం లేని సమాజమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం/ మైలవరం, ఆగస్టు 22: రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధించేందుకు ప్రణాళికాబద్ధమైన కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కృష్ణా పుష్కరాల 11వ రోజైన సోమవారం ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు హారతినిచ్చే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన తర్వాత రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉందని, సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. అలాగని చేతులు కట్టుకుని కూర్చోకుండా సమస్యలను అధిగమించి ముందుకు పోతున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రణాళికాబద్ధమైన కృషి చేస్తూ రాష్ట్రాన్ని 2022 నాటికి దేశంలోనే మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే అభివృద్ధిలో అగ్ర రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే ఆదర్శ రాష్ట్రం తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. నదుల అనుసంధానం ఒక చారిత్రక ఘట్టమన్నారు. గోదావరి - కృష్ణా నదులను అనుసంధానించి దేశంలోనే చరిత్ర సృష్టించామన్నారు. ఇదే స్ఫూర్తి, సంకల్ప బలంతో ఈ రెండు నదులకు పెన్నానదిని అనుసంధానం చేసి రాయలసీమను రతనాలసీమగా మారుస్తానని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇందుకు అందరి సహకారం అవసరమన్నారు. సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్లని చెప్పిన ఎన్టీఆర్ కలలను నిజం చేసేందుకు కంకణం కట్టుకుని పనిచేస్తున్నానన్నారు. అన్ని కులాలు, మతాలు తనకు ఒక్కటేనన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం ద్వారా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పుష్కరాలను విజయవంతం చేశామన్నారు. ఇప్పటికి 1.80 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. ఇదే టెక్నాలజీతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. తనపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంచితే కొండనైనా బండలు చేస్తానన్నారు. అవకాశం కల్పిస్తే మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారని, పివి సింధు మన తెలుగుబిడ్డ కావటం అదృష్టమన్నారు. ఆమె తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిందన్నారు. అందుకే ఆమెకు మూడు కోట్ల రూపాయల నజరానా ప్రకటించినట్లు తెలిపారు. ఈ నెల 23న ఆమెకు పవిత్ర సంగమంలో సన్మానించనున్నట్లు తెలిపారు. ఆమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన సౌకర్యాలను తాను కల్పిస్తానన్నారు. విభజనలో ఎదురైన సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని దాన్ని అవకాశంగా మలుచుకుని సమష్టి కృషితో నవ్యాంద్ర నిర్మాణానికి బాటలు వేస్తానని ప్రకటించారు. పుష్కరాలు విజయవంతంగా కొనసాగటానికి పోలీసులు, అధికార యంత్రాంగం విద్యార్థినీ, విద్యార్థులు చేసిన కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఆధ్యాత్మిక గురువు విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ ప్రసంగిస్తూ పుష్కర సమయాన పవిత్ర సంగమంలో పుష్కరుడితో పాటు ముక్కోటి దేవతల శక్తి సమ్మిళితమై ఉందన్నారు. వ్యక్తి శక్తిమంతుడైతేనే సమాజం కీర్తిస్తుందన్నారు. శక్తిమంతుడైన నేత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటంతో ప్రపంచం అంతా మనవైపే చూస్తోందన్నారు. తెలుగువారంతా సమైక్యంగా నిలబడి రాష్ట్రాన్ని శక్తిమంతం చేయాలన్నారు. రాజకీయ చరుతుడు, ధర్మనిరతుడైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న మహా సంకల్పానికి అందరూ సహకరిస్తే శక్తిమంతమైన రాజధాని అమరావతి నిర్మాణం అసాధ్యం కాదన్నారు. సినీనటుడు సాయికుమార్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల నిర్వహణ, నవ నిత్యహారతి దర్శనం నేత్రపర్వంగా ఉందన్నారు. ఈసందర్భంగా స్మార్ట్ గ్రామాల సర్పంచ్‌లను చంద్రబాబు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావ్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, పైడికొండల మాణిక్యాలరావు, అచ్చన్నాయుడు, పి నారాయణ, ఎంపిలు కేశినేని నాని, మాగంటి వెంకటేశ్వరరావు, గల్లా జయదేవ్, గోకరాజు గంగరాజు, ఎమ్మెల్సీలు రాజేంద్రప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, నన్నపనేని రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు.