కృష్ణ

దేశభక్తికే కళంకం తెచ్చిన కాంగ్రెస్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఆగస్టు 22: అరవై రెండేళ్ల కాంగ్రెస్ పాలన దేశభక్తికే కళంకం తెచ్చిందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ నెల 17 నుండి వారం రోజులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్ర కార్యక్రమం ముగింపు సందర్భంగా సోమవారం కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కె హరిబాబు ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కుమారస్వామి అధ్యక్షతన పింగళి వెంకయ్య స్మారక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వాకం వల్ల ‘్భరత్ మాతాకీ జై’ అనే నినాదాలు చేయబోమని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రకటించడం విచారకరమన్నారు. అలాంటి విద్యార్థులకు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ యువతలో దేశభక్తిని పెంపొందింపజేసి అవినీతిని అంతమొందించేందుకు తిరంగా యాత్రను చేపట్టారన్నారు. ఇందుకోసం ఎన్డీఏ, మిత్రపక్షాలు కూడా తమ ప్రాంతాల్లోని స్వాతంత్య్ర సమరయోధుల గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మోదీ ఆదేశించారన్నారు. ఇందువల్ల దేశంలో అవినీతి తగ్గుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రూ.12లక్షల కోట్ల అవినీతి జరగటంతో యువతలో దేశభక్తి కొరవడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్ఠానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడతామని చెప్పడం సిగ్గుచేటన్నారు. బిజెపి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చనుందని తెలిపారు. తొలుత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహానికి సిద్ధార్థనాథ్ సింగ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య, మాజీ మంత్రులు కావూరి సాంబశివరావు, ఎర్నేని సీతాదేవి, తదితరులు పాల్గొన్నారు.