కృష్ణ

ఆర్థిక సమానత్వ సాధనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, ఆగస్టు 22: రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు నిర్మూలించడానికి సమగ్ర విధానాన్ని అమలు చేస్తున్నామని ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కళావేదికపై రెండంకెల ప్రగతి సాధనే ధ్యేయంగా చర్చాగోష్టి కార్యక్రమాన్ని సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ అభివృద్ధి ఫలాలను, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అందేవిధంగా సర్కారు పనిచేస్తోందన్నారు. విభజన నేపథ్యంలో ఎదురైన సవాళ్ళను ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందన్నారు. రెండేళ్ళ పాలనలో 8.3 నుంచి 10.99 శాతానికి వృద్ధి రేటును పెంచామన్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందన్నారు. 2029 నాటికి దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయరంగంతో పాటు పారిశ్రామిక రంగ అభివృద్ధికి అందరూ కృషిచేయాలన్నారు. పట్టణాలతో పాటు, గ్రామాలు కూడా అభివృద్ధి సాధనే లక్ష్యంగా వృద్ధిరేటును 15శాతం వరకూ పెంపొందిస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఆదాయం పెరిగితే తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. పాడిపరిశ్రమ, ఉద్యానవన పంటలు, ఆక్వారంగం అభివృద్ధి ద్వారా వలస కూలీలకు ఉపాధి లభిస్తుందన్నారు. చర్చాగోష్టిలో ప్రణాళిక శాఖ కార్యదర్శి సంజయ్‌గుప్తా మాట్లాడుతూ సిఎం చంద్రబాబునాయుడు కృషితో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావు మాట్లాడుతూ సంతోష అభివృద్ధి సూచికలో రాష్ట్రం 118వ స్థానంలో ఉందన్నారు. ప్రణాళిక శాఖ డైరెక్టర్ ఎన్‌వై శాస్ర్తీ మాట్లాడుతూ స్థిర ఆదాయంతో ఆదాయ వనరులను పెంపొందించుకోవచ్చన్నారు. 20 సూత్రాల ఆర్ధిక కార్యక్రమం అమలు చైర్మన్ వై శేషసాయిబాబు సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో సంక్షేమ పథకాలు అర్హులకే వర్తింపచేస్తున్నట్లు తెలిపారు. 31శాతం అక్షరాశ్యత సాధించామన్నారు. వ్యవసాయ రుణాల మాఫీకి 11,500 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. సదస్సులో వివిధ అంశాలపై వ్యక్తృత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కూచిపూడి నాట్యం, బుర్రకథ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.