కృష్ణ

మసీదుల మరమ్మతులకు నిధులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 6: మైలవరం మండలంలోని పలు మసీదుల మరమ్మతు పనులకు గానూ నిధులు మంజూరైనట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఈనిధులకు సంబంధించిన చెక్కులను ఆయన తన కార్యాలయంలో ముస్లింలకు అందించారు. వౌజన్ ఇమామ్ స్కీం కింద మండలంలోని చండ్రగూడెం, మొర్సుమిల్లి, పుల్లూరు, చంద్రాల, పొందుగల, జంగాలపల్లి, వెల్వడంతోపాటు మైలవరం పట్టణంలోని ఐదు మసీదుల మరమ్మతులకు గానూ పది వేల రూపాయలు, 15వేల రూపాయల చొప్పున మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈనిధులకు సంబంధించిన వర్క్ ఆర్డర్ పత్రాలను ఆయా గ్రామాలకు చెందిన ముస్లిం సోదరులకు మంత్రి ఉమా అందించారు. ఈసందర్భంగా ముస్లిం పెద్దలు మంత్రి ఉమకు ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి ఉమకు పలువురి కృతజ్ఞతలు
మైలవరం మెట్ట ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తీర్చటానికి ఉద్దేశించిన చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరం మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఏంఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావుతోపాటు పలువురు తెలుగు తమ్ముళ్ళు మంత్రి ఉమను ఆయన కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. అత్యంత ప్రతిష్టాకరమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా మైలవరం, తిరువూరు, నందిగామ, నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలలోని 2.30లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించటానికి ఈ పథకం ఎంతో ఉపయోగంగా ఉంటుందని వారు అన్నారు. ఈసందర్భంగా నిధులు మంజూరు చేయించిన ఉమకు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
నందిగామ, సెప్టెంబర్ 6: జిల్లాలో మంగళవారం నందిగామ, గన్నవరంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారిపై అనాసాగరం వద్ద సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానిక బిసి కాలనీకి చెందిన డ్రైవర్ ఓర్సు ప్రసాద్ (40) డ్యూటీకి వెళ్లేందుకు అనాసాగరం వద్దకు వెళ్లి రోడ్డు దాటుతుండగా హైదరాబాదు నుండి విజయవాడ వైపు వెళుతున్న ఆర్‌టిసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ మృతి చెందాడు. ఎస్‌ఐ తులశీరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
గన్నవరంలో...
గన్నవరం: గన్నవరం - ముస్తాబాద్ (వయా) పురుషోత్తపట్నం రోడ్డులో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం కేసరపల్లి శివారు వెంకట నరసింహాపురం కాలనీకి చెందిన కూచిపూడి ప్రభాకర్ (50) పశువులు మేపుకోనుచుండగా గన్నవరం వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తీవ్రంగా గాయపడిన ప్రభాకర్‌ను 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.