కృష్ణ

ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తే నిందితుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, సెప్టెంబర్ 6: ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తే నిందితుడిగా గుర్తించినట్టు టూటౌన్ సిఐ ఎం శివాజీరావు తెలిపారు. సోమవారం స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19న స్థానిక పామర్రు రోడ్డులోని ఆదిత్య పెట్రోల్‌బంక్‌లో వచ్చిన డబ్బును బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళ్తున్న సమయంలో స్థానిక భాస్కర్ థియేటర్ వెనుక రోడ్డులో తన కళ్ళల్లో కారం కొట్టి రూ.3లక్షల 82వేల నగదును గుర్తుతెలియని వ్యక్తి దోచుకున్నట్టుగా టీచర్స్ కాలనీకి చెందిన జి మల్లిఖార్జునరావు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు విచారణ జరుపగా ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మల్లిఖార్జునరావు దోపిడీ జరిగినట్టుగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించారని, మల్లిఖార్జునరావు దొంగిలించిన మొత్తాన్ని రికవరీ చేశామన్నారు. కార్యక్రమంలో రైటర్ ఆంజనేయులు పాల్గొన్నారు.