కృష్ణ

అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో బహిరంగ మలవిసర్జన ఉండొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 7: రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలను అక్టోబర్ 2 నాటికి బహిరంగ మలవిసర్జన లేని పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమంపై బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ 2019 నాటికి రాష్ట్రాన్ని బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వచ్చే అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలను బహిరంగ మలవిసర్జన లేని పట్టణాలుగా ప్రకటించేందుకు వివిధ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను నూరు శాతం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి 2019 నాటికి రాష్ట్రాన్ని బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రంగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పశువుల పేడను, వ్యవసాయ వ్యర్థపదార్థాలను వినియోగించి కంపోస్ట్ ఎరువుల తయారీకి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయా శాఖల అధికారులకు సిఎం సూచించారు. ఆ విధంగా చేయడం వల్ల గ్రామాల్లో రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండడంతోపాటు ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా కంపోస్ట్ ఎరువుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు డ్వాక్రా సంఘాలను కొన్ని ఆసక్తి కలిగిన స్వచ్ఛంధ సంస్థలను గుర్తించి వారి భాగస్వామ్యంతో వీటిని చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్‌కు సంబంధించి వివిధ అంశాలపై సిఎం సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెం నాయుడు, మృణాళిని, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.