కృష్ణ

‘బెస్ట్ ప్రైస్’ అగ్నికి ఆహుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 10: నిడమానూరులోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన ‘బెస్ట్‌ప్రైస్’ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో నిర్వహకులైన వాల్‌మార్ట్ వ్యాపార సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లినట్లు అంచనా. మాల్‌లో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. గంటల తరబడి మాల్ తగులబడటంతో పరిసర ప్రాంత నివాసితుల్లో ఆందోళన చోటు చేసుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకూ మంటలు అదుపు చేసే పనిలోనే అగ్నిమాపక సిబ్బంది నిమగ్నమయ్యారు. శనివారం తెల్లవారుజామున సుమారు రెండున్నర గంటల సమయంలో అకస్మాత్తుగా మాల్‌లో మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న నిర్వహకులు అప్రమత్తమయ్యేలోగా మాల్ మొత్తం విస్తరించిన అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఎట్టకేలకు మాల్ సిబ్బంది రంగంలోకి దిగి స్వంత ఫైర్ సామాగ్రితో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయేసరికి అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. దీంతో డిఎఫ్‌ఓ నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో సిబ్బంది పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లతో సంఘటనాస్థలాన్ని చేరుకున్నాయి. సుమారు ఎనిమిది ఫైర్ ఇంజన్లను రప్పించి భారీ మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మాల్‌లోని ఎయిర్ కండీషన్ ఎక్యూప్‌మెంట్ ఉండే ఛాంబర్‌లో ఏర్పడిన ప్రమాదం వల్ల ఈసంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏసి ఎక్యూప్‌మెంట్ ఛాంబర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చలరేగడం ద్వారా ఇంత దారుణ ప్రమాదం తలెత్తినట్లు భావిస్తున్నారు. మంటలకు ఏసి ఎక్యూప్‌మెంట్ ఛాంబర్‌లోని ఏసి గ్యాస్ సిలెండర్లు ఒక్కొక్కటి పగిలిపోవడం వల్ల తీవ్ర స్థాయిలో ప్రమాదం పరిణమించింది. మాల్‌లోని అన్ని విభాగాల్లో ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే వస్తు సామాగ్రితోపాటు, సరుకులు, ప్లాస్టిక్ వస్తువులు, ఫర్నిచర్, రేఖలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలతోపాటు, పొగలు మాల్ మొత్తం కమ్ముకోవడంతో చుట్టు ప్రక్కల ఎవరూ ఉండలేని పరిస్ధితి. దీనికితోడు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. సాయంత్రం నాలుగు గంటలకుగాని ఒక స్థాయిలో మంటలు అదుపు చేశారు. అయినా.. రాత్రి వరకూ మంటలు ఆర్పే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అగ్నిప్రమాదం వల్ల సుమారు 20కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు నిర్వహకులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి వాల్‌మార్ట్ సంస్థ నుంచి లేఖ విడుదల చేశారు. గోడలు, సీలింగ్ పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాత మంటలను పూర్తిగా అదుపు చేశాక గాని నష్టానికి సంబంధించి పూర్తి స్థాయి అంచనా వెలువడుతుందని, అదేవిధంగా ప్రమాదానికి కారణగాలు కూడా వెలుగులోకి వస్తాయని నిర్వహకులు భావిస్తున్నారు. ఇటు ఫైర్ అధికారులు, సిబ్బందితోపాటు పటమట పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకుని పర్యవేక్షించారు. ఘటనకు సంబంధించి పటమట పోలీస్టేషన్‌లో ఏవిధమైన కేసు నమోదు కాలేదు.

బెస్ట్‌ప్రైస్ సూపర్ మార్కెట్ దగ్ధం
గన్నవరం, సెప్టెంబర్ 10: విజయవాడ రూరల్ మండలం నిడమనూరు బెస్ట్‌ప్రైస్ వాల్‌మార్ట్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 20 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. తెల్లవారుజామున దాదాపు 3.50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు వాల్‌మార్ట్ ఉద్యోగులు తెలిపారు. రాత్రి ప్యాకింగ్ సెక్షన్‌లో పని చేస్తున్న సిబ్బంది తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో వాల్‌మార్ట్ పవర్ హౌస్ పైన పొగలు, మంటలు రావడంతో లోపల పని చేస్తున్న సిబ్బంది బయటకి పరిగెత్తుకు వచ్చి 101కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. క్షణాల్లో మంటల ఉద్ధృతికి బెస్ట్‌ప్రైస్ వాల్‌మార్ట్ మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో రూ. 20 కోట్ల ఆస్థి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు. 8 అగ్నిమాపక వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులో పెట్టారు.