కృష్ణ

రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతిబింబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్బీపేట, సెప్టెంబర్ 14: రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పెద్ద ఎత్తున ఔత్సాహికులైన కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా అమరావతి షాఫింగ్ పెస్టివల్ నిర్వహించటానికి తగు ప్రణాళికలు రుపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ బాబు ఎ వెల్లడించారు. బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో వీడియోకాన్పరెన్సు హాలు నందు నగరంలోని ప్రముఖ కమర్షియల్ ట్రేడ్ ప్రతినిధులు, టూరిజం శాఖ అధికారులతో ఫెస్టివల్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఆనంతరం విజయవాడ నగరం గతం కంటే భిన్నంగా మార్పులు జరుగుతున్నాయని, ఈ ఫెస్టివల్ నిర్వహణ వల్ల మరింత స్థాయికి చేరే విధంగా కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఫెస్టివల్ నిర్వహణకు నగరంలోని ప్రముఖ వాణిజ్య సంస్థలు ముందుకు రావాల్సిన అవశ్యకత ఉందని, ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం ఉంటుందని, వాణిజ్య సంస్థలు ప్రజలకు ధరలు అందుబాటులో ఉండే విధంగా ప్రోత్సాహకరమైన డిస్కౌంట్లతో తమ ఉత్పత్తులను విక్రయించే విధంగా కొనుగోలుదాలను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్స్‌తో పాటు చిన్న బడ్డీకొట్టు వరకు కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా తమ సముదాయాలను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయానికి ప్రజాప్రతినిధులతో పాటు అన్ని శాఖల అధికారులుర, వాణిజ్య కేంద్రాల అధిపతులతో ఈనెల 22న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 3 గంటలకు సమన్వయ సమావేశం నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు. వాణిజ్య వ్యాపారుల సూచనల మేరకు అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 28 వరకు ఫెస్టివల్ నిర్వహించటానికి నిర్ణయించటం జరిగిందని ముఖ్యమంత్రి సూచనల మేర తేదీలు నిర్ణయించటం జరుగుతుందని తెలిపారు. షాపింగ్ ఫెస్టివల్ గుజరాత్, కేరళ రాష్ట్రాలు ప్రసిద్ధి చెందినవని అదే విధంగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ఎంతో ఖ్యాతి సంపాదించిందన్నారు. అదే రీతిలో అమరావతి షాపింగ్ ఫెస్టివల్ అందరి సహకారంతో నిర్వహించటానికి సన్నహాలు చేస్తున్నట్లు కలెక్టర్ బాబు ఎ తెలిపారు. నగరపాలక సంస్ధ కమీషనర్ డాక్టర్ జి వీరపాండ్యన్ మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణ వలన నగరానికి కొత్త శోభ చేకూరిందని, అదే రీతిలో అమరావతి షాఫింగ్ ఫెస్టివల్‌ను చేయటానికి వాణిజ్య సంస్థలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. నగరం ఇప్పటికే రోడ్లు, పార్కులు, కాలవలు సుందరీకరంగా తీర్చిదిద్దటం జరిగిందని, ఇదే తరహాలో ఫెస్టివల్ నిర్వహించి పెద్ద ఎత్తున విజయవాడ నగరానికి పర్యాటకులను ఆకర్షించే విధంగా కృషి చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ డాక్టర్ జి సృజన, నూజీవీడు సబ్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ, టూరిజం అధికారులు, వివిధ వాణిజ్య సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత నగరంగా విజయవాడ
* 99శాతం పూర్తయిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం
* 102 ప్రదేశాల్లో నమ్మా టాయ్‌లెట్ల నిర్మాణానికి కసరత్తు
* విఎంసి కమిషనర్ వీరపాండియన్
విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 14: రాష్ట్ర రాజధాని నగరంగా గుర్తింపు పొందుతున్న నగరాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడమే కాకుండా లక్ష్య సాధన కోసం తీసుకోవాల్సిన చర్యలను సత్వరమే చేపట్టాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం తన ఛాంబర్‌లో విఎంసి ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షించగా తొలుత లక్ష్య సాధనకై తీసుకోవాల్సిన చర్యలు, గుర్తించిన ప్రదేశాలు తదితర అంశాలపై రూపొందించిన నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర పరిధిలోని 59 డివిజన్లలోనూ పబ్లిక్ టాయ్‌లెట్లు, కమ్యూనిటీ టాయ్‌లెట్ల తోపాటు పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవడం వలన వాటిని వినియోగించేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. నగర వ్యాప్తంగా గుర్తించిన 102 బహిరంగ మల, మూత్ర విసర్జన ప్రదేశాల్లో నమ్మా టాయ్‌లెట్లను నిర్మించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వాటిలో 45 ప్రదేశాల్లో టాయ్‌లెట్ల నిర్మాణం పూర్తికాగా మిగిలిన 57 నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అలాగే నగరంలో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకాన్ని 99శాతం పూర్తయిందని, మిగిలిన ఒక్కశాతం పనులను కూడా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత నగర నిర్మాణంలో నగర ప్రజలను కూడా భాగస్వాములుగా చేయాలని, ఇందుకు వారిని చైతన్యవంతులుగా చేసి లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో విఎంసి సిఇ ఎంఎ షుకూర్, ఇఇలు ఓంప్రకాష్, భాస్కర్, ధనుంజయ, గోవిందరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు, ఐటి నిపుణులు దిలీప్, కిషోర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

ప్రేమించాడన్న అక్కసుతో
యువకుని కిడ్నాప్, నిర్భంధం
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 14: ప్రేమించాడన్న నెపంతో యువకుడిని నిర్భంధించి చిత్రహింసలకు గురి చేసిన ప్రియురాలి కుటుంబ సభ్యులపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. యనమలకుదురుకు చెందిన ఎస్‌కె సుభానీ గేట్‌వే హోటల్‌లో పెస్ట్ కంట్రోలర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి గతంలో కానూరుకు చెందిన వైష్ణవితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొద్దికాలం తర్వాత యువతి ఇంట్లో తెలియడంతో వేరుపడ్డారు. కాగా.. ఈనెల 11వ తేదీన సుభానీని జెడి నగర్‌లో ప్రియురాలు వైష్ణవి కుటుంబసభ్యులు, స్నేహితులు కిడ్పాన్ చేసి ఇంట్లో నిర్భంధించి కొట్టి చిత్ర హింసలకు గురి చేశారు. ఈక్రమంలో అపస్మారక స్థితికి చేరుకున్న సుభానీని వారంతా మంగళవారం రాత్రి బయటకు తీసుకువచ్చి వదిలేశారు. దీంతో అతని కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పటమట పోలీసులు బాధితుని నుంచి ఫిర్యాదు తీసుకుని కిడ్నాప్, దాడి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రియురాలు వైష్ణవితోపాటు ఆమె తల్లిదండులు, బంధువులైన ఫృధ్వీ, ఇతర కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.