కృష్ణ

నదుల అనుసంధానం ఓ చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, సెప్టెంబర్ 15: భారతరత్న సర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య జీవితం విలువలతో కూడుకున్న వ్యక్తిత్వం అని, సమయపాలన కష్టపడే తత్వం అయన సొంతం అని, అలాంటి వ్యక్తి లక్షణాలను నేటితరం విద్యార్థులకు అవసరమని వాటిని నేటితరం విద్యార్థులు అలవరచుకోవాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంత్రి దేవినేని ఉమ గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం మోక్షగుండం విశే్వశ్వరయ్య 156వ జయంత్యుత్సవాలను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించారు. ప్రతి సంవత్సరం మోక్షగుండం విశే్వశ్వరయ్య జయంతిని ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్న భారత ఇంజనీర్ల సంఘం, ఆయన చూపిన ఉత్తమ మార్గంలో నడిచి రాష్ట్రానికి సేవలు అందించాలని మంత్రి అన్నారు. దేశంలో నలుగురు ఇంజనీర్లు సర్ ఆర్డర్ కాటన్, డాక్టర్ కెఆర్ రావు, శ్రీరామకృష్ణయ్య, మోక్షగుండం విశే్వశ్వరయ్య కృషి దేశం ఎన్నటికీ గుర్తించుకుంటుందని తెలిపారు. గోదావరి నీటిని రెండున్నరేళ్ల లోపు కృష్ణానదికి అనుసంధానం చేశామని ఇది ఒక చరిత్ర అని చెప్పారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయటం వల్ల నేడు 23 టిఎంసిల నీటిని పులిచింతలలో నిల్వ చేసే వీలు ఏర్పడిందన్నారు. దీని వల్ల కృష్ణా డెల్టా భూములను స్థిరీకరణ ఏర్పడిందన్నారు. ఎక్స్‌పర్ట్ కమిటీ మెంబర్ వీరయ్య మాట్లాడుతూ మోక్షగుండం విశే్వశ్వరయ్య వందేళ్ల 7నెలలు బతికారని తన జీవితంలో చివరి నిమిషం వరకు కూడా దేశం కోసం పని చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజనీరింగ్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ పరిపలనా విభాగం ఎంవి రవికుమార్, చీఫ్ ఇంజనీర్ కృష్ణాడెల్టా సిస్టం వైఎస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.