కృష్ణ

సొంతగూటికి నెహ్రూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, సెప్టెంబర్ 15: తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుండి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) మనస్తత్వం తెలిసిన వ్యక్తినని ఆయన మాటమీద నిలబడే వ్యక్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గుణదల బిషప్ గ్రాసి హైస్కూల్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు దేవినేని అవినాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు వారి అనుచరగణానికి చంద్రబాబు పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగిస్తూ అమరావతి రాజధానిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో ఇప్పటికే విజయవాడను అభివృద్ధి చేశానని, రాబోయే కాలంలో విజయవాడ రూపురేఖలే మార్చి వేస్తానని తెలిపారు. హైదరాబాద్, సికింద్రబాద్‌తోపాటటు తానే స్వయంగా సైబరాబాద్‌ను అభివృద్ధి చేశానని, అలాగే అమరావతి రాజధానితోపాటు గుంటూరు, విజయవాడను పూర్తిస్థాయిలో అభివృద్థి చేస్తానని చెప్పారు. విజయవాడ ప్రజల ఆహ్లాదం కోసం నగరంలో ప్రవహిస్తున్న ఏలూరుకాలువ, బందర్ కాలువ, రైవస్ కాలువను సుందరీకరణ చేస్తానని పేర్కొన్నారు. కాలువల వెంబడి ఉన్న ఇళ్లవారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానన్నారు. ఆంధ్రప్రజల జీవనాడి పోలవరాన్ని 2018 కల్లా ఎట్టిపరిస్థిల్లో పూర్తిచేస్తానని తెలిపారు. తన డైరీలో ఇక నుండి ప్రతి సోమవారం బదులు పోలవరం అని రాసుకుంటానని, ఎందుకుంటే నెలలో ప్రతి సోమవారం పొలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. వైఎస్సార్ పార్టీ ఎన్ని కుప్పుగంతులు వేసిన భయపడే వ్యక్తిని కాదన్నారు. ఆ పార్టీ అభివృద్ధి నిరోధిక పార్టీ అన్నారు. తన అనుభవం అంతా లేదు జగన్ వయస్సు అని మండి పడ్టారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణంలో చంద్రబాబుకు కవచంలాగా ఉంటామన్నారు. 5కోట్ల ప్రజల ఊపిరి, శ్వాస చంద్రబాబునాయుడన్నారు. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో తన ఊపిరి, శ్వాస ప్రజలే కాబట్టి నేడు మీముందు ఉండి మాట్లాగలుగుతున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీని ఎందుకు వీడిపోయోమో తమకే ఈరోజుకీ తెలియదన్నారు. ఒక మాట ఇచ్చానంటే నాప్రాణంపోయిన నిలబెట్టుకునే వ్యక్తినని తెలిపారు. ఎన్‌టి రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి నాలుగు సార్లు టిడిపి పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందానని, ఆనాడు ఎన్‌టిఆర్ తను మంత్రిగా తీసుకున్నప్పుడు చంద్రబాబునాయుడు సహకరించారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో 16 ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకుంటామని అన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రతి అడుగులో అడుగువేస్తామని చెప్పారు. రాబోయే 30ఏళ్లలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావ్, అధ్యక్షత వహించగా, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్, జనాబ్ జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, అప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, వర్లరామయ్య, యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్, జిల్లా టిడిపి అధ్యక్షుడు బచ్చుల ఆర్జునుడు, నాగుల్ మీరా ప్రసంగిస్తూ నెహ్రూ పార్టీలో రావటం మంచి పరిణామమని, జిల్లా పార్టీ ఇంకా పటిష్ఠమవుతుందన్నారు. జిల్లా నలుమూలల నుండి మాజీ సర్పంచ్‌లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ జడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, అభిమానులు, కార్యకర్తలు ఆశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ముగ్గురు యువ ఎమ్మెల్యేలు డుమ్మా
దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి తిరిగి చేరటంతో ముందు ఊహించినట్లుగానే ఎమ్మెల్యే బొండా ఉమ, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సభకు డుమ్మాకొట్టారు. వీరు ముగ్గురూ గైర్హాజరు కావటంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, ప్రజల్లో చర్చినీయాంశంగా మారింది. నెహ్రూ తిరిగి సొంత గూటికి చేరుకోవటంతో భవిష్యత్‌లో ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీలో ఉంటారా, లేదా వేరే పార్టీ తీర్థం పుచ్చుకుంటారనేది హాట్ టాపిక్‌గా మారింది.

టి ఎంసెట్-3లో
శ్రీచైతన్య, నారాయణ విజయ దుందుభి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 15: నేడు వెలువడిన తెలంగాణా ఎంసెట్-3 పరీక్షా ఫలితాల్లో శ్రీచైతన్య నారాయణ ‘చైనా’ విద్యా సంస్థలు విజయదుందుభి మోగించాయి. రాష్టస్థ్రాయి మొదటి ర్యాంక్‌తో పాటు 10లోపు మొత్తం 9 ర్యాంక్‌లను సాధించారు. దీంతో దేశంలోని మెడికల్ ప్రవేశ పరీక్షలకు ఏకైక ఛాయిస్‌గా మారినట్లయ్యాయి. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన రేగళ్ల ప్రపుల్ల మానస మొదటి ర్యాంక్ సాధించింది. మానస గుడివాడలో విశ్వభారతి పాఠశాలలో పదో తరగతి చదివి ‘చైనా’ సంస్థలో ఇంటర్ పూర్తి చేసింది. ఆంధ్రా ఎంసెట్‌లో నాలుగువేల ర్యాంక్ రాగా తెలంగాణా రెండో ఎంసెట్‌లో 123వ ర్యాంక్ సాధించింది. ఈ విద్యార్థిని తండ్రి రేగళ్ల కేశవరెడ్డి గుడ్లవల్లేరు ఎంపిడివోగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో సంస్థ చైర్మన్ డాక్టర్ బిఎస్ రావు మాట్లాడుతూ రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్ష ఏదైనా విధానాలు ఎలా మారినా నెంబర్-1గా నిలిచేది తమ విద్యార్థులేనని అన్నారు. భవిష్యత్‌లో కార్డియాలజిస్ట్ కావాలన్నదే తన లక్ష్యంగా చెప్పింది. ఈ సమావేశంలో చైనా విద్యా సంస్థలకు సంబంధించిన శ్రీ శర్వాణి విద్యాసంస్థల డైరక్టర్లు సుష్మ, డాక్టర్ సింధూర నారాయణ, తదితరులున్నారు. ఈ సంస్థకు చెందిన పి.శ్రీహారిక, టి.తేజస్విని వరుసగా 2, 3 ర్యాంకులు, ఇక్రంఖాన్, ఎ.కంఠేశ్వరరెడ్డి, ఎం.అలేఖ్య, సుజాత్ ఫాతిమా, బి.కావ్య, విరూపేష్ వరుసగా 5 నుంచి 10 వరకు ర్యాంకులు సాధించారు.

హోటళ్లలో విజిలెన్స్ తనిఖీలు
మైలవరం, సెప్టెంబర్ 15: మైలవరం పట్టణంలో గురువారం పలు హోటళ్లలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా వినియోగిస్తున్న వంట గ్యాస్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సిఐ ఎస్‌కె నబీ కథనం ప్రకారం విజిలెన్స్ ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు మైలవరంలో గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలెండర్లను హోటళ్లలో వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్న సమాచారం తెలుసుకుని దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా ఐదు హోటళ్లలో తనిఖీలు చేసి 40 సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 13 ఖాళీ, 32 గ్యాస్‌తో నింపి ఉన్న సిలెండర్లున్నాయి. వీటిని సీజ్ చేసి స్థానిక సాయి నమిత భారత్ గ్యాస్ కంపెనీకి అప్పగించారు. సంబంధిత హోటల్ యజమానులపై కేసులు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టుకు పంపనున్నట్లు విజిలెన్స్ సిఐ నబీ వివరించారు. తనిఖీల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం వెంకటేశ్వరరావు, పిడిఎస్ డిటి రామకృష్ణ పాల్గొన్నారు.

కళాశాలల ర్యాంకింగ్స్ మెరుగుపడాలి
* ఆచార్య రామకృష్ణారావు సూచన
మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 15: జాతీయ ర్యాంకింగ్ సిస్టమ్‌లో ప్రతి కళాశాల తమ ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సుంకర రామకృష్ణారావు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో గురువారం జాతీయ విద్యా సంస్థల ర్యాంకింగ్ ప్రక్రియను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలు తమ కళాశాలల పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య డి సూర్యచంద్రరావు మాట్లాడుతూ డిజిటల్ ఇండియా నినాదంతో ముందుకు సాగుతున్న భారతావనిలో అన్ని విద్యాసంస్థలు తమవంతుగ