కృష్ణ

ఆధార్ లింక్డ్ పథకాలు పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ రూరల్, సెప్టెంబర్ 16: సామాజిక, ఆర్థిక తోడ్పాటుకు ఆధార్ ఆధారిత విధానాలతో అమలు చేయటాన్ని ఎన్.ఐ.డి.ఎ టాంజానియా, ప్రపంచబ్యాంకు బృందం, బ్యాంక్‌బుల్ ఫ్రంట్ టైర్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ బృందం పరిశీలించింది. శుక్రవారం విజయవాడ గ్రామీణ మండలం నున్న, పాతపాడు, గుంటుపల్లి గ్రామాల్లో పర్యటించి ఆయా పథకాలు అమలు తీరుతెన్నులు ఆరా తీశారు. ఈసందర్భంలో టాంజానియా బృందం ప్రతినిధులు ఎడ్‌సన్ గుటాయ్ ప్రభుత్వం అందించే వివిధ పథకాల లబ్ధిదారులకు రేషన్ సరుకులు, సామాజిక భద్రత పింఛన్లు స్వయంగా అందించారు. రాష్ట్రంలో పేదలకు అందిస్తున్న వివిధ పథకాల్ని అధ్యయనం చేయటానికి వచ్చినట్లు వివిధ బృందాల ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంలో మరింత సమర్థవంతంగా ప్రజాపంపిణీ వ్యవస్థ విధానంపై వివరాలు తెలపాలని గుంటుపల్లి రేషన్ షాపు నెంబర్ 22కు డీలర్ కె. ఉషరాణిని కోరారు. ఇంటర్‌నెట్ సిగ్నల్ వ్యవస్థ మరింత స్థాయిలో అందుబాటులోకి వస్తే సరుకుల పంపిణీ, సామాజిక భద్రత ఫించన్ల పంపిణీ వేగవంతం అవుతుందని తెలిపారు. సివిల్ సప్లయిస్ అధికారి రవికిరణ్ మాట్లాడుతూ సిగ్నల్ వ్యవస్థ విధానంలో ప్రభుత్వం డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. రాయనపాడు సర్పంచ్ అరుణకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతినెల ఒకటో తేదీ నుండి 3లోపు ఫించన్లు ఠంఛన్‌గా ఇస్తున్నారని చెప్పారు. ఎంపిటిసి సుధారాణి మాట్లాడుతూ పేదల పక్షాన నిరుపేదలకు ప్రతి నెల రూ.1000లు, వికలాంగులకు రూ.1500లు ప్రభుత్వం ఆధార్ అనుసంధానంతో అందించటం జరుగుతోందన్నారు. రాయనపాడు ఉపసర్పంచ్ శివప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఒక నెల ఫించన్ తీసుకోకపోయినా, నిత్యవసర సరుకులు తీసకోకపోయినా పేద ప్రజలు ఇబ్బంది పడేవారని, అయితే మూడు నెలల కాలం వరకు ఒకేసారి వారికి అనువైన ప్రాంతం నుండి సరుకులు తీసుకునే వెసులుబాటు సిఎం చంద్రబాబు కల్పించారన్నారు. ఆధార్ అధారిత విధానం ద్వారా రాష్ట్రంలోని వాస్తవ లబ్ధిదారులకు పథకాల్ని అందించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవటం జరిగిందని ఇబ్రహీంపట్నం ఎంపిపి వెంకట కృష్ణారావు తెలిపారు. గ్రామీణ స్థాయిలో నివాసం ఉండే నిరుపేద స్వయం సహాయక మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనిచ్చే దిశగా బ్యాంకు మిత్రులుగా తమను ఎంపిక చేయటం జరిగిందని ఐటిఎఫ్‌సి బ్యాంకు సయన్వయకర్త డి.సౌజన్య తెలిపారు. ఆంధ్రాబ్యాంకు బిఎం ఉమామహేశ్వరి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి నెల 428 పెన్షన్స్ ఇస్తున్నామన్నారు. దీని ద్వారా ప్రతినెల రూ.4వేల ఆదాయాన్ని 6రోజుల్లోనే పొందుతున్నారని ఇతర పనులు చేసుకోవటానికి అనుకూలంగా ఉందన్నారు. పాతపాడులో ఎన్‌ఆర్‌జిఎస్ పథకం కింద నిర్వహిస్తున్న పనులకు సంబంధించి కూలీలకు జాబ్ కార్డు ఉన్నవారికి ఆధార్‌తో బ్యాంక్‌లో లింక్ అవటాన్ని అడిగి తెలుసుకొన్నారు. 75 ఏళ్ల గుమ్మడి పున్నారావు టాంజానియా బృందం నుండి పొదుపు చేసేందుకు బ్యాంకులో సోమ్మును డిపాజిట్ చేశారు. ప్రతినెల ఒకటవ తేదీన ఇంటి వద్దకే ఫించన్లన్లు అందిస్తున్నారని తెలిపారు. ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమచేయటం జరిగిందన్నారు. తన కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు బ్యాంకు నుండి అవసరమైన మొత్తాన్ని డ్రా చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. బ్యాంకుల్లో బిసిలకు ఫించన్లు పంపిణీ, ఎన్‌ఆర్‌జిఎస్ సొమ్మును పంపిణీ చేసేందుకు రూ.50వేలు ఇస్తున్నారని, ఆ మొత్తాన్ని పంపిణీ చేశాక మరో రూ.50 వేలు ఇస్తున్నారని తెలిపారు. మొదటి రోజు పర్యటనలో బృందం అసక్తిగా గ్రామస్థాయిలో మహిళు నుంచి సూచనలు, సలహాలు కోరటం జరిగింది. రాయనపాడులో ప్రజాసాధికారత సర్వే ప్రక్రియను పరిశీలన చేశారు. ఈ పర్యటనకు జిల్లా అభివృద్ధి అధికారి ఆర్‌కె అనంత కృష్ణా సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రతినిధుల బృందం జాతీయ ఐడింటిఫికేషన్ ఆధారిటి బృందంలో అల్ఫాన్స్ మాల్‌బీచీ ఆధ్వర్యంలో ఎడ్సన్‌డెడిడ్ గుహయ్, మహ్మద్ మషాకా అబ్‌ది, జూలియన్ బెన్‌నార్డ్ మఫ్‌ర్రు, లుడిశాలు వమాంగ, గోడ్‌విన్ మిక్‌సి, చార్‌లెస్ సామన్, జాబిరి బకారి, డానియేల్ మహీనా, ఇనోసెంట్ ఎఫ్రాయిం, సోస్‌స్తవీస్‌కివి, ప్రపంచబ్యాంకు (వాషింగటన్) తరుపున వైజయంతీ దేశాయ్, పిడతల కృష్ణా, కామ్యచంద్ర, షాగున్ అహూజా, ప్రాజెక్టు సలహాదారు రాజేష్ బన్సాల్ సభ్యులు పాల్గొన్నారు. ఈబృందంలో జిల్లాకు చెందిన అధికారులు సబ్ కలెక్టర్ సృజనతో పాటు రవికిరణ్, డి.చంద్రశేఖర్‌రాజు, తహశీల్దార్ మదన్‌మోహన్, అగ్రికల్చర్ డిడి బాలు నాయక్, ఎంపిడిఓ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.