కృష్ణ

హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జనవరి 26: నవ్యాంధ్రప్రదేశ్‌ను హారితాంద్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పటమట ఆర్‌టిసి కాలనీలోని ఫన్‌టైమ్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పూలు, పండ్లు ప్రదర్శనను మంగళవారం మధ్యా హ్నాం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగర వాతావరణం ఒకప్పుడు ఎంతో వేడిగా వుండేదని అయితే ప్రజలలో చైతన్యం వచ్చి మొక్కలు పెంచ టం వలన వేడి వాతావరణం తగ్గుముఖం పట్టిందని, ఇంకా నగరంలో మొక్కలు పెంచి విజయవాడ వాతావరణం తగ్గుదలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటిలో మొక్కలు విరివిగా నాటి హరితాంధ్రప్రదేశ్ సాధనకు అందరూ ముందుకురావాలని కోరారు. ఫన్‌టైమ్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఫల, పూలు ప్రదర్శన ఎంతో బాగుందని నిర్వాహకులను ఆయన అభినందించారు. గన్నవరం విమానశ్రయం అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలిపారు. విశాఖనగరం పచ్చదనం పెంపొందించటంలో ప్రత్యేక స్థానంలో వుందన్నారు. ఫిబ్రవరి నెలలో ఫెస్ట్ నిర్వాహించటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, 60 దేశాల ప్రతినిధులు ఈఫెస్ట్‌కు హాజరవుతారని అన్నారు. విజయవాడలో అద్దెలు ఎక్కువుగా వుంటున్నట్లు తన దృష్టి వచ్చిందన్నారు. ఉద్యోగులు విజయవాడ తరలిరావల్సిందేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ సదర్భంగా కోరమండల ఇంటర్నేషనల్ విద్యార్ధులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పల్లే రఘునాద్, చిన్నరాజప్ప, శాసనసభ్యులు గద్దె రామమోహన్ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ ఫన్‌టైమ్స్ నిర్వాహకులు అఖిలాండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.