కృష్ణ

రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జనవరి 26: భారత రాజ్యాంగం సంక్రమించిన హక్కులను ప్రతి పౌరుడు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇవో సిహెచ్ నరసింగరావు పేర్కొన్నారు. భారత జాతీయ 67వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇంద్రకీలాద్రి పై మంగళవారం ఉదయం ఈవేడుకలు అత్యంత అట్టహాసంగా జరిగాయి. ఈజాతీయ పతాకాన్ని ఇవోనరసింగరావు ఆవిష్కరించి రిపబ్లిక్‌డే విశిష్టతను గురించి వివరించారు. ఇవో సతీమణి విజయలక్ష్మీ మహాత్ముల చిత్రపటాలకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈసందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభను చూపిన దేవస్థానం డిప్యూటీ ఇంజనీర్ యల్ రమతోపాటు 26మంది ఉద్యోగులకు ఇవో ప్రశంస పత్రాలు అందచేసారు. ఈసందర్భంగా అమ్మవారి సన్నిధిలోకళకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆహ్వానితులను విశేషంగా ఆకర్షించాయి. ఈకార్యక్రమంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు, డిఇ రమ, సహాయ ఇవోలు శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, బి వెంకటరెడ్డి, యస్‌వి ప్రసాద్, పర్యవేక్షణాధికారులు యన్ రమేష్, కె శ్రీనివాసమూర్తి, కె చంద్రశేఖర్, ఇవో సిసిలు దూళిపాళ్ళ వేణు, సతీష్, తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ దుర్గా ప్రసాద్, పాతబస్తీ శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామివారి దేవస్థానం (పాతశివాలయం)లో దేవస్థానం ఇవో కెవియన్‌డికె ప్రసాద్, విజయేశ్వరస్వామివారి దేవస్థానం ప్రాంగణంలో దేవస్థానం కమిటీ చైర్మన్ వెలంపల్లి సూర్యనారాయణ, బ్రాహ్మణ వీధిలోని శ్రీ వసంతమల్లిఖార్జున స్వామివారిదేవస్థానంలో ఇవో నేల సంధ్య, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో ఇవో హేమలతాదేవి, కెనాల్‌రోడ్ శ్రీ బ్రహ్మచారి బావాజీ మఠంలో ఫిట్‌పర్సన్ యద్ధనపూడి శివరామయ్యనాయుడు, శ్రీరూపాబాయమ్మ ట్రస్ట్ ఆవరణలో ఇవో యం సత్యప్రసాద్, యనమలకుదురు శ్రీకనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో ఇవో యల్ సత్యవతి, చిట్టినగర్ శ్రీనగరాల కొత్తఅమ్మవారి దేవస్థానం కార్యాలయంలో కమిటీ అధ్యక్షుడు పోతిన బేస్ కంటేశ్వరుడు జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. సీతమ్మవారి పాదాల చెంత ఉన్న శ్రీ ప్రత్యేక శనైశ్చరస్వామివారి దేవస్థానంలో జాతీయ పతాకాన్ని సెక్రటరీ కలిశెట్టి కనకరావు ఆవిష్కరించారు.