కృష్ణ

వైభవంగా కళాఉత్సవ్ 2016 ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, అక్టోబర్ 5: నవ్యాంధ్రప్రదేశ్‌లో జరిగే ప్రతి కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తామని, కృష్ణా పుష్కరాలలో విద్యార్థులందించిన సేవలు అమోఘమని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గుణదల బిషప్ గ్రాసి హైస్కూల్ గ్రౌండ్‌లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన రెండు రోజుల కళాఉత్సవ్-2016 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో ఫిజికల్ లిటరిసీని ప్రొత్సహిస్తున్నామని తెలిపారు. దీనికోసం రోజులో ఒక పీరియడ్ స్పోర్ట్స్ కోసం కేటాయిస్తామన్నారు. స్పోర్ట్సు యాక్టివిటీస్‌లో పాల్గొనే విద్యార్థులు అకడమిక్‌గా నష్టపోకుండా ఉండటానికి వారికి వెయిటెజ్ మార్కులు ఇవ్వడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కూచిపూడి నృత్యానికి 100 కోట్లు కేటాయించారని, ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టిన ముందు కూచిపూడి నృత్యంతో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. సంగీతం, నృత్యం వంటి సంప్రదాయ కళలలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 397 మంది విద్యార్థులు పాల్గొనటం అందులో 308 మంది బాలికలు పాల్గొనటం మంచి పరిణామమన్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో గెలిచిన వారికి జాతీయ స్థాయి పోటీలకు పంపటం జరుగుతుందన్నారు. 2017 నవంబర్ ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించిన విద్యార్థులకు 5 లక్షలు, ద్వితీయ బహుమతికి 3 లక్షలు, తృతీయ బహుమతికి 2 లక్షలు ఇస్తారని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ విద్యార్థులు మానిసిక ఒత్తిడి నుండి బైటపడటానికి కళలు దోహదం చేస్తాయన్నారు. మానవతా విలువలతో కూడిన విద్యనందిచాల్సిన అవసరం ఉందన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ కళలకు పుట్టినిల్లు కృష్ణాజిల్లా అన్నారు. అలాంటి జిల్లాలో నందమూరి తారక రామారావు ఉండటం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, గ్రంథాలయ చైర్మన్ వెంకట రామయ్య, స్థానిక కార్పొరేటర్ దాసరి మల్లేశ్వరి, డైరెక్టర్లు ప్రభాకరరావు, రాజ్యలక్ష్మీ, డిఇఓ సుబ్బారెడ్డి, డిఇఓ బలే రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.