కృష్ణ

శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 5: శరన్నరాత్రి మహోత్సవాల్లో శ్రీ అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. త్రిమూర్తులకు కన్నా పూర్వం నుండే ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పలువబడుతోంది. ఈదేవియే శ్రీ చక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా తనని కొలిచే భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువైపులా వించామరలతో సేవిస్తూ ఉండగా చిరుమదంహాసంతో, భక్తిపావనాన్ని చిందే చెరకుగడను చేతపట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని దేవి దర్శమిస్తుంది.

మున్సిపల్ పాఠశాలలో నిర్మితమైన
మరుగుదొడ్లు త్వరలో ప్రారంభం

విజయవాడ, అక్టోబర్ 5: సింగపూర్ లాంటి దేశంలో ఎప్పటికపుడు వినూ త్న వాతావరణం కొట్టొచ్చేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవనాల నిర్మాణాలు జరుగుతున్న మాదిరిగానే ఈ ప్రాంతంలో కూడా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందని నగ ర పాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ కోరారు. కనె్ఫడరేషన్ ఆఫ్ రి య చీల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ‘క్రిడమ్’ ఆధ్వర్యం లో జనవరి 6నుంచి 8 వరకు జరిగే 4వ విజయవాడ ప్రాపర్టీ షోకు సంబంధించిన బ్రోచర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ క్రెడమ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆరు పాఠశాలల్లో రూ.20లక్షల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందంటూ త్వరలోనే ప్రారంభోత్సవం కార్యక్రమం చేపడతామన్నారు. మరికొన్ని పాఠశాలల్లో కూడా వీటిని నిర్మించాలని కోరారు.
క్రెడమ్ విజయవాడ ఛాప్టర్ అధ్యక్షుడు సిహెచ్ సుధాకర్ మాట్లాడుతూ ఈ ప్రాపర్టీ షోను సిఎం చంద్రబాబు ప్రారంభిస్తారని, ముగింపు సభలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పాల్గొంటారని చెప్పారు. దాదాపు 80 స్టాల్స్‌లో బిల్డర్లు కార్పొరేట్ డెవలపర్లు, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్లు, ఆర్థిక సంస్థలు వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ పారిశ్రామిక రంగ దిగ్గజాలు కొలువుదీరనున్నారన్నారు. ఈ ప్రాపర్టీ షో ఇటు ఈ ప్రాంతంలో స్థిరాస్తులు కొనాలనుకునే వారికి, అటు తమ ప్రాజెక్టులను షోకేస్ చేయాలనుకునే బిల్డర్లకు మధ్య ఒక సంగమ క్షేత్రంగా మారనుందన్నా రు. క్రెడమ్ రాష్ట్ర అధ్యక్షుడు వి.శివారెడ్డి మాట్లాడారు. తదుపరి ప్రాంతీయ నైపుణ్యాన్ని జాతీయ థృక్పథాన్ని అభివృద్ధి చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్ సంబంధాలను కొనసాగిస్తూ సిఆర్‌డిఎ పరిధిలో రియల్ ఎస్టేట్, పరిశ్రమకు ఉన్నత ప్రమాణాలు అందిస్తోందన్నా రు. రాజధానికి తరలి వచ్చిన ఉద్యోగులు అద్దెల భారంతో బాధపడుతున్నారంటూ వారి కోసం లాభాపేక్ష లే కుండా ప్రభుత్వ సహకారంతో భూము లు సేకరిస్తే గృహ వసతి కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్సి రాష్ట్రంలో లక్షా 90 వేల గృహాలను జి ప్లస్ ఫోర్‌లో ని ర్మించాలని భావిస్తోందని వీటి నిర్మాణ బాధ్యతను తాము చేపట్టే విషయమై ప్రభుత్వం త్వరలో ఒక విధానాన్ని ప్రకటించబోతున్నదన్నారు. ఈ సమావేశంలో క్రెడమ్ ప్రధాన కార్యదర్శి పివిఆర్ రాజు, పెద్ద సంఖ్యలో రియల్ ఎస్టే ట్ వ్యాపారులు, బిల్డర్లు పాల్గొన్నారు.

కష్టపడితే ఫలితాలు సులభం
విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 5: కష్టపడితే ఫలితాలు సులభంగా వస్తాయని, మొదటి ఒలింపిక్స్‌లోనే పతకం సాధించడం ఎంతోగర్వంగా ఉందని ఒలింపియన్ పివి సింధు పేర్కొన్నారు. నిడమానూరులోని నిస్సాన్ షోరూం లో సింధుకు డాట్సన్ రెడీ గో కారును బహుకరించారు. ఈ సందర్బంగా సిం ధు మాట్లాడుతూ తన కల నెరవేరింద ని, ముఖ్యంగా క్రీడాకారులకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. తాను జూన్‌లోనే డాట్సన్ రెడీ గో కారును ప్రారంభించానని తనకు కూడా ఆ కారును బహుకరించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఒ లింపిక్స్ తర్వాత తన లైఫ్ ఛేంజ్ అర ఋయందని, మరింతగా బాధ్యత పెరిగిందన్నారు. కారు డిజైన్ ఎంతో బాగుందని, కొత్త మోడల్‌లో రావడం జరిగిందన్నారు. నిస్సాన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపాధ్యక్షులు సంజీవ్ అగర్వాల్ మాట్లాడుతూ డాట్సన్ తమ కలలను సాకారం చేసుకునేలా భారతీయ యువతను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ ప్రొడక్ట్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లతో ఆకట్టుకునే స్టైల్ ఉందన్నారు. ఇలాంటి కారును దేశానికి వనె్న తెచ్చిన పివి సింధుకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం కారు తాళాలను సింధుకు అందజేశారు. సింధు కారులో ఎక్కి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈకార్యక్రమంలో సందీప్ ఉస్మాన్, అంకిత, మధులిక సింగ్, షీతల్, తదితరులు పాల్గొన్నారు.