కృష్ణ

పండుగలా అమరావతి షాపింగ్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, అక్టోబర్ 5: కనువిందు చేయనున్న విద్యుత్ దీపాలంకరణలు...కొలువైన్న పలు షాపులు...అలరించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు...పసందైయిన వంటకాలు...మెదడుకు పదునుపెట్టే పోటీలు...లక్కు పరీక్షించుకోనున్న లక్కీడిప్‌లు...ఇలా అన్నింటి సమాహారంతో నగరం నడిబొడ్డున కోలువై ఉంది అమరావతి షాపింగ్ ఫెస్టివల్. నవ్యాంధ్ర రాజధాని టూరిజం పార్క్‌గా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో పాటు పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించే క్రమంలో నగరంలో అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దసరా పండుగను పురస్కరించుకుని నగరంలో సుమారు 28 రోజుల పాటు నిర్వహించే ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో పలు సంస్థలు వారి వారి ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. అలాగే నగర వాసులను అలరించేందుకు సాయంత్రం సమయంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు. వీటితో పాటు విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహించనున్నారు. అలాగే షాపింగ్ ఫెస్టివల్‌లో కొనుగోలు చేసి వారికి లక్కీ బహుమతులను కూడా పెద్ద ఎత్తున బహుకరించనున్నారు. వీటితో పాటు ఫెస్టివల్‌కు వచ్చే వారికి పలురకాలైన పసందైన వంటకాలను అందించేందుకు ఫుడ్‌కోర్టులను సైతం ఏర్పాటు చేశారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు చేతుల మీదుగా ఈ షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ఫెస్టివల్‌లో భాగంగా 50 షాపులను టూరిజం శాఖ ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరో 250 మంది వర్తకులు వారి వారి షాపును ఏర్పాటు చేయనున్నారు. ఫెస్టివల్‌లో భాగంగా ఇప్పటికే పిడబ్యూడి గ్రౌండ్ మొత్తం విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఈ షాపింగ్ ఫెస్టివల్ ఒక పండుగ వాతావరణం తీసుకురావాలనే తలంపుతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బుధవారం ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ బాబు అవిష్కరించారు. పిడబ్యుడి గ్రౌండ్స్‌తో పాటు ఇబ్రహీపట్నం దగ్గర ఉన్న పవిత్ర సంగమం, పున్నమీఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం వంటి ప్రాంతాల్లో కూడా నిర్వహించే విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల రోజుల పాటు నగర వాసులను ఈ ఫెస్టివల్ కనువిందు చేయనుంది.

ఎమ్మెల్యే బొండా ఉమపై విచారణ జరిపించాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 5: ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రాజకీయరంగు పులుముతున్న శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావుపై ప్రభుత్వమే స్వచ్ఛందంగా విచారణ జరిపించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణలంక, గంగానమ్మ గుడి వీధిలో తన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ ప్రదేశంలో ప్రతిరోజు నిత్య హోమాలు జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం జరిగే కుంకుమ పూజలో మహిళా సోదరీమణులకు ఎటువంటి ఖర్చు లేకుండా పూజా సామగ్రి కూడా తానే పంపిణీ చేయనున్నానని చెప్పారు. పోలీసులు తమ ప్రతిష్ఠను కాపాడుకునేందుకైనా రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా ఎమ్మెల్యేపై విచారణ జరపాలన్నారు. యనమలకుదురు ప్రాంతంలోని అక్రమ అంతస్తులను కూల్చకుండా ప్రభుత్వం ఆయా భవన యజమానులకు అపరాధ రుసుము విధించి నిర్మాణాలను యథాతథంగా ఉంచేలా చూడాలన్నారు. గతంలో ఇటువంటి అక్రమ కట్టడాలను క్రమబద్దీకరించేందుకు ‘వన్‌టైమ్ సెటిల్‌మెంట్’ పద్ధతిలో అపరాధ రుసుము వసూలు చేసిన విధంగానే ప్రస్తుతం కూడా ఆ పద్ధతిని ఇంకొకసారి అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం జరుతుచున్న కూల్చివేతల కారణంగా మధ్య తరగతి భవన యజమానులు ఎంతో నష్టపోతారన్నారు. గతంలో ఇలాంటి నిర్మాణాలను ప్రోత్సహించిన రాజకీయ నాయకులు, అవినీతికి అలవాటుపడిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ భవన నిర్మాణ యజమానుల నుండి డబ్బులు వసూలు చేసిన విషయం బహిరంగ రహస్యమన్నారు. ఇటీవల జరిగిన డూండీ గణేష్ విగ్రహ నిర్మాణంలో విగ్రహానికి అవసరమైన ఇనుమును తానే సమకూర్చానని, విగ్రహ నిమజ్జన సమయంలో ఆ ఇనుమును అమ్ముకునేందుకు నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సరిగా స్పందించలేదని ఆరోపించారు. తనపై అక్రమంగా బనాయించిన హత్యాయత్నం కేసులో పోలీసులు ఎంతో వేగంగా స్పందించారన్నారు. పోలీసులు ఇప్పటికైనా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తనపై పెట్టిన అక్రమ కేసులో నిజానిజాలు నగర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఇదే కేసులో జరిగిన తప్పిదాలను మీడియా నగర పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించిన సమయంలో ఆయన స్పందన బట్టి తన కేసు అక్రమమో, సక్రమమో తెలుస్తోందన్నారు. చట్టం పట్ల, న్యాయస్థానాల పట్ల తనకున్న నమ్మకమే తనను కాపాడుతుందన్నారు.