కృష్ణ

పేదల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి, అక్టోబర్ 5: పేదల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ అన్నారు. మండలంలోని చినతాడినాడ పల్లిపాలెం రహదారిలో పెద్దకుమ్ములేరు డ్రైన్‌పై రూ.32 లక్షలతో నూతనంగా నిర్మించిన వంతెనను బుధవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం పోతుమర్రు పంచాయతీ పరమానందునిపేటలో రూ.10 లక్షల 60వేలతో నిర్మించిన స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కొల్లాటి ముత్యాలు, జన్ను సహదేవుడు, జెడ్పీటిసి నున్నా రమాదేవి, ఎఎంసి ఛైర్మన్ తాడినాడ బాబు, ఎంపిటిసి రంగరాజు, కార్యదర్శి శ్రీమన్నారాయణ, ఎంఇఓ సిహెచ్ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం జిల్లా బిజెపి కార్యదర్శిగా ఎన్నికైన జన్ను సహదేవుడు ఆధ్వర్యంలో మంత్రి కామినేని శ్రీనివాస్‌ను పోతుమర్రులో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీరు అందించటం తన ప్రథమ బాధ్యత అని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించటం రెండో బాధ్యతగా చెప్పారు. మూడో బాధ్యతగా బిజెపి బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలు ఫలితాలు సాధిస్తున్నాయని సంతృప్తి వ్యక్తపర్చారు. రాష్ట్రంలో 1400 ఆసుపత్రులు నిర్మించిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. మంగళగిరిలో 193 ఎకరాల్లో రూ.1620 కోట్లతో ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు మంత్రి కామినేని వివరించారు. సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, ఎంపిపి బండి లక్ష్మి, జెడ్పీటిసి నున్నా రమాదేవి, మండల బిజెపి అధ్యక్షులు గుర్రా శ్రీరామమూర్తి, వేంపాటి విష్ణు, కోకా రమేష్, పి పుల్లారావు, జిల్లా బిజెపి బిసి సెల్ కార్యదర్శి అండ్రాజు శ్రీనివాసరావు, జిల్లా టిడిపి కార్యదర్శి వల్లభనేని శ్రీనివాస చౌదరి, చిట్టూరి రవీంద్ర, అధికారులు పాల్గొన్నారు.

నెరవేరిన చిరకాల వాంఛ!

పెడన, అక్టోబర్ 5: బండారు ఆనందప్రసాద్ చిరకాల వాంఛ నెరవేరింది. గురువారం ఉదయం 10గంటలకు ఆయన పెడన మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఒక కుటుంబం నుంచి మున్సిపల్ ఛైర్మన్‌గా అవకాశం దక్కిన రెండో నాయకుడు ఆనందప్రసాద్. ఆయన సమీప బంధువు బండారు శేషమాంబ గతంలో చైర్‌పర్సన్‌గా పనిచేశారు. గతంలో టిడిపిలో ఆయన కొనసాగారు. అప్పట్లో కూడా ఛైర్మన్ కావాలని ఎన్నో కలలు కని విఫలమయ్యారు. కాగిత వెంకట్రావుకు సన్నిహితంగా మెలిగిన ఆనందప్రసాద్ అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు.
టిడిపి, వైకాపాలకు కౌన్సిలర్లు సమానంగా రావటంతో ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే కాగిత ఓటుతో ఆ పదవికాస్తా టిడిపికి దక్కింది. అప్పటి నుంచి ఆనందప్రసాద్ పార్టీ ప్రతిపక్ష నేతగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అన్ని విషయాలపై మంచి అవగాహన ఉన్న బండారుకు అనుకోకుండా ఛైర్మన్ పదవి దక్కింది. ఛైర్మన్ యర్రా శేషగిరిరావు అకాల మరణం చెందటంతో జరిగిన ఉప ఎన్నికలో టిడిపి 15వ వార్డు కౌన్సిలర్ లంకే స్రవంతి మద్దతు పలకటంతో గత నెల 29న ఆనందప్రసాద్‌ను అదృష్టం వరించింది. బహుశా పెడనకు ఈయనే ఆఖరి ఛైర్మన్ కావచ్చు. పెడన పట్టణం బందరు మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఆనందప్రసాద్‌ను అనుకోకుండా అదృష్ట దేవత వరించింది.