కృష్ణ

ఆరంభశూరత్వమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 27: జిల్లాలో నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వ ఆర్భాటానికే పరిమితమైంది. అర్హులందరికీ రేషన్ కార్డులు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ ప్రహసనంగా మారిందని గ్రహించడం లేదు. పంపిణీ చేపట్టి నెలరోజులు గడుస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో పంపిణీ కాకపోవడం గమనార్హం. లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చే విషయంలో జరిగిన పొరపాట్ల వల్ల రేషన్ కార్డుల పంపిణీకి తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. రేషన్ కార్డుల పంపిణీ విషయంలో అధికారుల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల పంపిణీని పక్కనపెట్టారు. దీంతో జిల్లాలో లక్షలాది మంది లబ్ధిదారులు రేషన్ కార్డుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా జిల్లాకు లక్ష కార్డులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. జనవరి 2 నుండి 11 వరకు నిర్వహించిన జన్మభూమి గ్రామసభల ద్వారా పంపిణీ చేపట్టారు. కానీ ఆర్భాటంగా లక్ష కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 94వేల కార్డులు మాత్రమే మంజూరు చేసింది. 10రోజుల పాటు జరిగిన గ్రామసభల్లో కార్డుల పంపిణీని నూరుశాతం పూర్తిచేయాల్సి ఉంది. కేవలం 60వేల కార్డులు మాత్రమే పంపిణీ చేయడం గమనార్హం. తప్పులతడకగా కార్డుల ముద్రణ జరగటంతో పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిక శాతం కార్డుల్లో లబ్ధిదారుల వివరాలు సక్రమంగా లేకపోవడం, ఫొటోలు ప్రింట్ కాకపోవటంతో ఆ కార్డులను పంపిణీ చేయలేదు. కేవలం కార్డు నెంబర్లను లబ్ధిదారులకు చెప్పిన రెవెన్యూ అధికారులు మళ్లీ వివరాల సేకరణను ప్రారంభించారు. ఫొటోలు ప్రింట్ కానివారి నుండి ఫొటోలు తీసుకుని ఆన్‌లైన్ చేస్తున్నారు. లబ్ధిదారులు తమ సమగ్ర వివరాలను మీ సేవ కేంద్రాలకు ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదంతా ఇలావుంటే పాలకులు మాత్రం అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుందని ప్రతిసభలో ఊదరగొడుతుండటం తెలిసిందే.

చౌకడిపోలకు సరుకుల సరఫరాల్లో నిర్లిప్తత
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 27: ఫిబ్రవరి నెలకు చెందిన చౌకధరల దుకాణాలకు చేరాల్సిన నిత్యావసర సరుకుల స్టాకులు వెంటనే చేరేలా ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌ఛార్జిలు పనితీరులో పూర్తిస్థాయి వెనుకబాటుతనంపై కలెక్టర్ బాబు.ఎ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ నుంచి కలెక్టర్ బుధవారం ఈ అంశంపై ఆయన సమీక్షించి మండల స్థాయి స్టాకు స్టారుూ సిబ్బందితో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పది రోజులుగా జిల్లాలో ఎంఎల్‌ఎస్ పాయింట్ ఏం పని చేస్తున్నారు, ఇ-పోస్ నిర్వీయం చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారికి తోడ్పాటుగా నిలుస్తున్నారా, మీకు వచ్చే అదనపు ఆదాయం పోయిందనే బాధ ఉందా అంటూ ప్రశ్నించారు. కాంట్రాక్టర్ చెప్పినట్లు మీరు పనిచేయాలా.. మీరు చెప్పినట్లు కాంట్రాక్టర్ పని చేయాలా.. ఈ వ్యవస్థను నిర్వీర్యము చేసేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి రాబోయే 48 గంటలలో మొత్తం స్టాక్స్ షాపులకు చేరాలని స్పష్టం చేశారు.