కృష్ణ

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 8: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడాలని, అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని, నవ్యాంధ్ర రాజధాని త్వరగా పూర్తి కావాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి సంప్రదాయ ప్రకారం సతీసమేతంగా వచ్చి అమ్మవార్లకు పట్టు చీర, పసుపు,కుంకుమలు అత్యంత భక్తి ప్రమత్తులతో సమర్పించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న మీడియా పాయింట్‌లో సియం బాబు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో దసరామహోత్సవాలను కూడా విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. భవిష్యత్‌లో దుర్గగుడిని మరింత అభివృద్ధి చేయటం జరుగుతుందని దీనికి సంబంధించిన కొన్ని ప్రణాళికలు సైతం సిద్ధం చేసినట్లు వివరించారు. కొండ చుట్టూ ఉన్న కొన్ని అక్రమణలను తొలగించటం వలన విశాలమైన స్థలం ఏర్పడిందని దీనికి వలన భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతోందన్నారు. పుష్కరాల మహోత్సవాల్లో వచ్చిన విధంగానే దసరామహోత్సవాలకు కూడా భక్తులు రోజుకు సుమారు 1లక్ష మంది రావటం గొప్ప విషయమన్నారు. ప్రతినెల ఏదో ఒక పండుగ వాతావరణం కల్పించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతోందన్నారు. అమరావతి షెష్టివల్ మహోత్సవంలో శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. సాధారణ భక్తులు సైతం అమ్మవారిని దర్శించుకునే విధంగా దుర్గగుడి అధికారులు ఏర్పాట్లు చేయటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దుర్గగుడి ఏర్పాటు చేసిన ట్రస్ట్‌బోర్డుకు సంబంధించిన జివోను సైతం త్వరలో విడుదల చేయటం జరుగుతోందని, ఇదేవిధంగా అమ్మవారి దేవస్థానం పేరుమార్చిన విషయాన్ని సియం దృష్టికి తీసుకురాగా ఈఅంశాన్ని పరిశీలించటం జరుగుతోందన్నారు. సియం వచ్చే ముందు బాంబ్ స్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా ఆలయ సిబ్బంది అమ్మవారి రాజగోపురం నుండి అంతరాలయం వరకు ప్రత్యేకంగా కార్పెంట్‌ను ఏర్పాటు చేశారు. అమ్మవారి రాజగోపురం వద్ద సతీసమేతంగా వచ్చిన సియంకు దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి ఆదేశాల మేరకు దుర్గగుడి స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్, ప్రధాన అర్చకులు లింగంబొట్ల దుర్గా ప్రసాద్, శంకర శౌండిల్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకువెళ్లారు. అమ్మవారి దర్శనం తర్వాత ఇవోకు సియంకు అమ్మవారి చిత్రపటం, ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు. ఈకార్యక్రమంలోసియం వెంట రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణాజిల్లా కలెక్టర్ బాబుఎ, సిపి గౌతమ్ సవాంగ్, మేయర్ కోనేరు శ్రీ్ధర్, దుర్గగుడి కమిటీ చైర్మన్ యలమంచలి గౌరంగబాబు, ధర్మకర్తలు పద్మశేఖర్, వెలగపూడి శంకరబాబు, సూర్యకుమారి, దేవస్థానం పిఎ శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
నాగాయలంక, అక్టోబర్ 8: కృష్ణానది తీరం వద్ద కొన్ని రోజులుగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం సాక్షిగా ఈ నెల 2 నుంచి ఇసుక దందా గుట్టుగా సాగుతున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనివెనుక అధికార పక్షానికి చెందిన రాజకీయ ప్రముఖుడి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాలో ఈ గ్రామానికే చెందిన కొందరు వ్యక్తులు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. స్థానిక సహకార బ్యాంక్ డైరెక్టర్, సిమెంట్ వ్యాపారి, కాంట్రాక్టర్, ఓ ఆలయ అభివృద్ధి కమిటీ డైరెక్టర్, నాగాయలంక మండలానికే చెందిన ఓ మాజీ సర్పంచ్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. తెల్లవారుఝామున 4గంటల నుంచి ఉదయం 7గంటల్లోపు నదీ తీరానికి చేరే పడవల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని అంటున్నారు. ఓ పడవ రాగానే ట్రాక్టర్ అక్కడికి చేరుకుని లోడింగ్ చేసుకుని వెళ్లిపోగానే మరికొంత వ్యవధిలో మరో పడవ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగాయలంక ప్రధాన వీధిలో పాత పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి ఈ ఇసుక తోలుతున్నట్లు తొలుత నమ్మబలికిన అక్రమ రవాణాదారులు తరువాత ముఖం చాటేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్నిరోజులుగా కృష్ణానదికి వచ్చిన వరద నీరు ఇసుక అక్రమ రవాణాదారుల పాలిట వరంగా మారింది. దీంతో వీరు నాగాయలంక సమీపంలోనే ఇసుకను వెలికితీసి పడవల ద్వారా పథకం ప్రకారం ఒడ్డుకు చేర్చుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. వారం రోజులుగా ఇసుక అక్రమ తరలింపు ద్వారా అటు మధ్యవర్తులు, ఇటు కిందిస్థాయి ఉద్యోగులకు పెద్దమొత్తంలో సొమ్ము చేతులు మారుతున్నట్లు విశ్వసనీయవర్గాల భోగట్టా. దీనిపై శనివారం తహశీల్దార్ స్వర్గం నరసింహారావును వివరణ కోరగా.. ఇసుక అక్రమ రవాణా విషయం తెలిసిందే తడవుగా గ్రామ రెవెన్యూ అధికారులను కృష్ణాతీరానికి విచారణకు పంపామని చెప్పారు. ఒక ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని తమ కార్యాలయానికి చేర్చినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
విస్సన్నపేట, అక్టోబర్ 8: విస్సన్నపేటకు చెందిన వెలిశెల ప్రియాంక (22) అనే వివాహిత యువతి శనివారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విస్సన్నపేటకు చెందిన వెలిశెల జోషి కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ప్రియాంకతో అన్యోన్యంగా ఉంటున్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు సంతానం. ఏమి జరిగిందో, ఏమో శనివారం ప్రియాంక ఇంటికి తలుపు వేసి ఉండగా పిల్లలిద్దరూ ఏడుస్తున్నారు. గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు నెట్టి చూడగా ప్రియాంక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతోంది. అటు భర్తకు, ఇటు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి మృతదేహాన్ని కిందికి దించారు. ఎస్‌ఐ సంఘటన స్థలానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రియాంక మృతికి కారణం తెలియలేదని, దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వివరించారు.