కృష్ణ

అగ్రిగోల్డ్ బాధితుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 8: అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర పిలుపులో భాగంగా శనివారం రాష్టవ్య్రాప్తంగా రాస్తారోకోలు, అరెస్టులు జరిగాయి. ఇక స్థానిక రామవరప్పాడు సెంటర్ వద్ద జరిగిన రాస్తారోకో కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు నేతృత్వంలో రాస్తారోకో కార్యక్రమం జరిగింది. ఈ రాస్తారోకో కార్యక్రమంలో ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గ్భావాని, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ అప్సర్, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి పి.చంద్రానాయక్ వందలాది మంది బాధితులను పోలీసులు అరెస్టు చేసి మాచవరం, పెనమలూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి పి.వి.సుందరరామరాజు తదితరులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి అరెస్టయిన వారిని పరామర్శించి, అగ్రిగోల్డ్ బాధితులకు సంఘీభావం తెలిపారు.
అరెస్టు చేసి పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు తరలించిన వారిని, సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచినప్పటికీ కనీసం మధ్యాహ్న భోజన సదుపాయాలను కూడా పోలీసులు కల్పించలేదు. ముప్పాళ్ల నాగేశ్వరరావు పెనమలూరు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి, అరటిపళ్లు కొనుగోలు చేసి పోలీసుల వైఖరికి నిరసన తెలిపారు.
అరెస్టయిన వారిలో కృష్ణా జిల్లా మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి.రాణి, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు షెహెన్‌షా, యువజన సమాఖ్య ఇల్లా అధ్యక్షుడు మోతుకూరి అరుణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి నరేష్, నాయకులు బుద్దె రాజా, అగ్రిగోల్డ్ ఏజెంట్లు, బాధితులు రహమాన్, సాంబశివరావు, శ్రీనివాసరావు తదితరులతో పాటు 250 మందిని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో 19.52 లక్షల ఖాతాలకు గాను 3,957 కోట్లను, దేశంలో 8 రాష్ట్రాలకు చెందిన 32 లక్షల ఖాతాలకు గాను 7,623 కోట్లను చెల్లించాల్సిన అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారులకు టోకరా వేసి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినా పట్టించుకోకుండా బోర్డు తిప్పేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి 20 వేల రూపాయల లోపు ఖాతాదారులకు చెందిన పేదలకు చెల్లించి ఆత్మహత్యలు నిర్మూలించాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని ముప్పాళ్ల హెచ్చరించారు.

జిల్లాలో భారీగా ఎస్‌ఐల బదిలీ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, అక్టోబర్ 8: జిల్లాలో పెద్దఎత్తున సబ్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 26 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్‌కుమార్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో విఆర్‌లో ఉన్న 15 మంది ఎస్‌ఐలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. మిగిలిన 11 మందిని విఆర్‌లో ఉంచారు. విఆర్‌లో ఉన్న పి సురేష్‌ను చిలకలపూడి పోలీసు స్టేషన్‌కు, పి కిషోర్‌ను వీరులపాడుకు, పి రామకృష్ణను మైలవరానికి, బి అభిమన్యును పామర్రుకు, డి సందీప్‌ను పెదపారుపూడికి, ఎస్ ప్రియకుమార్‌ను జగ్గయ్యపేటకు, డి రాజేష్‌ను జి కొండూరుకు, కె శివన్నారాయణను ముసునూరుకు, ఇ శివప్రసాద్‌ను గుడ్లవల్లేరుకు, కె శ్రీనివాసును బందరు తాలూకాకు, ఎన్‌వివి సత్యనారాయణను రెడ్డిగూడేనికి, కె రాజారెడ్డిని నాగాయలంకకు, పి సోమశేఖరరెడ్డిని కూచిపూడికి, ఎన్ నవీన్‌ను బంటుమిల్లికి, బి వెంకట కుమార్‌ను నూజివీడు టౌన్‌కు బదిలీ చేశారు. వీరులపాడు ఎస్‌ఐ అవినాష్, మైలవరం ఎస్‌ఐ ఎ దుర్గాప్రసాద్, పామర్రు ఎస్‌ఐ ఎం వెంకట నారాయణ, పెదపారుపూడి ఎస్‌ఐ పి జగదీశ్వరరావు, జగ్గయ్యపేట ఎస్‌ఐ పి శ్రీను, ముసునూరు ఎస్‌ఐ పి విజయకుమార్, గుడ్లవల్లేరు ఎస్‌ఐ ఎ ఉమామహేశ్వరరావు, బందరు తాలూకా ఎస్‌ఐ పి ఉమామహేశ్వరరావు, నాగాయలంక ఎస్‌ఐ జి అనిల్‌కుమార్, కూచిపూడి ఎస్‌ఐ వి సతీష్, బంటుమిల్లి ఎస్‌ఐ పి వాసులను విఆర్‌లో ఉంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
వైభవంగా శక్తిపటాల ఉత్సవం
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 8: బందరు ప్రాభవం, విశిష్ఠతను లోకానికి తెలియజేయటమే లక్ష్యమని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక కోనేరు సెంటర్‌లో శనివారం శక్తిపటాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ సుమారు 150 సంవత్సరాల క్రితం బుద్దు సింగ్ ప్రవేశపెట్టిన శక్తిపటాల ఊరేగింపులు నేటికీ కొనసాగుతుండటం విశేషమన్నారు. దేశంలో కోల్‌కత్తా తరువాత శక్తిపటాల ఊరేగింపులకు బందరు రెండో పట్టణంగా గుర్తింపు పొందిందన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దీక్షతో లోకకల్యాణార్థం శక్తిపటాలను ఇంటింటికీ ఊరేగించటం అనాదిగా వస్తోందన్నారు. పండరీపురంలోని పాండురంగడు వేసిన ఆధ్యాత్మక కేంద్రం మచిలీపట్నం అని చెప్పారు. కార్తీక మాసంలో పాండురంగ ఉత్సవాలు- 2017, జనవరిలో యువకెరటాలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు. గతంలోనే ప్రపంచ పటంలో మచిలీపట్నం గుర్తింపు పొందిందన్నారు. డచ్, పోర్చుగీసు, ఆంగ్లేయిలు తమ వ్యాపారాన్ని ఇక్కడి నుంచి కొనసాగించారన్నారు. విశాఖపట్నం, చెన్నై, కాకినాడల కన్నా ప్రాముఖ్యతను సంతరించుకున్న పోర్టు బందరు పోర్ట్ అని చెప్పారు. దేశంలోనే రెండో మున్సిపాల్టీగా ఏర్పడిన మచిలీపట్నం జనాభా 1797లో 60వేలు కాగా, తుఫాన్ కారణంగా 30వేల మంది మరణించారన్నారు. నాడు విజయవాడలో 5వేలు, గుంటూరులో 16వేలు, జగ్గయ్యపేటలో 10వేల మంది మాత్రమే ఉండేవారన్నారు. బందరు పోర్టు నిర్మాణాన్ని దైవ కార్యక్రమంగా స్వీకరించి అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని మంత్రి రవీంద్ర ప్రకటించారు. నాడు దేవతలు చేసే యజ్ఞాలను పాడుచేయాలని ప్రయత్నించిన దానవులు మరణించారన్నారు. అలాగే నేడు పోర్టుకు అవరోధం కల్పించేవారి ఆటలు సాగనివ్వబోమని ఆయన హెచ్చరించారు. అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పోర్టు నిర్మాణాన్ని తప్పనిసరిగా పూర్తిచేసి తీరుతామన్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సమన్వయంతో సహజీవనం సాగించటం బందరు పట్టణ విశేషమని మంత్రి రవీంద్ర వివరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు, తదితరులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్‌లలో 1527 కేసుల పరిష్కారం
మచిలీపట్నం (లీగల్), అక్టోబర్ 8: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో శనివారం జరిగిన లోక్ అదాలత్‌లలో మొత్తం 1527 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో 1370 క్రిమినల్ కేసులు, 60 సివిల్ కేసులు, 987 ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నాయి. విజయవాడ, మచిలీపట్నం సహా 13 ప్రాంతాల్లో లోక్ అదాలత్‌లు నిర్వహించారు. మచిలీపట్నంలో జరిగిన లోక్ అదాలత్‌ను స్థానిక 9వ అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ సామరస్య పూర్వకమైన వాతావరణంలో కక్షిదారులు తమ సమస్యలను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులకు అప్పీలు ఉండదని, సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు వాపసు ఇచ్చినట్లు తెలిపారు. 6వ అదనపు జిల్లా జడ్జి మల్లిఖార్జునరావు, జిల్లా లోక్ అదాలత్ ఛైర్మన్ రజని, లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ పిఆర్ రాజీవ్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస శర్మ పాల్గొన్నారు. మచిలీపట్నం లో జరిగిన లోక్ అదాలత్‌లో 301 కేసు లు పరిష్కారమయ్యాయి. వీటిలో సివిల్ మూడు, క్రిమినల్ కేసులు 298 ఉన్నాయి.