కృష్ణ

ఇ-ఆఫీసు ద్వారా ఫైళ్లు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 10: జిల్లాలో ఇ-ఆఫీసు ద్వారా ఫైళ్లు నిర్వహించని శాఖలపై చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింటు కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. సోమవారం జిల్లా సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను జెసి చంద్రుడు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇ-ఆఫీస్‌లో కేవలం కలెక్టర్, జాయింటు కలెక్టర్ కార్యాలయాలకు మాత్రమే ఫైల్స్ పంపటం జరుగుతుందన్నారు. సంస్థాగతంగా నిర్వహించే ఫైల్స్ పాత విధానంలో జరుగుతున్నాయని జెసి తెలిపారు. గతంలో సెక్రటరీలు, హెచ్‌ఓడి స్థాయి అధికారులు పాద పద్దతిలోనే ఫైల్స్ పరిశీలన చేసేవారన్నారు. మారిన పరిస్థితుల దృష్ట్యా సెక్రటరీలు, హెచ్‌ఓడిలు ఇ-ఆఫీస్ ద్వారానే ఫైల్స్ పరిశీలిస్తున్నారన్నారు. ప్రతి కార్యాలయం ఫైల్స్‌ను ఇ-ఆఫీసులోనే నిర్వహించాలన్నారు. ఇ-ఆఫీసు నిర్వాహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చూస్తుందని, అన్ని శాఖల ఫైల్స్‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని జెసి గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ పి సాయిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గోదావరి జలాలతో
జిల్లా సస్యశ్యామలం
మైలవరం, అక్టోబర్ 10: చింతలపూడి ఎత్తిపోతల పధకం నుండి గుడ్డిగూడెం ప్రాజెక్ట్ ద్వారా వచ్చే గోదావరి జిలాలతో కృష్ణాజిల్లాలోని పంట భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మైలవరంలో సోమవారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. గుడ్డిగూడెం ప్రాజెక్ట్ నుండి 24 టీఎంసిల నీరు గోదావరి నది నుండి విడుదలవుతాయని వీటిలో 20టీఎంసిల నీరు కృష్ణాడెల్టాకు విడుదల చేయగా మిగిలిన నాలుగు టీఎంసిల నీరు పశ్చిమ కృష్ణాకు విడుదల చేయటం జరుగుతుందన్నారు. ఈనీటితో కృష్ణాజిల్లాలోని పంట భూములన్నీ పచ్చని పైర్లుగా రైతులకు శిరులు కురిపించనున్నాయన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పధకం, గుడ్డిగూడెం ప్రాజెక్ట్‌పై అవగాహన లేకుండా అవాకులు, చవాకులు పేలుతూ ఎద్దేవాలు చేసే వైసీపీ నేతలు ఏం సమాదానం చెబుతారో రైతులే నిర్ణయిస్తారన్నారు. వచ్చే రబీ సీజనులో ఎట్టిపరిస్థితులలో సాగరు జలాలను రప్పించి పంటలు కాపాడుతామని, ఆపై వచ్చే రబీ సీజను నాటికి గోదావరి జలాలను రప్పించి ప్రభుత్వ ప్రతిష్టను పెంచుతామని స్పష్టం చేశారు. ఆ గోదావరి నీటిలో ఇప్పుడు విమర్శిస్తున్న వైసీపీ నేతలు కొట్టుకుపోక తప్పదని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితులలోనూ చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 117 కిలోమీటరు వరకూ గోదావరి జలాలను రప్పించి విమర్శకుల నోళ్ళు మూయిస్తానని శపధం చేశారు. ఈసమావేశంలో ఎస్వీఎన్ నివృత్‌రావు, తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.