కృష్ణ

టిడిపి హయాంలోనే పోర్టు నిర్మిస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 12: బందరు ఓడరేవు, అనుబంధ పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సేజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ల్యాండ్ పూలింగ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రధానంగా మారిన బందరు పోర్టు దాని అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇందుకు రైతులు నుండి సమీకరించే భూములకు అమరావతి తరహాలో ప్యాకేజిని ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ప్యాకేజి ప్రయోజనాలను గ్రామాల వారీగా రైతులకు సవివరించి భూములు ఇచ్చే విధంగా చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని టిడిపి నాయకులు, కార్యకర్తలు తిప్పకొట్టాలన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న బందరు పోర్టును తమ ప్రభుత్వ హయాంలో నిర్మించి తీరుతామన్నారు. రైతుల భాగస్వామ్యంతో పోర్టు నిర్మాణం జరుగుతుందని, స్వచ్ఛందంగా భూములు ఇచ్చే ఏ ఒక్క రైతుకూ నష్టం కలుగనివ్వమన్నారు. ప్రపంచ స్థాయి వసతులతో కూడిన మెగా టౌన్‌షిప్‌లో రైతులకు నివేశన, వాణిజ్య అవసరాలకు ప్లాట్‌లు ఇస్తామన్నారు. దీని ద్వారా రైతుల భూములు కోట్లాది రూపాయల విలువ చేస్తాయన్నారు. ఈ అవకాశాన్ని రైతులు చేజార్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాధం, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, కొనకళ్ళ జగన్నాధరావు(బుల్లయ్య), తహశీల్దార్ నారదముని, మడ డెప్యూటీ కలెక్టర్లు, ఆర్‌ఐలు, విఆర్‌ఓలు పాల్గొన్నారు.