కృష్ణ

ఉచిత ఇసుక విధానాన్ని పటిష్ఠంగా అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 19: జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న క్వారీల ద్వారా పేదలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తేవాలన్నారు. ఇబ్బందులు కలిగించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న రెండేళ్లలో అర్హులందరికీ నివేశన స్థలాలు, పక్కా ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తామని స్పష్టం చేశారు. జెడ్పీటిసి, ఎంపిపిలను పట్టిసీమ, పోలవరం సందర్శనకు తీసుకెళ్లాలని జెడ్పీ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధకు ఉమ సూచించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బిసి విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఏడాదికి రూ.10లక్షలు మంజూరు చేసే పథకాన్ని నూతనంగా ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు 64 మందిని విదేశాలకు పంపగా 200 మంది ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని వివరించారు. ఐఎఎస్, ఐపిఎస్ వంటి ఉన్నత పోటీ పరీక్షలకు కోచింగ్ కేంద్రాలను గుర్తించి ఒక్కో విద్యార్థికి రూ.2.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. లక్ష మంది విద్యార్థులకు రూ.100కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రయోజనాన్ని కల్పించామని తెలిపారు. బందరు పోర్టు, పరిశ్రమల స్థాపనకు రైతులు స్వచ్ఛందంగా 1650 ఎకరాల భూమిని ఇచ్చారని తెలిపారు. భూసమీకరణపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.