కృష్ణ

ఆక్రమిత స్థలాల్లోని ఇళ్లకూ మంచినీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 19: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధిని ప్రభావితం చేసే రెండు కీలక నిర్ణయాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం దేశంలోనే ప్రప్రధమంగా ‘ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్‌మెంట్ ఫండ్’ పేరుతో ప్రత్యేక నిధి (ట్రస్ట్)ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ట్రస్ట్‌ను సమర్ధంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా ఒక కంపెనీని నెలకొల్పుతారు. బుధవారం తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రికి పురపాలక శాఖ అధికారులు ఈ ట్రస్ట్, కంపెనీలపై నివేదిక అందించారు. రాష్ట్ర పురపాలక అభివృద్ధిలో ఈ సంస్థల ఏర్పాటు ఒక మైలురాయిగా అధికారులు భావిస్తున్నారు. భారతీయ ట్రస్ట్‌ల చట్టం, 1882 ప్రకారం ఏపియుడిఎఫ్‌ను ఒక చట్టబద్దత గల ట్రస్ట్‌గా ఏర్పాటు చేస్తారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా దీన్ని రిజిస్టర్ చేస్తారు. ఏపియుడిఎఫ్ నిర్మాణం ఎలా ఉండాలనే అంశంపై ముఖ్యమంత్రి ముందు అధికారులు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. వాటికి ఆయన ఆమోదం తెలిపారు. ప్రాథమికంగా రూ. 5వేల కోట్లతో మూలనిధిని ఏర్పాటు చేస్తారు. ఇది ఒక ట్రస్ట్‌గా వ్యవహరించనున్నది. ఈ ట్రస్ట్‌ను నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఒక అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఉండాలని అధికారులు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ పేరుతో ఈ ఏడాది జూలై 15న కంపెనీల చట్టం, 2013 ప్రకారం దీన్ని ఇప్పటికే రిజిస్టర్ చేశారు. ఈ 24 ఇన్‌టు 7 నీటి సరఫరాను రూ. 172 కోట్ల అంచనా వ్యయంతో ఈ సంస్థ చేపట్టనుంది. విజయవాడలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రాంతంలో 20వేల కుటుంబాలకు నీటి సరఫరా చేయాలని సంకల్పించారు. అలాగే ఈ సంస్థ గుంటూరు, మచిలీపట్నం, తిరుపతి, కాకినాడ నగరాల్లో సమగ్ర మురుగునీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టబోతోంది. విశాఖపట్నంలో రూ. 814 కోట్ల అంచనాతో ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. వివిధ ప్రైవేట్ సంస్థలతో కలిసి ఏలూరు ఆకర్షణీయ నగర నిర్మాణం చేపడుతుంది. ఆక్రమిత ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న ప్రజానీకానికి ఇప్పటికే విద్యుత్, మురుగునీటి పారుదల తదితర సదుపాయాలు ఉన్నాయని, అటువంటి ఇళ్లకు ఇకపై నీటి సరఫరా అందించడానికి వెనుకాడటంలో అర్ధం లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆక్రమిత స్థలాల్లో ఎన్నోఏళ్లుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారి కోసం తక్షణం నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్మార్ట్ పల్స్ సర్వేలో వస్తున్న గణాంకాలను పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా ఇ-గవర్నెన్స్‌లో ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి తెలిపారు. పట్టణాలు, నగరాల్లో పౌర సమస్యలపై క్షేత్ర సిబ్బంది తక్షణం స్పందించేందుకు ఉద్దేశించిన పుర సేవ మొబైల్ ఆప్లికేషన్ గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. త్వరలో ఈ యాప్‌ను విడుదల చేసి పట్టణ ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమ స్థాయిలో ఉద్యోగ సిబ్బంది పనిచేసేలా చూస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, పురపాలక ముఖ్య కార్యదర్శి కరికాల్ వలవన్, పురపాలక కమిషనర్ కన్నబాబు, ప్రకాశ్ తదితర అధికారులు పాల్గొన్నారు.