కృష్ణ

పారదర్శకతతోనే అవినీతి నిర్మూలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 5: అవినీతి వల్ల నష్టపోయేది మనమే అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలని, అప్పుడే అవినీతి రహిత సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి అన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆథ్వర్యంలో కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలో నిర్వహించిన విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలను శనివారం ఆయన ముఖ్య అతిధిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ అవసరానికి మించిన ఖర్చులు అవినీతికి కారణం అవుతున్నాయన్నారు. పారదర్శకంగా ఉన్నప్పుడే అవినీతిని రూపుమాపవచ్చన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థలు అందిస్తున్న సేవలకు నిర్దిష్టమైన సమయాన్ని నిర్దేశించుకోవాలన్నారు. అవినీతి నిర్మూలన వ్యక్తితో మొదలై ఉద్యమంలా సాగాలన్నారు. జాతిపిత మహాత్మ గాంధి సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరూ ఆయన సిద్ధాంతాన్ని తప్పు పట్టారన్నారు. అయినప్పటికీ సహాయ నిరాకరణ ద్వారానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. విద్యార్థి దశ నుండే యువత అవినీతి పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ (డిబిటి) నగదు బదిలీ పథకంపై బ్రిటన్ కాన్ఫరెన్స్‌లో ప్రశంసలు వచ్చాయన్నారు. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రైతాంగ ఉద్యమాలు, రైతు నాయకులకు ఘంటసాల పురిటిగడ్డ అన్నారు. అవినీతి రహిత భారతదేశాన్ని తయారు చేయడంలో విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ప్రజల ఆలోచనల్లో పెనుమార్పులు రావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో కూడా ముఖ్యంగా రైతుల్లో అవినీతిపై ఇటువంటి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. నిరాడంబర జీవితాన్ని అనుభవించిన నాడే అవినీతిని రూపుమాపగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలో మంత్రులు సామాన్య ప్రజలు ప్రయాణించే బస్సుల్లోనే వస్తారని, ఒరిస్సా ముఖ్యమంత్రి కూడా ఎటువంటి అర్భాటం లేకుండా సామాన్య వ్యక్తిలా కార్యక్రమాలకు హాజరవుతారని వివరించారు. పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి జరగకుండా నిరోధించవచ్చన్నారు. విద్యాలయాల్లో అవినీతి నిర్మూలనను ఓ పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీకాంత్, కలెక్టర్ బాబు.ఎ, జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య, బెల్ కంపెనీ డైరెక్టర్ గిరీష్ కుమార్, జనరల్ మేనేజర్ రమేష్, సెక్రటరీ శ్రీకాంత్, సెంట్రల్ విజిలెన్స్ ఆఫీసర్ శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.