కృష్ణ

భారీగా పడిపోయిన మినుము ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 9: మినుముల ధరలు ఎవ్వరూ ఊహించని విధంగా దిగజారిపోతుండటంతో భారీగా నిల్వలు పెట్టిన వ్యాపార వర్గాలు, మోతుబరుల రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. విత్తనాల సమయంలో బస్తా రూ.15వేలు నుండి రూ.18వేలు వరకు ఉంటుందని ఆశపడిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. మినుముల ధరలపై ఎంతో ఆశతో అధిక ధరలకు కొనుగోలు చేసిన దళారులు తీవ్రంగా నష్టపోయారు. తగ్గిన ధరలతో పాటు నిల్వ చేసినందుకు గోదాములకు అద్దెలకు కూడా గిట్టుబాటుకాక లబోదిబోమంటున్నారు. గత సంవత్సరం రెండవ పంటగా సాగు చేసిన మినుము దిగుబడులు ఆశాజనకంగా రావటంతో వ్యాపారులు, రైతులు మినుముల నిల్వలను గోదాములల్లో దాచి ఉంచారు. గత సంవత్సరం 100 కిలోల మినుముల బస్తా రూ.14,500లు ధర పలకగా అది క్రమేపి తగ్గుతూ రూ.10వేలకు చేరుకుని దాదాపు ఆరు నెలల పాటు నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తపంట సాగు జరిగే అవకాశం ఉండటంతో ముందగానే ధరలు తగ్గించి రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఖరీఫ్‌లో సాగునీరు అందని వ్యవసాయ భూములలో భారీగా వర్షాలు కురవడంతో మెట్ట ప్రాంతాలతో పాటు మాగాణి భూముల్లో కూడా ఖరీఫ్‌గా సాగు చేసిన మినుము పంట కోతలకు సిద్ధమైన నేపథ్యంలో ధరలు తగ్గింటం రైతన్నలను కృంగతీస్తోంది. పుండుమీద కారంలా ప్రభుత్వం పప్పు ధాన్యాల ధరలను తగ్గించేందుకు ఇతర దేశాల నుండి మినుములు, కందులు దిగుమతులు చేయడంతో ఇప్పట్లో ధరలు పెరిగే అవకాశం లేదని దళారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రబీగా మినుము సాగుకు రైతన్నలు ఆసక్తి అంతగా కనపర్చటంలేదు. ఫలితంగా భవిష్యత్తులో మరలా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.

గండ్రాయి జనచైతన్యయాత్రలో బయటపడిన వర్గవిభేదాలు

జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 9: మండలంలోని గండ్రాయి గ్రామంలో అధికార తెలుగుదేశం పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిబేధాలు జనచైతన్యయాత్రలో బహిర్గతమైయ్యాయి. బుధవారం కనపర్తి, కొఠారు వర్గీయులు రెండుగా ఏర్పడటంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం 9గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, మండల పార్టీ అధ్యక్షుడు కట్టా నర్శింహరావు, జిల్లా సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు ముల్లంగి రామకృష్ణారెడ్డి, జిల్లా యువత అధ్యక్షుడు వెల్ది శ్రీనివాసరావు తదితరులు జన చైతన్యయాత్రలో పాల్గొనేందుకు గ్రామానికి చేరుకోగా హైస్కూల్ సమీపంలో సొసైటి అధ్యక్షుడు కనపర్తి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షుడు కనపర్తి వంశీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి ఎస్‌సి కాలనీ మీదుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అక్కడికి కొద్ది దూరంలోనే జిల్లాపార్టీ కార్యదర్శి కొఠారు సత్యనారాయణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన వర్గీయులు ఎమ్మెల్యేకి స్వాగతం పలికేందుకు డప్పు వాయిద్యాలతో సిద్ధంగా ఉన్నారు. కనపర్తి వర్గం ఎమ్మెల్యే ర్యాలీని హైజాక్ చేసి దారి మల్లించడంతో విస్తూపోయిన కొఠారు వర్గం చాలా సేపు ఎమ్మెల్యే కోసం రోడ్డుపైనే పడిగాపులు కాసారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులు స్థానిక పరిస్థితిని సిఐ లచ్చునాయుడు, ఎస్‌ఐ వంశీకృష్ణలకు తెలపడంతో వారు హుటాహుటిన సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. రెండు వర్గాలు భారీగా జన సమీకరణ చేయగా చాలా సేపు ఎమ్మెల్యే కోసం నిరీక్షించిన కొఠారు వర్గం గ్రామంలో విడిగా ర్యాలీ నిర్వహించారు. వారి ర్యాలీని ప్రధాన సెంటర్‌లో పోలీసులు అడ్డుకొని వేరే దారిలోకి మళ్లించారు. ఈ సందర్భంగా పోలీసులతో కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. సర్దుబాటు చేసిన పోలీసులు వారిని కొఠారు ఇంటిలో గృహ నిర్బంధం చేసి ఎలాంటి అలజడి జరగకుండా ప్రధాన సెంటర్‌లో బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే ర్యాలీ 12.30వరకూ జరగ్గా ఆయన రాక కోసం కొఠారు వర్గం ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. వివాదం సర్దుబాటు కాకుండానే ఎమ్మెల్యే చెరువుమాధవరం ట్యాంకు పరిశీలనకు వెళ్లారు. మంగళవారం అర్థరాత్రి గ్రామంలో ఫ్లెక్సీల ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడి పరస్ఫరం రాళ్లు విసురుకునే వరకూ వెళ్లిందని స్థానికులు తెలిపారు. పార్టీ నేతలు ముందుగా రెండు వర్గాలను సమన్వయం చేసి కార్యక్రమం నిర్వహిస్తే బాగుండేదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగనివ్వకండి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 9: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగినపూడి బీచ్‌కు సముద్ర స్నానాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని బందరు ఆర్డీవో సాయిబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సముద్ర స్నానాల ఏర్పాట్లపై బుధవారం ఆయన తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మంగినపూడి బీచ్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్త్భివం, ఆధ్యాత్మికత ఉట్టి పడే విధంగా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రావటంతో అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. సుమారు రెండు లక్షల మంది వరకు పుణ్య స్నానాలకు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లను పటిష్ఠంగా చేయాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రత్యేక చర్యలు గైకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. తాళ్ళపాలెం బడ్డీల సెంటరు నుండి బీచ్ ముఖ ద్వారం వరకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్, బారికేడింగ్, ఫోకస్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే సముద్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా 60 మంది గజ ఈతగాళ్ళను, 20 బోట్లు, హెచ్చరిక బోర్డులు, బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా 60 మంది పారిశుద్ధ్య కార్మికులు, నలుగురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు శానిటరీ మేస్ర్తీలు, 20 మంది పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య విధులకు నియమించాలని డివిజనల్ పంచాయతీ అధికారి సత్యనారాయణను ఆదేశించారు. కార్తీక పౌర్ణమి రోజైన 14న ఉదయం 5 గంటలకు కార్తీక జ్యోతి, సాయంత్రం పంచహారతి ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డియస్‌పి శ్రావణ కుమార్, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, పర్యాటక శాఖ ఎడి రాం లక్ష్మణ్, ఎంపిడివో జివి సూర్యనారాయణ, తహశీల్దార్ బి నారదముని, ట్రాన్స్‌కో ఎడి గోవిందరాజులు, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ సీతాపతిరావు, ఆర్‌అండ్‌బి, అగ్నిమాపక శాఖాధికారులు పాల్గొన్నారు.

క్రీడాంధ్రప్రదేశ్‌గా నవ్యాంధ్ర
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 9: క్రీడాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని, మూలపాడును అడ్వెంచర్ స్పోర్ట్స్ సిటీగా తయారుచేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని ఎసిఎ క్రికెట్ మైదానాలకు బుధవారం ఆయన నామకరణం చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ యువతలో చదువుతో పాటు క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక వికాసం పెంపొందించి రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. మూలపాడులో ట్రెక్కింగ్‌కు మంచి కొండలు ఉన్నాయని అంటూ అమరావతిని బ్లూ అండ్ గ్రీన్‌సిటీగా నిర్మిస్తామన్నారు. యువత క్రికెట్‌తో పాటు అన్ని క్రీడాంశాల్లో పాల్గొనాలన్నారు. చిన్నప్పడే కాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఏదోఒక క్రీడలో పాల్గొనాలని సూచించారు. నూతన రాజధాని అమరావతిని క్రీడల్లో నెంబర్ వన్‌గా ఉండేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గచ్చిబౌలిని క్రీడా కేంద్రంగా మార్చడంతో పివి సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించిందని ఉదహరించారు. ఎంతో ఆహ్లాదకరమైన కొండల మధ్య పచ్చని మైదానంతో క్రికెట్ స్టేడియంలు నిర్మించడం అభినందనీయమన్నారు. స్టేడియంకు డా. గోకరాజు లైలా గంగరాజు ఎసిఎ క్రికెట్ కాంప్లెక్స్‌గా నామకరణం చేశారు. ఈ కాంప్లెక్స్‌లో ఉన్న రెండు మైదానాలకు విడివిడిగా ‘దేవినేని వెంకటరమణ - ప్రణీత క్రికెట్ గ్రౌండ్’, ‘చుక్కపల్లి పిచ్చయ్య క్రికెట్ గ్రౌండ్’గా నామకరణం చేశారు. ఇది చారిత్రాత్మకమైన ఘట్టమని చంద్రబాబు అభివర్ణించారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్ టోర్నమెంట్‌ను మూలపాడులో నిర్వహించడం, విశాఖపట్నంలో ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ నిర్వహణ ముఖ్య విశేషాలన్నారు. మన రాష్ట్రానికి చెందిన ఎంఎస్‌కె ప్రసాద్‌ను బిసిసిఐ ఛీప్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. విజయవాడకే చెందిన ఆర్ కల్పన, మేఘన భారత మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహించడం సంతోషకరమంటూ వారిని అభినందించారు. క్రికెట్ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రావాలని, మెరిట్ ప్రకారం చూస్తే మనవాళ్లే ఎక్కువ మంది ఉంటారన్నారు. అనంతరం భారత్ - వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్ల సభ్యులను చంద్రబాబు పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపు చేతులకు గ్లౌజులు వేసుకుని బ్యాటింగ్ చేశారు. అంతకుముందు స్టేడియంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా మైదానాలు నిర్మించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్, ఎసిఎ కార్యదర్శి, బిసిసిఐ ఉపాధ్యక్షులు జి గంగరాజు, శాప్ చైర్మన్ పిఆర్ మెహన్, బిసిసిఐ ఛీప్ సెలక్టర్ ఎంఎస్‌కె ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, పాల్గొన్నారు.

మహిళా క్రికెట్.. నేడు తొలి వనే్డ
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 9: భారత్ - వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్ల మధ్య గురువారం తొలి వనే్డ మ్యాచ్ జరగనుంది. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభవౌతుంది. ఇరుజట్లు నువ్వా.. నేనా అన్నట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. భారత జట్టులో జులాన్ గోస్వామి, వేదా కృష్ణమూర్తితో పాటు కెప్టెన్ మిథాలీరాజ్‌లపై క్రీడాభిమానులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. బుధవారం స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కారణంగా ప్రాక్టీస్ సెషన్‌కు తగిన సమయం కేటాయించలేదు. భారత జట్టు పేసర్లు జులాన్ గోస్వామి, షికాపాండే, సుకన్యపరిధాలతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్, హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ యాదవ్, ఏక్తాబిస్త్, దీప్తిశర్మ, బ్యాట్స్‌ఉమెన్‌లుగా మిథాలీరాజ్, వేదా కృష్ణామూర్తి, వికెట్ కీపర్ సుష్మావర్మలతో దిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.