కృష్ణ

ఆర్‌బిఐ ద్వారా అన్ని బ్యాంక్‌లకు రూ.1000 కోట్లు జారీపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 12: ప్రజలకు సమాచారం ఇవ్వడంలోను, బ్యాంకుల పరిధిలో అందుబాటులో ఉన్న నోట్లను ప్రజలకు అందించడంలోను బ్యాంకుల మధ్య సంయమనం ముఖ్యమని కలెక్టర్ బాబు ఎ తెలియజేశారు. శనివారం జిల్లాలోని అన్ని బ్యాంకుల ప్రధాన అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ, ఆర్‌బిఐ ద్వారా జిల్లాలోని అన్ని బ్యాంకులకు 100, తదితర నోట్ల జారీ విషయమై ప్రభుత్వం ద్వారా చర్చలు జరుపుతున్నామన్నారు. ఇప్పటికే ప్రజల అవసరాల మేరకు నిధులను పంపిణీ చేయడంలో రిజర్వు బ్యాంకు ప్రతినిధులు చొరవ చూపుతున్నారన్నారు. ఏఏ బ్యాంకు పరిధిలో ఎంత మొత్తంలో నగదు పంపిణీకి అవకాశం ఉందో ఆ మేరకు ప్రజలకు లావాదేవీల నిర్వహణ చేపట్టాలని కలెక్టర్ బాబు ఎ సూచించారు. అన్ని బ్యాంకు సేవలు, ఎటిఎంలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎటిఎంలలో 100 డినామినేషన్లతో పాటు, 50 రూపాయల నోట్లు కూడా ఉండేలా సాంకేతికపరమైన చర్యలను చేపట్టాలని ఆయన తెలిపారు.
జిల్లాలోని ప్రతి బ్యాంకు వద్ద సరైన విధానంలో భద్రతా ఏర్పాట్లను, సెక్యూరిటీలను నియమించుకోవాలని, అదేవిధంగా ఏటిఎంల వద్ద కూడా భద్రతా సిబ్బందిని నియమించాలన్నారు. ప్రతి బ్యాంకు పరిధిలోను బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అక్కడ పరిస్థితులను పర్యవేక్షించేందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని బ్యాంకు అధికారులతో సమన్వయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పరిధిలోని అన్ని బ్యాంకులు, అన్ని ఎటిఎంల యథార్థ స్థితిగతులను అంచనా వేయడం, తగిన సూచనలు చేయడం జరుగుతోందన్నారు. మేలైన బ్యాంకు సేవలను అందించేందుకు టోల్ ఫ్రీ నెంబరు సమాచారాన్ని బ్యాంకులు అందించాలన్నారు. బ్యాంకు నుండి డబ్బులు విత్‌డ్రా చేసుకునే వారికి చిన్న డినామినేషన్లు కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రూ.500, రూ.1000 నోట్లను రద్దుపరచిన నేపథ్యంలో ఆయా డినామినేషన్లతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు, పన్నులు, తదితర సేవా పన్నులను పాత నోట్ల రూపంలోనే చెల్లించేందుకు 14న అర్ధరాత్రి వరకు వీలుందని కలెక్టర్ బాబు ఎ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని చిన్న తరహా బ్యాంకులకు ఎస్‌బిఐ, ఆంధ్రా బ్యాంకులు అందుబాటులో ఉన్న మొత్తాల నుంచి కొంతమేర అందించాలని, అదే సందర్భంలో ఆర్‌బిఐ నుండి వచ్చే నగదు మొత్తాలను వివిధ ఎటిఎంలలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయా ఎటిఎంలలో నగదు ఏ సమయానికి అందుబాటులో ఉంటుందో కూడా ప్రదర్శింపజేయాలన్నారు.
ప్రజల నుండి అత్యధిక శాతంలో బ్యాంకులలో డిపాజిట్లు వేయడానికి ప్రజలు వస్తున్నారని ఇందుకోసం బ్యాంకు సమన్వయ కర్తల ద్వారా ఆయా మొత్తాలను స్వీకరించేందుకు బ్యాంకర్లు చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ బాబు ఎ తెలిపారు. బ్యాంకుల అధికార బ్యాంకు కరస్పాండెంట్ (బిసి)లకు ఆయా మొత్తాలను డిపాజిట్లు చేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఖాతాదారుల డిపాజిట్ల మొత్తం రిసీట్స్ తప్పనిసరిగా తీసుకోవాలని, బ్యాంకులు జారీ చేసే చిల్లర నోట్లు, 2000 రూపాయల నోట్లను తీసుకోవటంలో ముందుకు రావాలని ఆయన కోరారు. టెలి కాన్ఫరెన్స్ సందర్భంలో లక్ష్మీశాతో పాటు ఆంధ్రా బ్యాంకు ఎల్‌డియమ్ జి.వెంకటేశ్వర రెడ్డి, ఆంధ్రా బ్యాంకు ఎజియమ్ కృష్ణారావు, యస్‌బిఐ, యస్‌బిహెచ్, సిండికేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐవోబి, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యస్‌జిబి ఆర్‌డివోలు చక్రపాణి, సాయిబాబా ఇతర బ్యాంకర్లతో టెలి కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంలో క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులు వెళ్లాలని ఇ-సేవా కేంద్రాలు నిరంతరం పనిచేసేలా చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు.