కృష్ణ

నేడు కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 13: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగినపూడి వద్ద సముద్ర తీరంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి పర్వదినం పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజైన సోమవారం రావటంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మంగినపూడి సముద్ర తీరంలో సుమారు రెండు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా పలు శాఖల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు నేతృత్వంలో బీచ్ వద్ద పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. వేకువఝామున 4.15 గంటలకు పౌర్ణమి జ్యోతి ప్రజ్వలనతో సముద్ర స్నానాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6గంటల వరకు సముద్రంలో పుణ్యస్నానాలు చేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 4గంటలకు వేదపండితుల ఆధ్వర్యంలో అమృతపాశుత సహిత రుద్రహోమం, 5గంటలకు జ్వాలాతోరణం, 6గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ శివలింగం వద్ద కార్తీక దీపారాధన, 6.30కి సాగర హారతి, 7 గంటలకు కళ్లు మిరిమిట్లు గొలిపేలా క్రాకర్ షో నిర్వహించనున్నారు. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు పుణ్యస్నానాలకు విచ్చే భక్తుల కోసం సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంలో ఉన్న మంగినపూడి సముద్ర తీరానికి ప్రతి యేటా పౌర్ణమికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. లక్ష నుండి లక్షన్నర మంది వరకు భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ ఏడాది మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక చొరవ తీసుకుని పెద్దఎత్తున ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన చేయటంతో రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. తదనుగుణంగా గత వారం రోజులుగా ఆర్డీవో పి సాయిబాబు, ఎంపిడివో జివి సూర్యనారాయణ పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు మూడు విడతలు సమావేశాలు నిర్వహించి శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షలు జరిపారు. సముద్రంలో స్నానాలు చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులు సముద్రం లోలోపల వరకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే మెరైన్ బోట్‌తో పాటు 20 బోట్లు, 60 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాల అనంతరం మహిళలు దుస్తులు మార్చుకునేందుకు 80 తాత్కాలిక డ్రస్సింగ్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. బందరు డిఎస్పీ శ్రావణ్‌కుమార్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాలుకా సర్కిల్ పరిధిలో సుమారు 300 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు 200 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. ఆర్‌డబ్ల్యుఎస్, పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు భక్తులకు మంచినీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. బీచ్‌కు వెళ్లే వాహనాలన్నింటినీ తాళ్ళపాలెం బడ్డీల సెంటరు నుండి గిరిపురం మీదుగా లైట్‌హౌస్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది.

సరి! ‘పోయింది’
పాయకాపురం, నవంబర్ 13: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది నగర ప్రజల పరిస్థితి. మొన్న మొన్నటి వరకు రూ.500, రూ.1000 నోట్లకు ఉన్న డిమాండ్ అనూహ్యంగా పడిపోవడంతో నగదు మార్పిడి తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో సామాన్యుడు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రెండు రోజుల క్రితం నగదు మార్పిడికి సంబంధించి కేవలం ఆధార్ కార్డు నకలు సమర్పిస్తే నగదు మార్పిడి జరిగే ప్రక్రియ ఉండేది. ప్రస్తుతం ఆ విధమైన లావాదేవీలేవీ బ్యాంకుల్లో సరిగ్గా చోటు చేసుకోడం లేదు. అధికారులు చెప్పిన ప్రకారం రోజుకి రూ.4000 వరకు నగదు మార్పిడి విధానం ఉంటుందని చెప్పారు. కాగా ఆదివారం నాడు అజిత్ సింగ్ నగర్‌లోని ఓ బ్యాంకుకు వెళ్లిన జనానికి చేదు అనుభవమే ఎదురయ్యింది. ఇప్పటికే ఆధార్ కార్డు నేపథ్యంగా అప్లికేషన్ పూర్తి చేసిన వారికి ఒక్కసారి రూ.4000 నగదును మార్పిడి చేసుకున్నాక మళ్లీ ఈ నెల 24వ తేదీ వరకు నగదు మార్పిడి చేసుకునే అవకాశం లేదని బ్యాంకు మేనేజర్ స్పష్టం చేశారు. దీంతో అనేక మంది వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా నగదు మార్పిడి కోసం వచ్చే వినియోగదారులు ఆయా బ్యాంకుల్లో రూ.100కు బదులుగా రూ.2000 నోట్లనే బ్యాంకు అధికారులు అందజేస్తున్నారు. రూ.2000కు తగ్గిన మొత్తానికి సంబంధించి బ్యాంకుల్లో రూ.100 నోట్లు ఇప్పటికే అందుబాటులో లేవు. దీంతో ఇటు బ్యాంకు అధికారులు, అటు సామాన్య జనం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినట్లుగా రూ.500 నోట్లు ఇప్పటికీ నగరంలోని ఏ బ్యాంకుల్లో జారీ కాలేదు. ఈ క్రమంలో ముందుకు పోతే నుయ్యి, వెనుకకు వేస్తే గొయ్యి’’ అన్నట్లుగా సామన్యుని పరిస్థితి ఉంది. దీనికి తగ్గట్లుగానే ఎటిఎంలలో సైతం క్షణాల వ్యవధిలో నగదు ఖాళీ కావడంతో తాకిడికి తగ్గట్లుగా కస్టమర్లకు నగదు అందజేయడంలో ఇటు అధికారులూ, అటు బ్యాంకులు విఫలమవుతున్నాయనే విమర్శలు సర్వత్రా వ్యక్తవుతున్నాయి. పోలీసుల బందోబస్తు మధ్య బ్యాంకుల దగ్గర నగదు మార్పిడి చర్యలు చేపట్టినప్పటికీ వినియోగదారులకై అవసరమైన మేరకు నగదు మార్పిడి జరక్కపోవడం, డిపాజిట్ మిషన్లు పనిచేయకపోవడంతో ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అటు నగదు మార్పిడి ద్వారా కేవలం రూ.2000ను అధికారులు ఇవ్వడం, అటు ఎటిఎంలలో సైతం రూ.100 రాకపోవడంతో రూ.2000 డ్రా చేస్తే కొత్త రూ.2000 నోటు వస్తోంది. ఇదే నోటును పెట్రోలు బంకు షాపింగ్ మాల్స్‌లలో ఇస్తే మిగిలిన నగదుకు పాత నగదునే ఇస్తున్నారు. దీంతో కొత్తనోట్లు చిల్లర లేక, పాతవి చలామణి కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సర్కారు వ్యవస్థ పరిష్కారం చూపాల్సి ఉంది.