కృష్ణ

2019లో మోదీ కూడా చెల్లని నోటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: కార్పొరేట్ వర్గాలకు ముందుగానే లీక్ చేసి సామాన్యులను ముప్పు తిప్పలు పెట్టే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన కరెన్సీ సర్జికల్ దాడి 2019 ఎన్నికల్లో ఆయనను చెల్లని నోటుగా మార్చడం ఖాయమని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ హెచ్చరించారు. శనివారం స్థానిక సిపిఐ దాసరి భవన్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్యతో కలిసి విలేఖర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ రద్దు చేసిన పెద్ద నోట్ల కారణంగా పెద్ద మొత్తంలో నల్లధనం నిల్వ చేసిన వారికి, వేల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టే పెట్డుబడిదారీ వర్గాలకు నష్టం చేకూరుతుందంటే సంతోషించేవారమని, కాని కేవలం సామాన్యులు మాత్రమే ఇబ్బంది పడుతున్నారన్నారు. బ్యాంకుల ముందు సంపన్న వర్గాలకు చెందిన ఒక్కరు కూడా నిలబడకపోవడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. అలాగే దేశంలో సామాన్యులు వందల మంది మృతి చెందగా ఒక్క ధనవంతుడు కూడా చనిపోయిన దాఖలాలు లేవన్నారు. బిచ్చగాళ్ల దగ్గర నుండి మధ్య తరగతి వరకు రోజువారీ వినియోగానికి డబ్బుల్లేక బ్యాంకుల ముందు గంటల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వివాహ, ఇతర వేడుకలను సైతం నిర్వహించడానికి డబ్బుల్లేక పేదలు నానా ఇక్కట్లకు గురి కాగా, అదే గాలి జనార్థనరెడ్డి లాంటి వారు వందల కోట్లు వెచ్చించి తన కూతురు వివాహాన్ని అత్యంత ఆడంబరంగా సునాయాసంగా నిర్వహించగలిగారంటే పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎవరిపై తీవ్రంగా ఉందో స్పష్టమవుతోందన్నారు. త్వరలో 5రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందడం కోసమే మోదీ ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల తన ప్రాణానికి ముప్పు ఉందనే సెంటిమెంట్‌తో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఒక్క పక్క ఆయనే జనం ప్రాణాలు తీస్తుంటే ఆయననెవరు చంపుతారని నారాయణ ప్రశ్నించారు. ఇక కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యవహారం మరీ దారుణంగా ఉందన్నారు. బిజెపి విధానాలను విమర్శించే వారందర్నీ దేశద్రోహులంటున్నారని, ఈ దేశంలో గాంధీని చంపిన ఆర్‌ఎస్‌ఎస్ వారికంటే దేశద్రోహులెవరున్నారో చెప్పాలని సవాల్ చేశారు. ఈ నెల 21, 22న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 22న ఇదే అంశంపై సహకార కో-ఆపరేటివ్ బ్యాంకుల యూనియన్‌లు నిర్వహిస్తున్న ఆందోళనకు కూడా సిపిఐ మద్దతిస్తున్నట్లు తెలిపారు.

సిమెంట్ ధర తగ్గించాలి
* సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ బాబు ఎ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 19: జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందించే దిశగా నిర్మాణాలకు అవసరమైన సిమెంట్‌ను బస్తా రూ. 230లకే అందించాలని సిమెంట్ కంపెనీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ బాబు ఎ కోరారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ బాబు ఎ శనివారం గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఎన్టీఆర్ గృహాలను అందించేందుకు జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. వీటిని మరింత వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించే ప్రక్రియలో భాగంగా సిమెంట్‌ను బస్తా రూ. 230లకే అందించాలని 14 సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. జిల్లా కలెక్టర్ కోరిన విధంగా జిల్లా ఎన్టీఆర్ గృహా నిర్మాణాలకు గాను సిమెంట్ బస్తాను రూ. 230లకే అందించేందుకు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన గ్రామీణ ప్రాంతంలో నిర్మించే 15,500 గృహాలకు, పట్టణ ప్రాంతంలో 1850 గృహాలతోపాటు ప్రధాన మంత్రి అవాస్ యోజన గ్రామీణ్ కింద 4462 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నందున త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందని ఆయన కంపెనీల ప్రతినిధులకు వివరించారు. దాదాపు అన్ని సిమెంట్ కంపెనీలు జిల్లాలో ఉన్నందున ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ వి శరత్‌బాబు, 14 సిమెంట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.