కృష్ణ

కృష్ణాలో 620 ఎటిఎంలలో రూ.25కోట్లు విలువైన రూ.500ల నోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 23: కృష్ణా జిల్లాలోని 620 ఎటిఎంలలో రూ.25 కోట్ల విలువైన రూ.500 నోట్లను అందుబాటులో ఉంచినట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ నెంబర్‌తో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ ముఖ్యమంత్రిని కోరారు. కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుండి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ బాబు ఎ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యుఎస్‌ఎస్‌డి ట్రాన్‌జెషన్ ద్వారా విధించే చార్జీని రద్దు చేయాలని, అదే గ్రామీణ ప్రాంతాల్లో ఐఎఫ్‌ఎఫ్‌సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్లను అడుగుతున్నారని, ఇది ప్రజలకు ఇబ్బందిగా ఉండడంతో ఆధార్ నెంబర్‌తో లావాదేవీలు నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, ఎల్‌డిఎం వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాల వర్తకంపై
రేపటి నుండి కెబిఎన్‌లో జాతీయ సదస్సు
పాతబస్తీ, నవంబర్ 23: కాకరపర్తి భావనారాయణ కళాశాల డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో ‘అంతర్జాల వర్తకం-పొకడలు, సవాళ్ళు, అవకాశాలు’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు ఆ కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పల సాంబశివరావు, ఎన్.రజిత్‌కుమార్‌లు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల కమిటీ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమవేశంలో వారు మాట్లాడారు. గడిచిన రెండు దశాబ్దాలుగా అంరత్జాల(ఆన్‌లైన్) వ్యాపారం విస్తృతమైందన్నారు. అనేక కంపెనీలు తమ ప్రకటనలు, విలువైన సేవలతో ప్రజలకు చేరువయ్యారని చెప్పారు. అంతేకాకుండా భారీ వ్యాపార లావాదేవీలు ఆ మాధ్యమం ద్వారా జరుగుతున్నాయన్నారు. అటువంటి అంతర్జాల వర్తక రంగానికి భారతదేశం వంటి దేశాల్లో ఇంకా మరింత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆ అవకాశాలతో పాటుగా ఆ రంగంలో చోటు చేసుకున్న సమస్యలు, విస్తృతి తదితర అంశాలపై ఈ జాతీయ సదస్సులో చర్చ జరగనుందన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సహకారంతో ఈ సదస్సు జరగనుందన్నారు. 25వ తేదీన జరిగే సదస్సు ప్రారంభోత్సవ సభకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారన్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య కె.రామమోహనరావు కీలకోపన్యాసం చేస్తారని చెప్పారు. మినర్వా గ్రూప్ ఆఫ్ హోటల్స్ డైరెక్టర్ మాజేటి సురేంద్రనాధ్ న్యూఢిల్లీకి చెందిన రిటైల్ లెర్నింగ్ డైరెక్టర్ లారెన్స్‌ఫెర్నాండ్స్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ ఆచార్య జి.ప్రసాద్ తదితరులు హాజరవుతారని చెప్పారు. 26న జరిగే ముగింపు సభకు కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య డి.సూర్యచంద్రరావు ముఖ్యఅతిథిగా హాజరవుతారని వివరించారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు, పిజి కళాశాల డైరెక్టర్ డాక్టర్ డివి రమణమూర్తి, సదస్సు కన్వీనర్ డాక్టర్ బెజవాడ రామయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా, టిడిపి ఎన్నికల హామీలపై
28న ప్రజా బ్యాలెట్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 23: ప్రత్యేక హోదాతోనే ఎపి అభివృద్ధి సాధ్యం అని, ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని డిసిసి అధ్యక్షుడు ధనేకుల మురళీ మోహన్ అన్నారు. బుధవారం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, అధికార ప్రతినిధి వింతా సంజీవరెడ్డి, కార్యదర్శి బొడపాటి బాబూరావు, పొనుగుపాటి నాంచారయ్యలతోకలిసి మాట్లాడారు. ఎపికి ప్రత్యేక హోదా కావాలా, వద్దా అని, టిడిపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిందా లేదా అనే రెండు అంశాలపై బందరు కోనేరు సెంటర్‌లో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఎపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ప్రజా బ్యాలెట్ కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య, మరియు మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారన్నారు. అధికార ప్రతినిథి వింతా సంజీవరెడ్డి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం నల్ల కుబేరులకు అండగా ఉందన్నారు. 2000 కొత్త నోట్లు విడుదల చేసి బిజెపి ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు, నల్లధనం అరికట్టడం అని ప్రచారం చేయడంలో అర్థం ఏమిటని అన్నారు. ఎటువంటి కసరత్తు, ముందస్తు జాగ్రత్తలు లేకుండా 85 శాతం ద్రవ్యాన్ని రద్దు చేయడం వారికే చెల్లిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నల్లధనం నిర్మూలించడానికి, అవినీతి అంతమొందించడానికి తీసుకునే చర్యలను స్వాగతిస్తుందన్నారు. ఎపిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా బ్యాలెట్‌కు, రైతు భరోసా పాదయాత్రకు ప్రజల నుంచి ఆదరణ చూసి టిడిపి నాయకులు భయపడి అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఎపిలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుద్నారు. ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారని, హోదా కోసం జాతీయ స్థాయిలో పారాడింది కాంగ్రెస్ అన్నారు. 2019 నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాహుల్ ప్రధాని అయిన తర్వాత ఎపికి హోదా ఇచ్చేది కాంగ్రెస్ అన్నారు.

అనధికారికంగా తిరుగుతున్న
టూరిస్ట్ బోట్లు స్వాధీనం
పాతబస్తీ, నవంబర్ 23: కృష్ణానదిలో అనధికారికంగా తిరుగుతున్న టూరిస్టు బోట్‌లను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఛాంపియన్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన బోట్‌లు కృష్ణానది ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రి నుండి ప్రకాశం బ్యారేజీ వరకు యథేచ్ఛగా తిరగడాన్ని గమనించిన విజిలెన్స్ అధికారులు నాలుగు టీంలుగా ఏర్పడి సంస్థకు చెందిన బోట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇరిగేషన్, పర్యాటక రంగం, అటవీ శాఖ తదితర శాఖల అధికారుల అనుమతులు ఉన్నాయా లేవా అనే అంశంపై రికార్డులు తనిఖీ చేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ఛాంపియన్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన బోట్‌లన్నీ సీజ్ చేశారు. వాటికి సంబంధించిన అనుమతులు ఉన్నయా లేవా, ఉంటే ఏ శాఖ వారు అనుమతులు జారీ చేశారనే అంశాలను కూలంకషంగా తనిఖీ చేస్తున్నారు.

మంగళంపల్లికి ఇస్క్ఫ్ ఘన నివాళి
విజయవాడ, నవంబర్ 23: తెలుగుజాతి గర్వించదగిన నేత, తెలుగు భాషా స్వరానికి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిన గాన ఘనుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ అని సత్యనారాయణపురంలో ఇస్క్ఫ్ ఆధ్వర్యాన జరిగిన మంగళంపల్లి సంతాప సభలోఇస్క్ఫ్ జాతీయ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు మాట్లాడారు. ఫ్రెండ్స్ సర్కిల్ కన్వీనర్ పూజారి దుర్గారావు అధ్యక్షతన జరిగిన సభలోకె.సుబ్బరాజు మాట్లాడుతూ తాను డెప్యూటీ మేయర్‌గా ఉన్న సమయంలో తనకు బాల మురళీతో ఉన్న అనుబంధానుసారం ఆయనకు విజయవాడ నగర పాలక సంస్థచే పౌర సన్మానం చేసేందుకు, సత్యనారాయణపురంలో ఆయన నివశించిన భవనం ఉన్న రోడ్‌కు మంగళంపల్లి బాల మురళీకృష్ణ రోడ్‌గా నామకరణం చేయటానికి ప్రతిపాదనలు చేసే అవకాశం తనకు లభించటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.