కృష్ణ

కేసులకు భయపడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, నవంబర్ 24: నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయించేందుకు చేపట్టిన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని, పోలీసు కేసులకు భయపడేది లేదని పామర్రు డివిజన్ సిపిఎం కార్యదర్శి చేబ్రోలు భాస్కరరావు అన్నారు. వల్లూరుపాలెం లంకలో 323 సర్వే నెంబరులోని ప్రభుత్వ భూమిలోకి గురువారం మూడు వందల మంది పేదలు ప్రవేశించారు. కత్తులు, గొడ్డళ్లతో వచ్చి భూమిలో ముళ్లచెట్లు నరికారు. పదిరోజుల క్రితం జిల్లా సిపిఎం కార్యదర్శి ఆర్ రఘు ఆధ్వర్యంలో ఈ భూమిని పేదలు ఎర్రజెండాలు పాతి ఆక్రమించారు. దాంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ గురువారం భాస్కరరావు, మండల సిపిఎం కార్యదర్శి సిహెచ్ సుబ్బారావు, మండల సిఐటియు కార్యదర్శి వి స్వరూపరాణి ఆధ్వర్యంలో పేదలు భారీగా తరలివచ్చారు. సమాచారం తెలుసుకున్న వీఆర్వోలు బి నాగేశ్వరరావు, కె వీరాస్వామి వచ్చి అడ్డుకున్నా ఫలితం లేకపోవటంతో పోలీసులను రప్పించారు. ముగ్గురు పోలీసులు వచ్చి భూముల నుంచి వెనక్కు రమ్మని కోరినా పేదలు వినలేదు. ఈసందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ లంకల్లో సారవంతమైన భూములను తాము అడగటంలేదని, ఎవరూ వినియోగించని ప్రభుత్వ భూమిని పంపిణీ చేయమంటుంటే అధికారులు స్పందించటం లేదన్నారు. అందువల్ల తాము భూముల్లోకి ప్రవేశించాల్సి వచ్చిందన్నారు. అధికారికంగా పంపిణీ చేసేవరకు తాము పోరాడుతూనే ఉంటామని, అధికారులు కేసులు పెట్టినా భయపడబోమని భాస్కరరావు స్పష్టం చేశారు.