కృష్ణ

ఆధునికంగా గ్రంథాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 28: గ్రంథాలయాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య చెప్పారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్మన్ ఈడ్పుగంటి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేసి ఇంటర్నెట్, వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2 పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేస్తామన్నారు. రూ.84 లక్షల ఖర్చుతో కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎయిర్ కండిషనర్లు, కంప్యూటర్లు ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నారని తెలిపారు. వారి సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ఆధునిక దేవాలయాలుగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతామన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను పాలకవర్గం ఆమోదించింది. రూ.22కోట్ల 59లక్షల 29వేల 533లు బడ్జెట్ అంచనాలను ఆమోదించారు. నందిగామ, కైకలూరు, నూజివీడు, మైలవరం, లక్ష్మీపురం, ఉయ్యూరు, జగ్గయ్యపేట, మోపిదేవి, ఆత్కూరు, కాజ, పెనుమత్స గ్రంథాలయాల భవన నిర్మాణాలకు అంచనాలను ఆమోదించారు. మరుగుదొడ్లు లేని గ్రంథాలయాల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీ పోస్టుల భర్తీకి అడ్డంకిగా ఉన్న కోర్టు కేసుల ఎత్తివేతకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గ్రంథాలయాలు లేని గ్రామాల్లో పది నూతన పుస్తక పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈడ్పుగంటి వివరించారు. నూతన పాలకవర్గాన్ని అభినందించేందుకు వచ్చిన టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ గ్రామ ప్రజలు పట్టణాలకు వలసపోయి పట్టణ సంస్కృతికి అలవాటు పడుతున్నారన్నారు. గ్రామీణులను విజ్ఞాన పథం వైపు నడిపించేది గ్రంథాలయాలేనన్నారు. విద్యాసంస్థలు పాఠాల బోధనకే పరిమితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంథాలయ పన్ను వసూళ్లకు స్థానిక సంస్థలు కృషి చేయాలన్నారు. వసూలు చేసిన పన్నును నూరుశాతం గ్రంథాలయానికి చెల్లించాలని కోరారు. ప్రతి మైనర్, మేజర్ గ్రామ పంచాయతీల్లో గ్రంథాలయాలు ఉండాలని అర్జునుడు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు ఆర్ రామకోటేశ్వరరావు, పి విజయశేఖర్, వి మల్లిఖార్జునరావు, షేక్ హబీబుల్లా, బి కనకదుర్గ, టి పార్వతి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వై కృష్ణారావు, డిపిఆర్‌ఓ గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు.