కృష్ణ

ప్రపంచ శాంతికే అంతరిక్షాన్ని ఉపయోగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 25: అంతరిక్షం ప్రపంచ శాంతికి వినియోగించాలే గాని యుద్ధోన్మాదాన్ని పెంచి పోషించడం కొరకు కాదని యుఎస్‌ఎ గ్లోబల్ నెట్‌వర్క్ సమన్వయ కర్త బ్రూస్ గగనాన్ పేర్కొన్నారు. పిబి సిద్ధార్థ కళాశాల మరియు ఇస్క్ఫా (ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్, కోఆపరేషన్ మరియు ఫ్రెండ్‌షిప్) సంయుక్తంగా (అంతరిక్షం శాంతి కోసం యుద్ధానికి కాదు) అనే అంశంపై నిర్వహించిన సదస్సులో బ్రూస్ గగనాన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవాళికి హాని కల్గించే అణ్వాయుధాలను యుద్ధానికి వాడరాదని అగ్ర రాజ్యాలకు సూచించారు. అగ్రరాజ్యాలన్నీ ప్రపంచ శాంతివైపు అడుగు వేయడానికి ఒకరికొకరు సహకరించుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. డేవ్‌వెబ్ (యుకె) ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం విశ్వ పరిరక్షణకు వినియోగించాలే తప్ప భూమండలానికి హాని కలిగించే విధంగా కాదని వివరించారు. ప్రతి దేశంకు శాంతిని కాపాడుకునే హక్కు ఉందని గుర్తించాలని సూచించారు.
విలియమ్ ఫ్రీఫిన్ (జర్మనీ) మాట్లాడుతూ మహిళలు యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వారికి పరోక్షంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. జపాన్‌లో హిరోషిమా, నాగసాకిలో 1945లో జరిగిన అణుబాంబు యుద్ధం ప్రభావానికి ఇప్పటికీ అక్కడి ప్రజలు కొంతమంది జీవచ్ఛవాలుగా జీవిస్తున్నారన్నారు. మనం అందరం యుద్ధాల నుండి దూరంగా ఉండి శాంతి, సహకార, స్నేహభావంతో జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కళాశాల డీన్ ప్రొ.రాజేష్, పి.జంపాల పర్యవేక్షించగా, కళాశాల ప్రిన్సిపాల్ డా.మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, సిద్ధార్థ అకాడమి కార్యనిర్వహణాధికారి టి.రమేష్, అధ్యాపకులు, విద్యార్థులతో పాటు మాజీ శాసనసభ్యుడు కె.సుబ్బరాజు, భారత ఇస్క్ఫా సమన్వయ కర్త కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.